Suryaa.co.in

Andhra Pradesh

అధికారం కోసం బాబాయ్ ని చంపిన జగన్, కమీషన్లు, స్వార్థం కోసం పోలవరాన్ని చంపేశాడు

– ప్రాజెక్ట్ నిర్మాణపనులపై నరంలేని నాలుక మడతేయడం తప్ప, నాలుగేళ్లలో జగన్ చేసింది శూన్యం
• చంద్రబాబు 72శాతంపనులు చేస్తే, నాలుగున్నరేళ్లలో తేదీలుమార్చడం తప్ప జగన్ చేసిందేమీలేదు
• నిర్వాసితుల్ని ఆదుకోకుండా కొండలు, గుట్టలపాలుచేయడంతో వారు తెలంగాణకు వెళ్తామంటున్నారు
• ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణకు భయపడే జగన్ పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమయ్యాడు
• కోట్లరూపాయల ప్రజలసొమ్ము తగలేసి ప్రత్యేకవిమానాల్లో ఢిల్లీవెళ్లడం తప్ప, పోలవరం నిర్మాణానికి కేంద్రంనుంచి జగన్ ఏమిసాధించాడు?
• చంద్రబాబుహాయాంలో కేంద్రానికి పంపిన ప్రాజెక్ట్ అంచనావ్యయానికి ఆమోదం పొందలేనివాడు పోలవరం పూర్తిచేస్తాడా?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్

విశ్వసనీయత, మాటమీద నిలబడటంలో తమను మించినవారు లేరని చెప్పే ముఖ్యమంత్రి మంత్రులు పోలవరం నిర్మాణంపై ఏఏ సందర్భాల్లో ఎలా మాట్లాడి కప్ప దాటు వైఖరితో వ్యవహరించారో ప్రజలంతా తెలుసుకోవాలని, అవినీతి, కమీషన్ల కక్కు ర్తితో జాతీయప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన జగన్ ను ఏమనాలో, ఈ ప్రభుత్వాన్ని ఏంచేయాలో ప్రజలే ఆలోచించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“జగన్మోహన్ రెడ్డి నాలుక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎన్నో మెలికలు తిరిగింది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే 2021జూన్ లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పాడు. మర లా 2022 ఖరీఫ్ అన్నాడు… తరువాత మరోసారి 2023 ఖరీఫ్ అని నాలుక మడతే శాడు. ఆయన మంత్రివర్గంలోని ప్రబుద్ధులు అయితే ఆయన్ని మించి కట్టుకథలు చెప్పారు. వైసీపీప్రభుత్వం వచ్చి 4ఏళ్లు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభు త్వం పోలవరం నిర్మాణంపై పలికిన ప్రగల్భాలు అన్నీ ఉత్తుత్తివేనని కేంద్రప్రభుత్వం తేల్చింది. కేంద్రప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్రప్రభుత్వం 2025నాటికి కూడా పోలవరం పూర్తికావడం సందేహమేనని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది.

కక్షపూరితవైఖరి, కమీషన్లకోసం నిర్మాణపనులు చేస్తున్న ఏజెన్సీలను మార్చి, జాతీయప్రాజెక్ట్ ని గోదాట్లో ముంచేశాడు. గతంలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించాలన్న జగన్, ముఖ్యమంత్రి అయ్యాక కమీషన్లకోసమే రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి నచ్చిన కంపెనీలకు పనులు అప్పగించాడు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ను జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సర్వనాశనం చేశాడో ప్రజలందరూ గ్రహించాలి. అధికారంలోకి వచ్చీరాగానే రివర్స్ టెం డరింగ్ డ్రామాలు అడి, పోలవరంపనుల్ని తన అస్మదీయులకు కట్టబెట్టాలని ప్రయ త్నించాడు. 2019వరకు పనులుచేస్తున్న పోలవరం నిర్మాణ ఏజెన్సీలను జగన్ ఎం దుకు మార్చాడు? కక్షపూరితవైఖరి, కమీషన్లకోసమే జగన్ ఏజెన్సీలు మార్చాడు. పట్టి సీమ నిర్మాణంలో అవినీతికిపాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మెగా సంస్థపై నిరాధార ఆరోపణలు చేశాడు.

ముఖ్యమంత్రి అయ్యాక రివర్స్ టెండరింగ్ తో అదే మెగాకంపెనీకి పోలవరంనిర్మాణ పనులు కట్టబెట్టాడు. ప్రాజెక్ట్ పనులతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణబాధ్యతలు కూడా ఆకంపెనీకే అప్పగించాడు. ఇదంతా ముమ్మా టికీ కమీషన్లకోసమేని గట్టిగా చెప్పగలం. కాదని చెప్పగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? చంద్రబాబుహాయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 72శాతంపూర్తయితే , 4ఏళ్ల 3నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో చచ్చీచెడి కేవలం 7శాతం మాత్రమే పనులు జరిగాయి.

ఆ పనుల్లోకూడా నాణ్యతలేకపోవడంతో ప్రాజెక్ట్ లోని పలుప్రధాన నిర్మాణా లు దెబ్బతిన్నాయి. 45మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ని 41.15మీటర్లకు నియంత్రించడానికి జగన్ ఎందుకు ఒప్పుకున్నాడు? తెలంగాణలోని తనఆస్తులు కాపాడుకోవడానికి, ఆరాష్ట్రప్రభుత్వంతో తనకున్న సన్నిహిత సంబంధాలతోనే జగన్, పోలవరం నిర్మాణాన్ని కుదించడానికి ఇష్టపడ్డాడు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పదేప దే పోలవరంనిర్మాణాన్ని చంద్రబాబు ఎందుకు కేంద్రానికి అప్పగించకుండా తానేచేస్తు న్నాడు అని ప్రశ్నించిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఆపని ఎందుకు చేయలేదు? జాతీయప్రాజెక్ట్ ను కేంద్రప్రభుత్వమే నిర్మిం చాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోయాడు? కేంద్రప్రభుత్వానికి అప్పగిస్తే, తనకు రావాల్సిన సొమ్మురాదనే జగన్ వెనక్కుతగ్గాడు.

రాష్ట్రప్రభుత్వ అనాలోచితచర్యలవల్లే ప్రాజెక్ట్ లోని డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే వంటి నిర్మాణాలు దెబ్బతిన్నాయని కేంద్రప్రభుత్వం చెప్పిన 13 కారణాలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు?

జగన్మోహన్ రెడ్డి హాయాంలో పోలవరం ప్రాజెక్ట్ లోని కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ ఎందుకు దెబ్బతిన్నాయి. నాసిరకం పనులుచేసి, ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా వరదలకు వదిలేయడంవల్లే డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే లాంటి వి దెబ్బతిన్నాయి. ఈ మాట మేంచెప్పడంకాదు..స్వయంగా కేంద్రప్రభుత్వమే చెప్పిం ది. పోలవరంప్రాజెక్ట్ నిర్మాణంలోని అంతర్భాగాలైన వివిధనిర్మాణాలు దెబ్బతింటే, జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడంలేదు?

గోదావరికి వర ద వస్తుందని చెబుతూ, వేలకోట్లు కొట్టేస్తున్న ముఖ్యమంత్రి, ప్రాజెక్ట్ నిర్మాణపనుల్ని, నిర్వాసితుల్ని నీళ్లపాలుచేశాడు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోజరుగుతున్న జాప్యా నికి కారణం రాష్ట్రప్రభుత్వ నిర్వాకమేనని కేంద్రప్రభుత్వం ఐఐటీ నిపుణులతో వేసిన కమిటీ తేల్చింది. నిర్మాణపనులు చేస్తున్న ఏజెన్సీలు మార్చడం మొదలుకొని, రాష్ట్రప్ర భుత్వం ఆలోచనలేకుండా పనులుచేయడం సహా మొత్తం 13 కారణాల్ని కమిటీ బయటపెట్టింది. ఆ కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఏంసమాధానం చెబుతారు?

అధికారంకోసమే జగన్ జాతీయప్రాజెక్ట్ నిర్మాణంపై విషం చిమ్మాడని, పోలవరం నిర్మాణంలో ఎలాంటి అవినీతిలేదన్న కేంద్రప్రభుత్వ వ్యాఖ్యలతో తేలిపోయింది

టీడీపీప్రభుత్వం పోలవరం నిర్మాణవ్యయం అంచనా రూ.55,548కోట్లుగా తేల్చి, కేంద్రా నికి అంచనావివరాలు పంపితే, దానిపై ఆనాడు జగన్మోహన్ రెడ్డి నానారభస చేశాడు. వేలకోట్ల దోపిడీకోసం చంద్రబాబు అంచనావ్యయంపెంచాడని దుష్ప్రచారం చేశాడు. టీడీ పీ ప్రభుత్వంలో పోలవరంనిర్మాణంలో జరిగిన ప్రతిపనిని కేంద్రంఆమోదించి, అంచనా వ్యయం రూ.55,548కోట్లను ఆమోదించింది. కేవలం అధికారం దక్కించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు విమర్శలుచేశాడని అంచనావ్యయంఆమోదించి, పార్లమెం ట్లోనే పోలవరంనిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రప్రభుత్వమే తేల్చింది.

నిర్మాణ ఏజెన్సీలు మార్చవద్దని, అర్థాంతరంగా ఏజెన్సీలు మారిస్తే ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రశ్నార్థకమవుతుందన్న కేంద్రప్రభుత్వ వాదనను జగన్ పెడచెవిన పెట్టిందికూడా కమీషన్ల కోసమే. ఇటీవల కేంద్రజలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒకసమావేశం జరిగింది. దానిలో పోలవరం గైడ్ బండ్ ఎందుకు కుంగింది..దాని డిజైన్స్ ఎవరిచ్చారు…వాటి ప్ర కారం పనులుచేయమని ఎవరుచెప్పారు…కొత్తగా నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోతే ఎవ రు బాధ్యత తీసుకుంటారు అని సమావేశంలో ప్రశ్నిస్తే, రాష్ట్రప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

గతంలో సీ.డబ్య్లూసీ ఆధ్వర్యంలో, పీ.పీ.ఏ ఆధ్వర్యంలో ఆమోదించబడిన పోలవరం ప్రాజెక్ట్ డిజైన్స్ బాధ్యతను తీసుకొనికూడా సక్రమంగా పనులుచేయనందునే గైడ్ బండ్ కుంగిందని కేంద్రం అభిప్రాయప్రడింది నిజంకాదా? గైడ్ బండ్ కుంగుబాటుకు సంబంధించి కేంద్రప్రభుత్వంచెప్పినదానిపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? గైడ్ బండ్ కుంగిపోవడానికి కారకులైన వారిపై ఏంచర్యలు తీసుకుంటారు?

కోట్ల రూపాయల ప్రజలసొమ్ము తగలేసి మరీ ఎన్నోసార్లు ప్రత్యేకవిమానాల్లో ఢిల్లీవెళ్లిన ముఖ్యమంత్రి పోలవరం నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి ఎన్నినిధులు సాధించారు ? పలుసందర్భాల్లో కీలకఅంశాల్లో కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు మద్ధతిచ్చిన జగన్, నాలుగున్నరేళ్లలో పోలవరం నిర్మాణానికి ఒక్కరూపాయి సాధించిందిలేదు. జగన్ కు స్వార్థప్రయోజనాలు తప్ప, రాష్ట్రప్రయోజనాలు, ప్రజలతో పనిలేదు.

అధికారంకోసం బాబాయ్ ని చంపాడు… కమీషన్లకోసం పోలవరాన్ని చంపేశాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే.. తనకు నచ్చనిది ఏదైనా ఎవరైనా దాన్ని చంపేయడమే. అధికారంలోకి రావడానికి బాబాయ్ ని చంపేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక తనను ప్రశ్నించిన దళితుల్ని, బడుగుబలహీనవర్గాల్ని చంపేస్తున్నాడు. ఆకోవలోనే ఏకంగా పోలవరాన్నే చంపేశాడు. నరంలేని నాలుకతో నోటికొచ్చినట్టు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ముఖ్య మంత్రి అయ్యాక పోలవరం నిర్మాణంపై ఎన్ని తేదీలుమార్చాడో అందరంచూశాం. ప్రజల్ని మాయమాటలతో నమ్మించడం, వారిలో విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రశ్నించే ప్రతిపక్షాలపై తప్పుడుకేసులుపెట్టడం, దుర్భాషలాడటం తప్ప, జగన్ కు, అతనిప్రభు త్వానికి ఏమీచేతకాదని తేలిపోయింది.

అందుకే చంద్రబాబునాయుడు 72 శాతం పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని కూడా పూర్తిచేయలేకపోయాడు. చంద్రబాబు 45మీటర్ల ఎత్తులో పోల వరం నిర్మించాలంటే జగన్ 41 మీటర్లకు పరిమితంచేశాడు. చంద్రబాబునాయుడు పోలవరం నిర్వాసితులకోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రీహాబిలి టేషన్ కింద రూ.4,800 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో ఒక్కరూపాయి ఖర్చుపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డినిర్వాకంతో నిర్వాసితులు చెట్లు, కొండలు పట్టుకొని ప్రాణాలు కాపాడుకునే దుస్థితికి వచ్చారు.

పోలవరం ముంపుప్రాంతాల్లోని బాధితుల కుటుంబా లకు (ఒక్కో కుటుంబానికి) తెలంగా ణ ప్రభుత్వం రూ.10వేల పరిహారమిస్తే, జగన్మోహ న్ రెడ్డి కేవలం కొన్నికుటుంబాలకే రూ.2వేలు ఇచ్చి చేతులుదులుపుకున్నాడు. పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న పట్టుదల, కసి ఉండబట్టే చంద్రబాబునాయుడు తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపేవరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని పట్టుబట్టి సాధించారు. నాలుగున్నరేళ్లలో జగన్ రాష్ట్రంకోసం, ప్రజ లకోసం ఒక్కరోజైనా కేంద్రంపై ఒత్తిడితెచ్చిందిలేదు.

చంద్రబాబు పేరన్నా..ఆయన చేసిన పనులన్నా జగన్ కు భయం. ఆ ఫోబియాతోనే రైతులకు ఉపయోగపడే పట్టిసీమ మోటార్లు ఆన్ చేయడంలేదు
కృష్ణాడెల్టాకు నీళ్లురాక రైతులు అవస్థలుపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టిసీమ పంపులు ఆన్ చేయడంలేదు? చంద్రబాబు పేరన్నా…ఆయన చేసిన పనులన్నా జగన్ కు భయం. ఆ ఫోబియాతోనే పట్టిసీమ మోటార్లు ఆన్ చేయడం లేదు. గోదావరినీళ్లు సముద్రంలో కలవడానికి జగన్ ఇష్టపడుతు న్నాడుకానీ, రైతులపొలాల్లో పారడానికి ఇష్టపడటంలేదు. సైకో ఆలోచనలు, సైకోపాలన ఎలాఉంటుందో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలే నిదర్శనం.

చంద్రబాబు, లోకేశ్ లపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనలోని భయం, అసహనానికి నిదర్శనం. చంద్రబాబుతో జగన్మోహన్ రెడ్డి దేనిలోనైనా పోటీపడగలడా? జగన్, పోలీసులుఅడ్డుకుంటే, 7కిలోమీటర్లు నడిచి వెళ్లి చంద్రబాబు ప్రజలమధ్యన బహిరంగసభలో పాల్గొన్నాడు. రాష్ట్రంలో ఏ పేదవా డికి కష్టమొచ్చినా చంద్రబాబే ముందుంటున్నాడు.

చంద్రబాబు జనంలో ఉంటున్నాడు.. ఆయన్ని వారు ఆదరిస్తున్నారనే పోలీసులు, తనపార్టీ వాళ్లతో అడ్డుకోవడానికి జగన్ కుట్రలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గాల్లో తిరగడం తప్ప ప్రజలముందుకెళ్లి వారి కష్టసుఖాల గురించి ఎందుకుపట్టించుకోడు? జనం అంతగా ఆయన్ని అభిమానించి, ఆదరిస్తుంటే, ఎందుకు పరదాలమాటున దాక్కుంటున్నాడు? అని నరేంద్ర ప్రశ్నించారు.

LEAVE A RESPONSE