– నాలుగేళ్లనుంచి అడ్డగోలుగా కొట్టేసిన వేల ఎకరాలను వైసీపీ భూబకాసురుల పరంచేయడానికే ముఖ్యమంత్రి జగన్నాటకం
• జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిజంగా పేదలకు భూములపై హక్కులు కల్పించే ఆలోచనచేస్తే, తక్షణమే రాష్ట్రంలోని అసైన్డ్ భూములు, ఇతర భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో, ఏఏజిల్లాలో ఎంతెంతభూమి ఎవరి పేరుతో ఉందో సర్వేనంబర్లతో సహా బయటపెట్టాలి
• 22 ఏ జాబితాలోని భూములు సహా, అన్నిరకాల భూముల వివరాలకు సంబంధించి పూర్తి వాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
• పేదలకు భూములిచ్చే ఆలోచన జగన్ రెడ్డికి ఉంటే, గతంలో ఇళ్లపట్టాలపేరుతో పేదల సాగులోని అసైన్డ్ భూముల్ని పోలీసులతో కొట్టించి, బలవంతంగా ఎందుకు లాక్కున్నాడు?
• భూములక్రమబద్ధీకరణముసుగులో పేదల పేరుచెప్పి, రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూముల్ని తనపార్టీ వారికి దోచిపెట్టడమే జగన్ ప్రధాన లక్ష్యం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
పేదలకు మేలుచేస్తున్నామనే నెపంతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొత్త దోపిడీకి తెరలేపిం దని, నిన్నటి కేబినెట్ సమావేశంలో అసైన్డ్ భూములు పేదలకు పంచడానికి తమ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల కు 6, 7 నెలలముందు నయా స్కామ్ కు పథకరచన చేస్తున్నాడని, పేదలకు భూములివ్వాలని, భూముల పై వారికి హక్కులు కల్పించాలన్న గొప్ప ఆలోచన ముఖ్యమంత్రికి ఇప్పుడే ఎందుకొచ్చిందో కూడా ప్రజలు ఆలోచించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“ నాలుగన్నర సంవత్సరాలు పేదల్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి, ఉన్నట్టుండి వారిపై ప్రేమ ఒలకబోస్తున్నాడు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై జగన్ కన్ను ఎందుకు పడిందో, పేదలకు ఆ భూములపై హక్కులు కల్పించాలన్న నిర్ణయం ఆయన మదిలో ఎందుకు మెదిలిందో ప్రజలంతా ఆలోచించాలి.
అక్టోబర్ 17, 2022న పత్రికల్లో అసైన్డ్ కు తూట్లుఅని కథనంవచ్చింది. అసైన్డ్ భూములపై గురి…పీవోటీ చట్టసవరణకు (బదలాయింపు నిరోధకచట్టం-1977) ఎత్తు లు..గుట్టుగా రెవెన్యూశాఖ ప్రతిపాదనలు..15 నుంచి 20ఏళ్ల కాలవ్యవధి టార్గెట్… నిరుపేదలకు లబ్ధిపేరిట పెద్ద డ్రామా.. చట్టం సవరిస్తే 600ఎకరాలకు పైగా ఒక నేతకే లబ్ధి..సవరణకోసం కబ్జాదారుల ఎదురుచూపులు. ఇదీ సదరుపత్రికాకథనంలోని సా రాంశం. వీటన్నింటికి సమాధానమిస్తూ నిన్నకేబిట్ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణ యం తీసుకున్నాడు. కబ్జాదారుల ఎదురుచూపులకు భలే ముగింపుపలికాడు.
తమ ముఠానాయకుడు ఎప్పుడెప్పుడు అసైన్డ్ భూముల బదలాయింపు చట్టాన్ని సవరిస్తాడు..ఎప్పుడెప్పుడు భూములుకొట్టేద్దామా అని ఎదురుచూస్తున్న వైసీపీ భూ బకాసురులకు జగన్ తియ్యని కబురుచెప్పాడు. అధికారంలోకి వచ్చేది..చచ్చేది లేదు.. కాబట్టి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం.. మీరు కబ్జాచేసిన భూములపై సర్వాధికారాలు మీకే కట్టబెడతానని చెప్పి, తనకబ్జాదారుల ముఠాపై దయతలిచి, తనకు రావాల్సిన వాటాలలెక్కలు తేల్చుకొని, నిన్నటి కేబినెట్ సమావేశంలో అసైన్డ్ భూములక్రమబద్ధీకరణకు చట్టసవరణ చేశారు.
చట్టసవరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కమిటీవేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా ధర్మానప్రసాదరావుకు అప్పగించారు. దొంగచేతికి తాళాలిచ్చిన ట్టు, భూకబ్జాదారుల్లో అగ్రస్థానంలో నిలిచినవ్యక్తిని కమిటీ అధ్యక్షుడిని చేశారు. విశాఖ పట్నం శివార్లలో మాజీసైనికుల భూమిని కొల్లగొట్టింది మొదలు, అనేక భూ ఆక్రమణల ఆరోపణలు ధర్మానపై ఉన్నాయి. ఎవరైతే భూకబ్జాలకు పాల్పడతారో, అయన్నే అసైన్డ్ భూముల బదలాయింపు నిరోధక చట్టసవరణ కమిటీకి అధ్యక్షుడిని చేసినప్పుడే జగన్ ఈ వ్యవహారంలో ఎంతచిత్తశుద్ధితో పేదలకోసం పనిచేస్తున్నాడో అర్థమైంది. మా జీ సైనికుల భూములు మింగిన ధర్మాన సిఫార్సుచేస్తే, ముఖ్యమంత్రి ఆమోదించడం.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5నెలలనుంచే పేదల స్వాధీనంలోని భూముల్ని చెరబట్టడం మొదలెట్టాడు. నాలుగేళ్లనుంచి ప్రసారమాధ్యమాల్లో వైసీసీనేతల భూ దోపిడీపై పుంఖానుపుంఖాలుగా కథనాలువస్తున్నా ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించలేదు. అసైన్డ్, 22ఏ, రెవెన్యూ, అటవీ భూములు సహా కనిపించిన భూమిపై వైసీపీ గద్దలు వాలి తన్నుకుపోయాయి.
గత రెండు, మూడుసంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా దళిత, బడుగు, బలహీనవర్గాల భూముల్ని వైసీపీ భూబకాసురుల వదిలిపెట్టలేదు. మూడుజిల్లాల్లో 9,625ఎకరాల అసైన్డ్ భూముల్ని కొనేశారని, పశ్చిమగోదావరిలో జిల్లాలో 8056ఎకరాలు, కోనసీమ జిల్లాలో 837, తూర్పుగోదావరి జిల్లాలో 732 ఎకరాలు నిషేధిత భూములజాబితాలో ఉన్న భూములు చేతులుమారాయని జూన్ 24, 2023న పత్రికల్లో వచ్చింది.
22ఏ నుంచి తొలగించిన నిషేధితభూముల్ని కూడా వదల్లేదని 11జిల్లాల్లో దాదాపుగా 2.16 లక్షల ఎకరాలు చెరబట్టారని ఏప్రియల్ 9, 2023న పత్రికల్లో రాశారు. భూమాయ నిషేధితభూములకు గేట్టు ఎత్తివేత, భూంఫట్-హాంఫట్, లంకల్లో వాలినగద్దలు.. రాష్ట్రం లో 23వేలఎకరాల లంకభూముల కేటగిరీలు మార్చేసి, సొంతఖాతాలోకి.. అని వార్తలు వచ్చాయి. అసైన్డ్ సాగు… ఇళ్లస్థలాలు కోల్పోయిన పేదలు… అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రభుత్వానికి చేరిన 4,760ఎకరాలు. భూములు సాగుచేసుకుంటున్నవారికి పరిహారం చెల్లించకుండా ఏళ్లనుంచి వారి ఆధీనంలో ఉన్న భూముల్ని లాక్కోలేదా?
నేత : భూమేత, సకలభూముల్ని చాపచుట్టేస్తున్న వ్యూహం.. జాబితాలు సిద్ధంచేస్తున్న నేతలు.. కబ్జాదారులకు అనుకూలంగా సర్కారు పెద్దలు.. 6.50 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై కన్ను.. పేదలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి భూముల సొంతం చేసుకున్న బడానేతలని ఫిబ్రవరి 5, 2023న పత్రికల్లో వచ్చింది.
పేదలకు భూములిచ్చే ఆలోచన జగన్ రెడ్డికి ఉంటే, గతంలో ఇళ్లపట్టాలపేరుతో పేదల సాగులోని అసైన్డ్ భూముల్ని పోలీసులతో కొట్టించి, బలవంతంగా ఎందుకు లాక్కున్నాడు? భూముల క్రమబద్ధీకరణ ముసుగులో పేదలపేరు చెప్పి, రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూముల్ని తనపార్టీ వారికి దోచిపెట్టడమే జగన్ ప్రధానలక్ష్యం.
జగన్మోహన్ రెడ్డిని ఒకప్రశ్న అడుగుతున్నాం. పేదలకు ఇళ్లపట్టాలపేరుతో అసైన్డ్ భూముల సేకరించడానికి, ఆ భూముల సాగుచేసుకుంటున్న వారిని ఈడ్చి పడేసి, ఆ భూములు లాక్కున్నారు. పేదల సాగులో ఉన్న అసైన్డ్ భూములులాక్కొని, పేదలకు ఇళ్లపట్టాలు పంచేబదులు, ఆ భూములపై హక్కుల్ని సాగుచేసుకుంటున్నవారికే ఎందుకు కల్పించలేదు? ఇదేనా జగన్ రెడ్డికి పేదలపై ఉన్నప్రేమ? పేదల భూములు లాక్కొని, వారిని పోలీసులతో చావగొట్టించినప్పుడు జగన్ కు పేదలు గుర్తురాలేదా?
అధికారం కోల్పోయే సమయంలోనే పేదలు గుర్తొస్తారా? కబ్జాదారులకు పేదల భూము లుదోచిపెట్టడానికే జగన్ అసైన్డ్ భూములకుచట్టసవరణ పేరుతో నాటకాలు మొదలు పెట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాలభూములకు విముక్తి అని పత్రికల్లో వచ్చింది. ఆభూములన్నీ పేదవాడికి కాకుండా వైసీపీ వారికి కట్టబెట్టడమే జగన్ లక్ష్యం. నిజంగా జగన్ రెడ్డి పేదలకు భూములపై హక్కులు కల్పించేవాడే అయితే, ఎన్నోఏళ్లనుంచి అసైన్డ్ భూములు సాగుచేసుకుంటూ బతుకుతున్నవారిని భయపెట్టి, ఇళ్లపట్టా లపేరుతో ఆ భూములు లాక్కుంటాడా? తాడేపల్లిలో తనప్యాలెస్ సమీ పంలో ఎన్నోఏళ్లనుంచి ఉంటున్న పేదలగుడిసెల్ని కూల్చేస్తాడా? భూములు తనపార్టీవారికి అప్పగిస్తే, వారు అవి అమ్మేసి వచ్చే ఎన్నిక ల్లో తనకోసం పనిచేస్తారన్నదురాశకూడా ముఖ్యమంత్రిలో ఉంది.
జగన్ రెడ్డికి నిజంగా భూములపై పేదలకు శాశ్వతహక్కులు కల్పించే ఆలోచనే ఉంటే, క్రమబద్ధీకరించే భూములవివరాల్ని సర్వేనంబర్లతో సహా ప్రజలముందు ఉంచాలి. భూకబ్జాల్లో కీలకపాత్రధారి అయిన ధర్మాన నేత్రత్వంలో కాకుండా ప్రతిపక్షపార్టీలతో కమిటీవేయాలి. పేదల నోట్లో మట్టికొట్టి, వారిస్వాధీనంలోని భూముల్ని తనపార్టీ వారికి కట్టబెట్టా లని జగన్ చూస్తే, తగినమూల్యం చెల్లించుకుంటాడు.
నిజంగా జగన్ రెడ్డికి పేదలకు భూములు పంచే ఆలోచన ఉంటే, ఏఏజిల్లాలో ఏఏ భూముల్ని క్రమబద్ధీకరిస్తున్నారో, ఆభూములు ఎవరిపేర్లతో ఉన్నాయనే పూర్తిసమాచారంతో (సర్వేనంబర్లతో సహా) తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి. ఫలానాజిల్లాలో ఫలానాభూమి ఫలానా పేదవాడికి ఇస్తున్నామని చెప్పి వివరాలు బయటపెట్టండి. మీరు బయటిపెట్టిన వివరాలు మేంకూడా పరిశీలించి, వాస్తవాలు తెలు సుకుంటాము.
పేదలకు ఆసరాగా ఉన్నభూముల్ని బెదిరించి, వారినుం చి లాక్కొని, చట్టసవరణ ముసుగులో భవిష్యత్ లో వారికి ఎక్కడా సెం టు భూమిలేకుండా చేయాలన్నదే జగన్ పన్నాగం. భూకబ్జాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నవ్యక్తి నేత్రత్వంలో కమిటీలువేస్తే, వాటికి విశ్వసనీ యత ఉంటుందా? ప్రతిపక్షపార్టీలతో కూడిన కమిటీవేసి పేదలకు న్యాయంచేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి ఎందుకు చేయడు?
భూ ముల వివరాలు బయటపెట్టినా, ప్రతిపక్షపార్టీలతో కమిటీవేసినా ముఖ్య మంత్రి భూదోపిడీ బయటపడుతుంది కదా! అందుకే ఆయన సాహసం చేయడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిఆలోచన, ప్రతిస్కీమ్ వెనుక, అంతిమం గా జరిగేది దోపిడీనే అని ప్రజలంతా గ్రహించాలి. తాడేపల్లిప్యాలెస్ లో కూ ర్చొని పేదలభూములు లాక్కుంటాము… మావాళ్లకు కట్టబెట్టుకుంటా మంటే టీడీపీచూస్తూ ఊరుకోదు. పేదలభూముల్ని కాజేసి, వాటిని తన పార్టీకిచెందిన భూకబ్జాదారులకు ముఖ్యమంత్రి కట్టబెడితే, అందుకు తగి న మూల్యంచెల్లించుకుంటాడు.” అని కొమ్మారెడ్డి పట్టాభిరాం హెచ్చరించారు.