Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం

– వైసీపీ అధికారoలోకి వచ్చిన వెంటనే మద్యపానం నిషేధం చేస్తానన్న జగన్ రెడ్డి మాట తప్పాడు మడమతిప్పాడు
– రాష్ట్రంలోని యువత ఆరు నెలల్లోజగన్ రెడ్డిని ఇంటికి పంపటానికి సిద్ధంగా ఉన్నారు

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం.

జోన్-1 పరిధిలోని అరకు పార్లమెంట్, పాలకొండ నియోజకవర్గం నుందు నియోజకవర్గం ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఇంఛార్జి పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనాయకులు, స్థానిక నాయకులతో కలిసి బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది. యాత్ర ప్రారంభించిన అనంతరం వీరఘట్టం మండలం విక్రంపురం గ్రామం నందుస్వాగత కార్యక్రమం జరిగింది. అనంతరం పోలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించారు.

అనంతరం వీరఘట్టం లో అంబేడ్కర్ జుంక్షన్లో రోడ్ వైండిగులో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు భరోసా, అనంతరం చిదిమి రోడ్ సందర్శించారు. అనంతరం సింగిపురం జుంక్షన్లో తోటపల్లి యడమ కాలువ మరియు అసంపూర్తిగా వున్న జంపర్కోట జలాశయం పరిశీలించి సెల్ఫీ కార్యక్రమం. అనంతరం పాలకొండ లో ntrవిగ్రహానికి పూలమాలలు వేసి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. నాన్ అమృత్ స్కీమ్ వద్ద సెల్ఫీ , అనంతరం రైతు బజార్ శిలాఫలకాన్ని పరిశీలించి సెల్ఫీ, అనంతరం సీతంపేట మండలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశీలించి సెల్ఫీ ఛాలెంజ్ ,అనంతరం ntrఅడ్వెంచర్ పార్కును పరిశీలించారు.

అనంతరం బట్టిలి ఎత్తిపోతల పథకం సందర్శించారు, అనంతరం బట్టిలి గ్రామంలో నియోజకవర్గంలో గల గ్రామాలనుండి వచ్చిన జనసమూహం మధ్య బహిరంగ సభ భారీగా జరిగింది. అనంతరం ఇటీవల తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మిని మేనిఫెస్టో ను బహిరంగ సభలో ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమం నియోజకవర్గంలొ విజయవంతం అయింది.

ఈ కార్యక్రమంలో పోలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు , కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి,తోయక జగదీశ్వరి, పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు కలమట, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు , మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి , పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ,డొంకాడ రామక్రిష్ణ, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిది పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా ముఖ్య నాయకులు కురుపాం నియోజకవర్గంలో గల అన్ని మండలాల మండలపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

జోన్-2 టిడిపి చైతన్య రథయాత్ర బుధవారం నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి కన్వీనర్ గంటి హరీష్ బాలయోగి, కో కన్వీనర్ నామన రాంబాబు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథబాబు, రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, అయినవిల్లి మండల టిడిపి అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి చైతన్య రథయాత్రకు శ్రీకారం చుట్టారు.

అక్కడ నుండి శానపల్లిలంకకు వెళ్ళి నత్తనడక నడుస్తున్న కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైన్ వంతెన నిర్మాణం వద్ద హరీష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తన తండ్రి దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి హయాంలో మంజూరైన రైల్వేలైన్ నిర్మాణం దశాబ్దాలుగా జాప్యం జరగడంపై హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నుండి సిరిపల్లి, నేదునూరు, ముక్కామల, పుల్లేటికుర్రు, అంబాజీపేట, ముంగండ, పి.గన్నవరం, మొండెపులంక, నాగుల్లంకల మీదుగా వాడ్రేవుపల్లి వరకూ బస్సుయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా దారిపొడవునా పలు ఆలయాల్లో హరీష్ బాలయోగి, నామన రాంబాబు పూజలు నిర్వహించారు. అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్, బాలయోగి, వంగవీటి మోహనరంగా తదితరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాడ్రేవుపల్లిలో గటిగంటి వాసు కమ్మ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు.

ఈ సభలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాజకీయ లక్షణాలు లేని జగన్మోహనరెడ్డి కారణంగా రాష్ట్ర పరిపాలన భ్రష్టు పట్టిందన్నారు. అతనికున్నది అవినీతి, అరాచక లక్షణాలేనన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశాడని, ఎన్ఫోర్శ్మెంట్ డైరెక్టరేట్ 42 వేల కోట్ల ఆస్థులు అటాచ్ చేసిందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తికి అధికారం కట్టబెడితే ప్రకృతి వనరులన్నీ దోచేస్తున్నాడని ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ వర్గమూ వైసీపీ పాలనలో సంతోషంగా లేదని చెప్పారు. యువత నిరుద్యోగంతో అల్లాడిపోతోందని తెలిపారు. ఈ దుర్మార్గ పరిపాలనతో రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోతున్న తరుణంలో మన భవిష్యత్తుకు భరోసా ఇస్తూ చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రకటించారని తెలిపారు.

చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని యనమల చెప్పారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర సంపదను జగన్ సొంత
సంపదగా మార్చుకుంటున్న కారణంగా ప్రభుత్వం అప్పుల పాలవుతోందన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే, మన భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ…జగన్ రెడ్డి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గానికి ఇంఛార్జి లేకపోయినా సీనియర్ నాయకులు, యువత సమన్వయం చేసుకుని చైతన్య రథయాత్రను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఎవరికి అవకాశం ఇచ్చినా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని, చంద్రబాబును సిఎం చేసుకోవాలని ఆయన కోరారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టిడిపిదే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిసి రిజర్వేషన్లను 24 శాతానికి కోసేశారని, దీని వల్ల 16 వేల మంది బిసిలు స్థానిక సంస్థలలో పదవులు కోల్పోయారని చెప్పారు. ఎస్సీలపై హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడైన తన డ్రైవరును హత్య చేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితి అంటే ఈ రాష్ట్ర దుస్థితి ఏమిటో స్పష్టమవుతుందన్నారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజల్ని రక్షించాల్సిన నాయకుడు ప్రజా భక్షకుడిగా మారాడని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. మద్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల రక్తం తాగుతున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా, మట్టి తవ్వకాలతో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రశ్నించిన నాయకుల పైనే కాదు.. మీడియా పైనా అక్రమ కేసులు, వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలలోకి వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. అది తప్పు ఇదిగో మన మినీ మేనిఫెస్టో.. ఈ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళండి.. వైసీపీ పథకాలను తలదన్నే పథకాలు మనం అమలు చేస్తామని ప్రజలకు వివరించమని ఆయన పిలుపునిచ్చారు.

శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైందే తెలుగుదేశంతో అని చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చింది తెలుగుదేశం, పేద వారికి పక్కా ఇళ్ళు ఇచ్చింది తెలుగుదేశం.. పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు ఇచ్చింది తెలుగుదేశం… చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, బిసిలకు, కాపులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను ఆయన గుర్తు చేశారు.

అమలాపురం పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ.. దివంగత లోకసభ స్పీకర్, తన తండ్రి జిఎంసి బాలయోగి ఆశయాల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. కోనసీమ రైల్వే ప్రాజెక్టు సహా ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్వర్గీయ బాలయోగి తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు.

సభకు అధ్యక్షత వహించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ… మినీ మేనీఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం, మహాశక్తి, దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరమని ఆమె చెప్పారు.

ఈ సభలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎంపి ఎజెవి బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చిల్లా జగదీశ్వరి, నర్సాపురం టిడిపి ఇంఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధులు మోకా ఆనందసాగర్, సరిపెల్ల రాజేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, నామన రాంబాబు, డొక్కా నాధబాబు, జిల్లా టిడిపి ప్రధానకార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శులు పెచ్చెట్టి చంద్రమౌళి, మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరామ్, జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు రిష్వంత్ రాయ్, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, టిడిపి సీనియర్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, పోతుకుర్రు సత్తిబాబురాజు, సలాది బాబూరావు, ఆకుల రామకృష్ణ, పుల్లయ్యనాయుడు, బోళ్ళ ప్రసాద్, తోలేటి సత్తిబాబు, దంతులూరి శ్రీనివాసరాజు, మొల్లేటి శ్రీనివాస్, నేదునూరి వీర్రాజు, కొల్లాబత్తుల అప్పారావు, బొబ్బా ప్రభాత్, పడాల సూపర్, బోళ్ళ వెంకటరమణ, డివివి సత్యనారాయణ, పొలమూరి ధర్మపాల్, జాలెం సుబ్బారావు, నాగాబత్తుల సుబ్బారావు, గోగి రమేష్, వాసంశెట్టి రామకృష్ణ, సర్పంచులు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, బొండాడ నాగమణి, తెలుగుమహిళ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దుల రాజేశ్వరి, మోకా పార్వతి, మట్టపర్తి భారతి తదితరులు పాల్గొన్నారు.

జోన్-3 టిడిపి చైతన్య రథయాత్ర బుధవారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించారు. నియోజకవర్గం పరిశీలకులు వడ్రణం హరిబాబు , రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ. జగన్నాధరావు (బుల్లయ్య) ,ఆధ్వర్యలో మండల పార్టీ అధ్యక్షులు సారథ్యంలో విజయవాడ రూరల్ లోని రామవరప్పాడు రింగ్ రోడ్ సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభించారు. అక్కడ నుండి విజయవాడ రురల్* మండలం ,నున్న గ్రామంలో ఉన్నటువంటి డా.బీర్ అంబేద్కర్ గారి ,ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించడం .అనంతరం పోలవరం కెనాల్ మట్టి అక్రమ మైనింగ్ తవ్వకాల వద్ద సెల్ఫీ తీసుకొని గన్నవరం మండలం సూరంపల్లి హరిజనవాడలోని బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి అనంతరం న్యూ బైపాస్ మీదుగా ముస్తాబాద్ – కొండపావులూరు మధ్య అక్రమ మైనింగ్ వద్ద సెల్ఫీ తీసుకొని అనంతరం గన్నవరం HCL కంపెనీ వద్ద సెల్ఫీ అనంతరం మధ్యాహ్నం గన్నవరం పార్టీ ఆఫీసులో లంచ్ చేయడం జరిగింది.

లంచ్ అనంతరం బాపులపాడు మండలం గన్నవరం టౌన్ నుండి మల్లవల్లి ఇండస్ట్రీ ఏరియా వద్ద గల అశోక్ లే ల్యాండ్ ఇండస్ట్రీస్ వద్ద సెల్ఫీ తీసుకొని అనంతరం ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి జోసెఫ్ తంబీ గారి చర్చి లో ప్రత్యేక ప్రార్ధనలు జరిపించి అనంతరం పెద్ద అవుటుపల్లిలో ఎన్టీఆర్ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి అనంతరం రోడ్ కార్నర్ లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.

వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. జగన్ ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నానికి జగన్ చేపట్టిన చర్యలను తప్పుబట్టారు. మూడు రాజధానుల అధికారం జగన్ రెడ్డికి లేకున్నా అమరావతి రాజధాని విధ్వంసానికి జగన్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, దౌలతాబాద్ నుండి ఢిల్లీకి రాజధాని మార్చి మహ్మద్ బీన్ తుగ్లక్ చేసిన చర్యల మూలంగా ఖజానా ఖాళీ అయిందని, ఆ తర్వాత తుగ్లక్ వంశం క్షీణించిందని, అదే పరిస్థితి రేపు జగన్ రెడ్డికి తప్పదని హెచ్చరించారు.

రాష్ట్ర సంపదను అతని సంపదగా మార్చుకుంటున్న కారణంగా ప్రభుత్వం అప్పుల పాలవుతోందన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే, మన భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్రెంచ్ విప్లవంలో లూయిస్ పాశ్చర్ యుద్ధోన్మాదం ఆ దేశాన్ని నాశనం చేసిందని, చివరికి విసిగి వేసారిన ప్రజలు ఆ రాజును నరికి చంపారని గుర్తు చేశారు. జగన్ రెడ్డికి కూడా ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి, అతని అనుచరగణం దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను వెనక్కు తెచ్చి రైతులు, మహిళలు, యువత, పేదలు అందరికీ సంక్షేమ పథకాలు పంచిపెడతామని ఆయన తెలిపారు.

ప్రజలలో పొదుపు అలవాటును ప్రోత్సహించి ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ పాలనా వైఫల్యం కారణంగా ప్రజలపై 13 లక్షల కోట్ల భారం పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు.

అమలాపురంలో దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ రావులతో కలిసి కోనసీమ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకున్న రోజులను యనమల గుర్తు చేసుకున్నారు. మెట్ల సత్యనారాయణ రావు కుమారుడు మెట్ల రమణబాబు, బాలయోగి వారసుడు హరీష్ బాలయోగిలు వారసత్వంగా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అమలాపురం ఇంఛార్జి అయితాబత్తుల ఆనందరావు కూడా కష్టపడి పని చేసే నాయకుడని, పార్టీ విధానాలను బలంగా ప్రజలలోకి తీసుకు వెళుతున్నాడని అభినందించారు. అందరినీ కలుపుకుని వెళుతూ రాజకీయంగా మరింత పట్టు సాధించాలని ఆయన సూచించారు.

సభకు అధ్యక్షత వహించిన నియోజకవర్గ పరిశీలకులు మాట్లాడుతూ వడ్రణం హరిబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కనీసం సస్పెండ్ చేయలేదని విమర్శించారు. పోలీసు రక్షణ కల్పించి మరీ సన్మాన సభలు జరుపుకోవడానికి అవకాశం కల్పించడం సిగ్గుచేటన్నారు.

పోలీట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ ,జాతీయ అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామ కృష్ణ ప్రసాద్,మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా , పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు బోడె ప్రసాద్ , గుడివాడ నియోజకవర్గం ఇంచార్జి మాజీ MLA రావి వెంకటేశ్వర రావు ,పెడన నియోజకవర్గ ఇంచార్జి కాగిత కృష్ణ ప్రసాద్ , పామర్రు నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్ రాజా ,రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ ,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం ,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్ ) ,రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న , గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు జాస్తీ వెంకటేశ్వర రావు ,బాపులపాడు దయాల రాజేశ్వరరావు గారు, ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి , విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గొడ్డలి చిన రామారావు , పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్,గూడవల్లి నరసయ్య,యార్లగడ్డ సుచిత్ర ,ఆసిలేటి నిర్మల ,పొదిలి లలిత గారు,మాల్పూరి సత్య కళ్యాణి ,కుర్ర నరేంద్ర ,కోనేరు సందీప్, గుజ్జర్లపూడి బాబు రావు గారు,పిన్నమనేని వేబకటేశ్వర రావు ,పిన్నమనేని బాబ్జినిమ్మగడ్డ సత్యసాయి,లావు వంశీ కృష్ణ,వీరంకి గురుమూర్తి,కరసాని భాగ్యరావు . అంగర రంగనాధ్,పోతన స్వామి,మండలి వెంకట్రామ్ రాజా,ఆచంటి సునీత,అర్జ నగేష్.,కోనేరు నాని,బాధర్ల కిషోర్ (వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ),కొండేటి కొండలరావు (రాష్ట్ర రైతు అధికార పతినిధి ),కొండేటి వెంకటేశ్వర రావు,కిరణ్ కలపాల( రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు ),జాస్తి శశిధర్,మేడే పల్లి రమ్య తదితరులు పాల్గొన్నారు.

జోన్ -4 భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్రను రాజంపేట పార్లమెంట్ రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలం ఎస్ఆర్ పాళ్లెం నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి బాణాసంచా, కేరళ డ్రమ్స్, డీజే, బైక్ ర్యాలీ తో నియోజకవర్గం, మండల, గ్రామ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికినారు. గుడి దగ్గర నుంచి కాలినడకన 2కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసి ఈద్గా దగ్గర సెల్ఫీ చాలెంజ్, ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లింలకు ఈద్గా మసీదుల అభివృద్ధికి, షాదీ మహాల్, రంజాన్ తోఫా ఇలాంటి పథకాల ద్వారా ముస్లింలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని కొనియాడారు.

అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి తిరుమల కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనం అనంతరం ర్యాలీగా రాజంపేట పట్టణం కూచివారిపల్లి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అక్కడ నుంచి బయలుదేరి పట్టణంలోకి ప్రవేశించి రాజంపేట రైల్వే బ్రిడ్జి సెల్ఫీ దిగి తరువాత కిలోమీటర్ మేర పాదయాత్ర, బైక్ ర్యాలీ చేసుకుంటూ పట్టణంలోని ఎన్టీఆర్, గాంధీ, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడ నుంచి బోయనపల్లి దగ్గర ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి చేరుకున్న రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం ముఖ్య నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కార్యాకర్తలు బాణాసంచాతో ఘన స్వాగతం పలికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినారు. రచ్చబండ కార్యక్రమంలో భవిష్యత్ గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రాలను ఆవిష్కరించారు. అక్కడే పల్లె నిద్ర నిర్వహించినారు.

ఈరోజు రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలం ఎస్ఆర్ పాళ్లెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ , మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ , మాజీ ఎమ్మెల్సీ & రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు,మాజీ ఎమ్మెల్యే షాజహాన్ , రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతంగాని నరసింహ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి & నగరి నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చెన్నూరు సుధాకర్ , మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు , రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి పర్వీన్ తాజ్ గారు, రాజంపేట పార్లమెంట్ బీసీ సంఘం అధ్యక్షులు సురేంద్ర యాదవ్ గారు, రాష్ట్ర / నియోజకవర్గ / మండల / గ్రామ,క్లస్టర్,యూనిట్,బూత్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

జోన్ -5 నంద్యాల నియోజవకర్గంలో బస్సుయాత్రతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో జోన్-5 బస్సు యాత్ర కార్యక్రమం (12-07-2023, బుధవారం) నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ముందుగా ఇంచార్జి ఇంటిదగ్గర నుంచి బైక్ ర్యాలీ చేసి నంద్యాల టౌన్ లో గల ప్రధమ నందీశ్వర దేవాలయం నందు పూజలు చేసి భవిష్యత్తు బరోసా బస్సు యాత్ర ప్రారంభం చెయ్యడం జరిగింది, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది, నందమూరి నగర్ వంతెన దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.

అనంతరం పాదయాత్ర గా వెళ్లి టిడ్కో ఇళ్ళు దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసారు, శ్రీనివాస సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం ఎన్టీఆర్ షాదీ కానా దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసారు, తరువాత నంద్యాల పంప్ హౌస్ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జి మండ్ర శివానంద రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ భూమా బ్రహ్మానంద రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు వి.రామచంద్రరావు, జిల్లెల శ్రీరాములు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ సూర్య, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు జైనాబి, నంద్యాల టౌన్ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరి , మరియు నంద్యాల పట్టణం మరియు రూరల్, గోస్పాడు మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో పాటు జిల్లాలో లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE