-రజకులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చింది టీడీపీనే
-బీసీ రక్షణ చట్టంతో రజకులతోపాటు బిసిలందరికీ రక్షణ కల్పిస్తాం
-జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిసిలపై అణచివేత చర్యలు
-నారా లోకేష్ ను కలిసిన రజక సామాజికవర్గీయులు
గన్నరం నియోజకవర్గ రజకులు గూడవల్లి సెంటర్ లో యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• జనాభా దామాషా ప్రకారం చట్టసభలో అసెంబ్లీ సీట్లు రజకులకు కేటాయించాలి.
• రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలి.
• రజక వృత్తిదారుల్లో 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలి.
• ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ పోస్టులు, కాంట్రాక్టులకు రజకులకు ఇవ్వాలి.
• అపార్ట్ మెంట్ వాచ్ మెన్లో రజకులకు 90 శాతం పైబడి ఉన్నారు..వారికి కనీస వేతన రూ.15 వేలు ఇవ్వాలి..వాచ్ మెన్ లకు రెండు గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.
• గతంలో జిఓ నెం.343 జీవో ప్రకారం గ్రామాల్లో రజకులకు చెరువులు కేటాయించారు, అవి ఆక్రమణలకు గురవతున్నాయి. వాటిని పరిరక్షించాలి.
• పట్టణాల్లో దోబీఘాట్ లు దురాక్రమణకు గురవుతున్నాయి, వాటిని కాపాడాలి.
• భూమి కొనుగోలు పథకంలో పేద రజకులకు ప్రభుత్వం ద్వారా భూమి కొనుగోలుచేసి ఇవ్వాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిసిలపై అణచివేత చర్యలు తీవ్రమయ్యాయి.
• తమహక్కుల కోసం ప్రశ్నించిన బిసిలపై వైసిపి గూండాలు దాడులకు తెగబడుతున్నారు.
• గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు.
• కుర్చీల్లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి రజకులతోపాటు అన్ని బిసి కులాలను జగన్ మోసం చేశాడు.
• వైసిపి ప్రభుత్వం వచ్చాక రూ.75,790 కోట్ల బిసి సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్.
• రజకులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చింది టీడీపీనే. దువ్వారపు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం.
• అధికారంలోకి వచ్చాక బీసీ రక్షణ చట్టంతో రజకులతోపాటు బిసిలందరికీ రక్షణ కల్పిస్తాం.
• ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ పోస్టులు, దోబీ కాంట్రాక్టులు రజకులకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
• గ్రామాల్లో చెరువులను కబ్జా చేసిని వారిపై చర్యలు తీసుకుని, వాటిని తిరిగి అప్పగిస్తాం.
• పట్టణాల్లో దోబీఘాట్లు దురాక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
జగన్ పాలనలో సంక్షోభంలో గీత కార్మికులు
జగన్ నాయి బ్రాహ్మణులను మోసం చేసాడు. దేవాలయాల్లో పనిచేసే మమ్మలని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు. మీరు మాకు న్యాయం చెయ్యాలి. నాయి బ్రాహ్మణులకు ఆరోగ్య భద్రత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.
గీత కార్మికులకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వృత్తి, ఆరోగ్య భద్రత కల్పించాలి.
విధులు, నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జగన్ బీసీ లకు అన్యాయం చేసాడు.
బిసి సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నాం.
బిసి యువత కు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం.
రజక సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయాల్లో దోబి పనులు రజకులు ఇవ్వాలి. వైసిపి వాళ్ళు దొబి ఘాట్స్ కూడా కబ్జా చేస్తున్నారు.
…బిసి సామాజికవర్గం ప్రతినిధులు
లోకేష్ మాట్లాడుతూ..
దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేసాడు. అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేసాడు. దీని పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం తల నీలాల పై వచ్చే ఆదాయం లో పది శాతం నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం.
జగన్ పాలనలో గీత కార్మికులు సంక్షోభంలో ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా పథకాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తాం. నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం. లిక్కర్ షాపుల్లో వాటా కల్పిస్తాం.ఏం బి సి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. నిధులు కేటాయించింది టిడిపి.నిధులు, విధులు లేని కార్పొరేషన్లు జగన్ ఏర్పాటు చేసాడు.
బిసి శాఖ మంత్రి పేషి లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్ పాలనలో ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన దామాషా ప్రకారం ఉప కులాలకు నిధులు కేటాయిస్తాం.జగన్ సంక్షేమం కార్యక్రమాల కు ఇచ్చే నిధులు బిసిల ఖాతా లో రాస్తున్నాడు. మేము ఆ తప్పు చెయ్యం. బిసిల ను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తాం.
టిడిపి హయాంలో కుల వృత్తులను కాపాడటానికి ఆదరణ పథకం అమలు చేసాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రత్యేక స్మశానాలు ఏర్పాటు కు భూములు కేటాయిస్తాం.జగన్ విధ్వంస పాలన వలన ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.జగన్ రజక సోదరులకు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేసాడు. టిడిపి హామీ ఇవ్వక పోయినా దువ్వారపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం.
వైసిపి వాళ్లు దోబి ఘాట్స్ కబ్జా చేస్తున్నారు.టిడిపి హయాంలో దోబి ఘాట్స్ అభివృద్ది చేసాం.బీసీలకు పుట్టినిల్లు టిడిపి. బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టిడిపి.కీలకమైన పదవులు, శాఖలు బిసిలకు ఇచ్చింది టిడిపి.స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, జనతా వస్త్రాలు, ఆదరణ పథకం పెట్టింది టిడిపి.
బిసిలను పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి బిసి సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేసింది టిడిపి.జగన్ పాలన లో బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశాడు.జగన్ పాలనలో కీలక పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు.టిడిపి హయాంలో అన్ని కీలక పదవులు బిసిలకు ఇచ్చాం. ఒక్క సారి బిసిలు అంతా ఆలోచించాలి.బిసి ల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తీసుకొస్తాం. కుల వృత్తులు కాపాడటమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ, అధునాతన పనిముట్లు అందజేస్తాం.జగన్ బిసిల గురించి మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం టిడిపి. నా మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చాడు.టిడిపి బిసిల వేదిక అందుకే జగన్ కి భయం.
కొల్లు రవీంద్ర… కుల వృత్తులను కాపాడింది టిడిపి.కుల వృత్తులను ఆదరణ పథకం తీసుకొచ్చి రక్షించింది చంద్రబాబు.ఉప కులాలకు కూడా న్యాయం జరగాలి అని సాధికార సమితిలు ఏర్పాటు చేసింది నారా లోకేష్.జగన్ ప్రభుత్వం బిసి సామాజిక వర్గం ప్రతినిధులను వేధిస్తుంది.
బిసి సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి
వివిధ చేతి వృత్తుల ప్రదర్శన
కుల వృత్తులను ఆసక్తిగా తిలకించి వారు పడుతున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్న నారా లోకేష్.
రజక, నూర్ బాషా – దూదేకుల, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ఎం. బి. సి, మహేంద్ర, యాదవ, మత్స్యకార, ముదిరాజ్, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, సగర, కలంకారీ, చేనేత కుల వృత్తుల ప్రదర్శన చూసి వృత్తుల్లో ఎదుర్కుంటున్న సమస్యల గురించి తెలుసుకున్న లోకేష్. ప్రతి స్టాల్ దగ్గరా ఆగి వారు ఎదుర్కుంటున్న సమస్యలు, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చెయ్యాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కులవృత్తి దారుల అభిప్రాయాలు తెలుసుకున్న లోకేష్.