-ఆక్వారైతులకు 1.50కే విద్యుత్ కు హామీ ఇస్తూ శిలాఫలకం
-యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
సైకోపాలనపై సమరభేరి మోగిస్తూ జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు భీమవరం అసెంబ్లీ నియోకవర్గం వెంప గ్రామంలో 2800 కి.మీ.ల మైలురాయి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ఆక్వారైతులకు మేలు కలిగించేలా జోన్లతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 పైసలకే అందిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీనివల్ల ఆక్వారంగంపై ఆధారపడిన 18లక్షలమందికి మేలు కలుగుతుంది.