Suryaa.co.in

Andhra Pradesh

ఎడ్యుకేషన్, కెరీర్, డెస్టినేషన్ ఈ మూడు యువత జీవితంలో అత్యంత కీలకమైనవి

-టీడీపీ ఎన్.ఆర్.ఐ ఎంపవర్ మెంట్ శిక్షణలో భాగంగా వివిధ కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
• తల్లిదండ్రుల ఆశలు, యువత ఆశయాలు నిజంచేసేలా దేశంలో మరే రాజకీయపార్టీ నిర్వహించనివిధంగా తెలుగుదేశం మాత్రమే వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ అందించి, జాతీయ అంతర్జాతీయస్థాయిలో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు 

టీడీపీ ఎన్.ఆర్.ఐ ఎంపవర్ మెంట్ కేంద్రంలో శిక్షణ పూర్తిచేసుకున్న 40మంది విద్యా ర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు.

విద్యాభ్యాసం పూర్తయ్యాక తమపిల్లలు జీవితాలు ఎలా ఉంటాయోనన్న బాధ సహజంగా తల్లిదండ్రుల్లో, తమకు మంచి ఉద్యోగాలు వస్తాయో రావో, జీవితంలో సెటిల్ అవుతామో లేదోనన్న ఆందోళన విద్యార్థినీ విద్యార్థుల్లో ఉంటుందని, తల్లిదండ్రులు ఆశలు, పిల్లల ఆశయాలు నిజంచేసేలా తెలుగుదేశంపార్టీ ఒక్కటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో మెరుగైన శిక్షణ అందిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

ఎడ్యుకేషన్, కెరీర్, డెస్టినేషన్ ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతోకీలకమని, అవే మన జీవితాన్ని ఎటుచేర్చాలో నిర్ణయిస్తాయన్నారు. విద్యాభ్యాసానంతరం ప్రతిఒక్కరూ వేసే తొలి అడుగు, వారిని జీవితంలో 100మెట్లు పైకిచేర్చేదిగా ఉండాలన్నారు. ఎటువంటి దురలవాట్లు, వ్యసనాల బారినపడకుండా, మంచి నడవడికతో యువతవారి లక్ష్యసాధనకోసం నిరంతరం శ్రమించాలన్నారు.

దేశంలో ఏ రాజకీయపార్టీ చేయనివిధంగా ఒక్కతెలుగుదేశం మాత్రమే, యువతభవితకోసం ప్రత్యేకశిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, జాతీయ అంతర్జాతీయ కంపెనీల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి యువతజీవితాల్లో కొత్తవెలుగులు నింపి, వారిని ఉన్నతస్థానాల్లో ఉంచడానికే టీడీపీ ఎన్.ఆర్.ఐ విభాగం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.యూ.ఎస్.ఐటీ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్, భాస్కర్ రావు, ఎంపవర్ మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ యామినీ పెండ్యాల, హెచ్.ఆర్.మేనేజర్ హిమజవేమూరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE