-రాష్ట్రాన్ని రావాణ కాష్ట్రంగా మార్చిన జగన్ రెడ్డి ఇంటికి పంపాలి
-పోలీసులు వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలకు కాపుకాయడం సిగ్గుచేటు
-జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజవర్గం జరిగినది
విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మినీ మేనిఫెస్టో ను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అరాచకాలు ,దోపిడీలు సాగుతున్నాయి. విశాఖ రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వైసిపి వచ్చాక విశాఖలో శాంతియుత వాతావరణం దెబ్బతీశారు జగన్, విజయ సాయిరెడ్డిల ఆశీస్సులు చూసుకునే వైసీపీ పేటియం బ్యాచ్, భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. టిడ్కో లబ్దిదారులను పక్కనపెట్టి తమ అనుచరులకు ఇచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇష్టం వచ్చినట్లు లిస్టులు మార్చేసి నిజమైమ లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఏపి ఆర్ధిక పరిస్ధితి పూర్తిగా దెబ్బతింది. ఇంటి యజమానిపై పదిలక్షల అప్పు భారాన్ని జగన్ మోపారు. ఈ ఆపద నుంచి రాష్ట్రం బైటపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. విశాఖ పార్లమెంట్ భీమిలి నియోజకవర్గంలో టిడిపి భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్రలో దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సు యాత్రను ప్రారంభించిన టిడిపి నాయకులు.
జోన్ -1 కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ… రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది అన్న ఎన్ టి ఆర్ విశాఖ ను అభివృద్ధి చేసింది చంద్రబాబే. భీమిలి కి ఐటీ పరిశ్రమ ను తీసుకువచ్చారు. భీమిలి నియోజకవర్గంలో అత్యంత విలువైన భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారు. విశాఖలో జరిగిన భూ కబ్జాలు పై టీడీపీ ప్రభుత్వం రాగానే జ్యూడిషియల్ విచారణ జరిపించాలని చంద్రబాబు ను కోరుతున్నాను. తల్లి కడుపులో ఉంది డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. హుద్ హుద్ సమయంలో బస్సు లో ఉంది విశాఖ పునర్ నిర్మించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ ఆయన సతీమణి విశాఖ కు వచ్చారంటే భూములుపైనే దృష్టి పెడతారు.
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కామెంట్స్…
టీడీపీ మినీ మేనిఫెస్టో కి విశేష స్పందన వస్తుంది. సీఎం జగన్ దుబారా ఖర్చును సంపదగా మార్చుకొని సంక్షేమ పథకాలు అందిస్తాము. సంపదను సృష్టించడంలో చంద్రబాబు దిట్ట. పేద ప్రజల రక్తాన్ని సీఎం జగన్ జలగా లా పీల్చుకు తింటున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్. రాష్ట్రాన్ని అప్పుల బాధ నుంచి బయటకు తీసుకు రాగలిగే శక్తి ఒక చంద్రబాబునాయుడుకే ఉంది. భీమిలి నియోజకవర్గంలో సీఎం జగన్ అత్యధికంగా దోచుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారు.
విశాఖ: మాజీ మంత్రి కళా వెంకట రావు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం టీడీపీ ఖాతా లోకి రావడం ఖాయం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సీఎం జగన్ ఒక చేతితో 10 రూపాయిలు ఇచ్చి ఇంకో చేతితో 100 రూపాయిలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం త్రాగి అనేక మంది అనారోగ్యాలు పాలయ్యారు. సీఎం జగన్ మద్యం త్రాగడం వలన చాలా మందికి కళ్ళు పోతున్నాయి. రాష్ట్రంలో ఇసుక పేరుతో దోచుకుంటున్నారు.
రాష్ట్రంలో మరో కొద్దీ రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్ రాష్ట్ర ప్రజల పై అప్పుల భారాన్ని మోపుతున్నారు. రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అలుపెరగని వీరుడు చంద్రబాబు నాయుడు.మన రాష్ట్రం అభివృద్ధి ,సంక్షేమం లో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిశ్రమలలో ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదు. లోకేష్ యువగళం పాదయాత్ర నిర్విరామంగా సాగుతుంది. రానున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం తెలియజేశారు.
మాజీ మంత్రులు కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జి, లలిత కుమారి, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్దా నాగజగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
జోన్ -3 కార్యక్రమం
తాడికొండ నియోజకవర్గం బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్బమాట్లాడుతూ… ఉదయం 10 గంటలకు తాడికొండ నియోజకవర్గం, తుళ్లూరు మండలం, వడ్డమాను గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. సుమారు 500 మందికి పైగా కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు అనంతవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు అనంతవరం గ్రామంలో తెదేపా హయాంలో కట్టిన టిడ్కో గృహాలను చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మధ్యాహ్నం 1:15 గంటలకు నెక్కల్లు గ్రామంలో తెదేపా హయాంలో నిర్మించిన బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్ ని చూపించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పెదపరిమిలోని శ్రీనివాసరావు కల్యాణ మండపంలో 1000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
సాయంత్రం 6 గంటలకు ఐనవోలు గ్రామంలో టీడీపీ హయాంలో నిర్మించిన VIT AP కాలేజి, NGO’s హౌసెస్, జడ్జెస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ చూపించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం 7 గంటలకు వెలగపూడి గ్రామంలో త్రవ్విన రోడ్లను చూపించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం 7.30 గంటలకు ఉద్దండరాయినిపాలెం గ్రామంలో తెదేపా హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని శంకుస్థాపన వద్ద సెల్ఫీ చాలెంజ్ చేశారు. సాయంత్రం 8 గంటలకు తుళ్లూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారవు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర కుమార్, గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్, గుంటూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు దాసరి రాజా మాస్టారు, మానుకొండ శివప్రసాద్, చిట్టాబత్తిన శ్రీనివాసరావు (చిట్టిబాబు), కూచిపూడి విజయ, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు సుఖవాసి శ్రీనివాసరావు, దామినేని శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివ సాంబిరెడ్డి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు తలతోటి సురేంద్ర, మండల అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, తలసిల ప్రసన్నకుమార్, మల్లిపెద్ది రమేష్, మండవ చిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ బస్ యాత్ర 5కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వివరిస్తూ జరుపుతున్న పర్యటన. రాజధాని అమరావతి ప్రాంతమైన పెదపరిమిలో టీడీపీ తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. బోగస్ బటన్ నొక్కుడు పేరుతో మోసపు పరిపాలన చేస్తూ నయవంచన చేస్తున్నారు. ఒకపక్క ప్రజలను, మరోపక్కా విద్యార్ద్యులను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకు కొత్త పేర్లు పెట్టి ప్రజలను, విద్యార్ద్యులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రైతులను మోసం చేయడానికి రైతురధం పేరుతో గత ప్రభుత్వం హయాంలో కోట్లాది రూపాయల పధకం అమలు చేస్తే నేడు పథకాన్ని నిర్వీర్యం చేసాడు. అమ్మకు వందనం పేరుతో టీడీపీ మ్యానిఫెస్టోలో ఇంటిలో ఎంతమంది చదువుకొనే పిల్లలు ఉంటే అ oతమందికి పధకం అమలు చేస్తాం. వైసీపీ హయాంలో పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి అమరావతి తో కనబడుతుంది.
పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ…. అమరావతి రాజధానికి మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయనడానికి నిదర్శనం భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో బస్ యాత్ర విజయవంతం అవ్వడమే. గజదొంగపరిపాలనలో అమరావతి ప్రజలు. రాబోయే రోజుల్లో అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళల పై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల రాజ్యం రావాలంటే చంద్రన్న రావాలని పిలుపునిచ్చారు.
మాజీమంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ…. కులమతాలకు అతీతంగా రాజధాని దేశంలో ఏదైనా ఉందంటే అది అమరావతి రాజధాని ఒక్కటే. సంపద సృష్టించే రాజధాని అమరావతిని వైసీపీ అధికారంలోకి రాగానే సర్వనాశనం చేసింది. ముఖ్యమంత్రి ఒక మానసిక రోగి అందుకే అమరావతి అభివృద్ధి లేకుండా చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పులివెందుల రాజకీయాన్ని అమలు పరచాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్.
అమరావతిలో రాజధాని మహిళలు పోరాటం చేస్తుంటే పోలీసులు బూటుకాళ్ళకింద మహిళల కంఠాలు నలిగిపోయిన సంగతి ఇంకా మరచిపోలేదు. సీపీ అధినేత వై నాట్175 అనే నినాదం చూస్తుంటే ముందుగా జగన్మోహన్ ఇంటినుంచే ప్రారంభం కానుంది.ముఖ్యమంత్రి చక్కటి అబద్ధాలకోరు అనడానికి దేవుని దయ అనే ఒకేఒక మాటతోనే ప్రారంభవుతుంది.రాష్ట్రంలో ప్రతిఒక్కరు ఆత్మవంచన లేకుండా వైసీపీ పార్టీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా బలం. యువగళం అంటూ నారా లోకేష్ పాదయాత్ర వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికిగుదిబండగా మారిపోయాడు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… రాజధాని కోసం తరతరాలుగా నమ్ముకున్న భూమిని రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే అలాంటి అమరావతిని సర్వనాశనం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజదానిపై విషప్రచారాన్ని విరిజిమ్మిన నేత జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉంది పోలీసు పహారాలో తెర గుడ్డలు అడ్డుపెట్టుకొని అసెంబ్లీకి వెళ్లిన చేతగాని ముఖ్యమంత్రి.
అమరావతి రాజధాని పోరాటం అజరామం. స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడారు. అధికార పార్టీలో ఉన్న కొంతమంది నేతలు దొంగతనాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. చివరకు వైసీపీ నేతలు సైతం రక్షణలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుంది అనటానికి వైసీపీ ఎంపి కుటుంబ సభ్యుల కిడ్నాప్ చేయడమే అంటూ గుర్తు చేశాడమే.
జోన్ -5 కార్యక్రమంలో
అనంతపురము అర్బన్ నియోజకవర్గ బస్సుయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అనంతపురం పార్లమెంట్ పరిధిలో మూడవ రోజు బస్సు యాత్ర అనంతపురము అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నగరంలోని JNTU వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన Tidco Houses ప్రాంతం నుండి ప్రారంభించడం జరిగింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో ప్రారంభించడం జరిగింది.
JNTU వద్ద గల Tidco Houses (పూర్తికావచ్చి, పాడవుతున్న భవనములు) బస్సు యాత్ర ప్రారంభమైనది. JNTU వద్ద తెదేపా ప్రభుత్వహయాంలో పూర్తిచేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తెదేపా నాయకుల బృందం చేరుకొని సెల్ఫీ దిగారు. సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నుండి హోసింగ్ బోర్డు మీదుగా కలెక్టర్ ఆఫీసు ఎదురుగ ఉన్న డాక్టర్ Father Vincent Ferror గారి విగ్రహానికి నాయకుల బృందం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నగరంలోని చెరువుకట్టపై తెదేపా ప్రభుత్వహయాంలో ఏర్పాటుచేసిన జన్మభూమి పార్కును ఇప్పటి వైసీపీ పాలకులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని నాయకుల బృందం సందర్శించి సెల్ఫీ దిగారు. గుత్తి రోడ్డు నందు వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన అన్నా కాంటీన్ ను సందర్శించి నాయకుల బృందం సెల్ఫీ దిగారు. నగరంలోని పాతవూరు, త్రివేణి టాకీస్ క్రాస్, సూర్యనగర్ రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ చేరుకొని, అనంతరం DRDA ఆఫీసు వద్ద అసంపూర్తిగా ఉన్న కల్లూరు సుబ్బారావు మ్యూజియం భవనాన్ని సందర్శించి సెల్ఫీ దిగారు.
భోజన విరామం. యాత్ర తెదేపా ప్రభుత్వ హయాంలో కోర్ట్ రోడ్ నందు పూర్తిచేసిన NTR Musiem ను సందర్శించి నాయకుల బృందం సెల్ఫీ దిగారు. కోర్ట్ రోడ్ నుండి క్లోక్ టవర్ నుండి ఆర్ట్స్ కాలేజి వద్ద గల స్వర్గీయ NTR గారి విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలతో నివాళులు అర్పించారు.
రామచంద్ర నగర్ మీదుగా ఎర్రనేల కొత్తలు ప్రాంతం చేరుకొంది. అక్కడ పార్టీలో అక్కడి ప్రాంత ప్రజలు చేరారు. నిమిషాలకు యాత్ర రాజీవ్ కాలనీ వారధిని సందర్శించి సెల్ఫీ దిగారు. యాత్ర మరాఠీ కాలనిలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి చేరుకొంది. అక్కడ తెదేపా నాయకుల బృందం ఇటీవల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 పథకాలు, వైసీపీ అవినీతి అక్రమాలపై ప్రసంగించారు.
అనంతపురము అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ వి. ప్రభాకర్ చౌదరి, అనంతపురము పార్లమెంట్ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మదినేని ఉమామహేశ్వర నాయుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఏపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామమోహన్, గాజుల అదెన్న, ఏపి రాష్ట్ర పార్టీ కార్యదర్శులు టి. ఆదినారాయణ, దేవళ్ల మురళి, కురుబ శివబాల, వెంకటశివుడు యాదవ్, గోనుగుంట్ల విజయకుమార్, మాజీ మేయర్ స్వరూప, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు జె. గౌస్ మోద్దీన్, నగర కమిటీ కార్యవర్గం, క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు.