-నా పోరాటం, నాబలం, నా సైన్యం ప్రజలే
– కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు
– మీ ఊరులో మీకు ఇసుక దొరుకుతుందా?
– నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలిచ్చే పరిస్ధితి లేదు
– కానీ 2020 విజన్ తో ముందుకెళ్లి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం
– మీరంతా కలిసి జగన్ చెవిలో పూలు పెట్టాలి
– నా విధానం అభివృద్ది జగన్ విధానం విధ్వంసం
– ఏనాడైనా కరెంట్ చార్జీలు పెంచామా? కరెంట్ కోతలు విధించామా?
– కూతురిని చూడడానికి రూ. 40 కోట్ల ప్రజల డబ్బుతో ప్రత్యేకంగా చార్టెడ్ ప్లైట్ లో లండన్ వెళ్లారు
– నీళ్లివ్వలేని వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఉందా?
– సీఎం జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
– బాబు సభలకు నీరాజనం
– బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగం గా గుత్తి లో బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే నా పోరాటం, నాబలం, నా సైన్యం ప్రజలే. జగన్ పాలనలో అన్ని బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర ధరలు మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ.
ఆర్టీసీ చార్జీలు పెరిగాయి, కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు. మద్యం రేట్లు పెంచడమే కాక నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడని నమ్మి ప్రజలంతా మోసపోయారు, మీ ఊరులో మీకు ఇసుక దొరుకుతుందా? ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీపై కేసులు పెడుతున్నారు. యువగళం ప్రజా గళమై ప్రభంజనంలా సాగుతోంది, అందుకే యువగళం వాలంటీర్లపై దాడులు చేసి అరెస్టు చేశారు.
ఎంతమందిని ఇబ్బంది పెట్టినా పట్టు వదలం, సైకో పాలనపై పోరాటం సాగిస్తాం
సైకో ముఖ్యమంత్రి ఈ గుత్తికి వచ్చి తన పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పగలరా? బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కింద అగ్రిమెంట్ ఇస్తున్నా. 40 ఏళ్లుగా నన్ను ఆశీర్విందించారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న సార్… ఈ సైకో…పరిశ్రమలు తరిమేశాడు, అప్పులు చేశాడు, మీరు అధికారంలోకి వస్తే ఎలా ఎలా చేస్తారని కొంతమంది నన్ను అడుగుతున్నారు.
అదే నా ప్రత్యేకత, అదే నాకు మీ ఆశీస్సులు నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలిచ్చే పరిస్ధితి లేదు. కానీ 2020 విజన్ తో ముందుకెళ్లి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం, నేడ హైదరాబాద్ మహా నగరం అయిదంటే అది టీడీపీ ఘనతే. 25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఊహించి ఐటీ అభివృద్దికి కృషి చేశా. రేపు ఈ టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగులు సృస్టిస్తా..సంపద సృష్టించి ఆ సంపద ప్రజలకు పంచే బాధ్యత నాది.
అదే బాబు గ్యారెంటీ, భవిష్యత్తుకు ష్యూరిటీ
ఈ గుంతకల్లు రైల్వే జోన్ నుంచే గతంలో అన్ని వ్యాపారాలు జరిగేవి. సినిమాలు డ్రిస్టిబ్యూషన్ చేయాలన్నా చైన్నె నుంచి ఇక్కడ తెచ్చి ఇక్కడ నుంచి డ్రిస్టిబ్యూషన్ చేసేవారు. నేడు ఆ వైభవం అంతా ఏమైంది? గుత్తి కోట ఒక చరిత్ర…కృష్ట దేవరాయలు గుత్తి చెరువును తవ్వించారు, ఆ చెరువుకు కనీసం నీళ్లివ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది.
హంద్రీ నీవా ద్వారా జిల్లాకు నీళ్లు తెచ్చాం, గొల్లపల్లి ప్రాజెక్టును సవాల్ గా తీసుకున్నా….కియా మోటార్స్ తీసుకువచ్చాను. టీడీపీ హయాంలో ఒక్క సాగునీటి రంగానికే రూ. 64 వేల కోట్లు కోసమే ఖర్చు చేశాం. అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు. నాడు 90 శాతం సబ్సిడికి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, దీని వల్ల పండ్ల తోటలు పండించి లక్షలు సంపాదించారు, అది సంపద సృష్టించటం అంటే.
పోలవరం పూర్తి చేసి రాయలసీమకు నీళ్లివ్వాలనుకున్నా…పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు కృష్టి డెల్టాకు తీసుకొచ్చి అక్కడ నుంచి గుత్తికి తీసుకొచ్చేలా శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ. గుత్తి పట్టణంలో రూ. 173 కోట్లు త్రాగునీటి కోసం కేటాయించాం, దాన్ని పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది, 40 రోజులకు ఒక సారి కూడా నీళ్లివ్వటం లేదు. ఇసుకపై వీళ్ల బోడి పెత్తనం ఏంటి? సైకో ముఖ్యమంత్రి సైకో ఎమ్మెల్యేల ద్వారా అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారు.
నా విధానం అభివృద్ది జగన్ విధానం విధ్వంసం. మద్యపాన నిషేదం చేస్తాన్నాడు చేశాడా? మళ్లీ వచ్చి మీ చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటున్నాడు, మీరంతా కలిసి జగన్ చెవిలో పూలు పెట్టాలి. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చా..1995 నుంచి 2004 వరకు మిగులు విద్యుత్ సాధించాం. తర్వాత మళ్లీ నేను అధికారంలోకి వచ్చే 2014 నాటికి 22 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంది నేను వచ్చిన 100 రోజుల్లో మిగులు విద్యుత్ సాధించాం.
ఏనాడైనా కరెంట్ చార్జీలు పెంచామా? కరెంట్ కోతలు విధించామా? సోలార్ విద్యుత్ ను రూ. 10 నుంచి రూ. 2 కి తగ్గించాం. నేడు జగన్ అసమర్ద, అవినీతి వల్ల కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచి పేదలను దోపిడి చేస్తున్నారు. గతంలో రూ. 200 బిల్లు కట్టేవారు, నేడు రూ. 800 నుంచి 1000 కడుతున్నారు.
మీ గ్రామంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఉరవ కొండలో విండ్ మిల్లులు పెట్టి సాయంత్రం పూట గాలి ద్వారా కరెంట్ వచ్చేలా చేశాం. నేడు పంప్డ్ ఎనర్జీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయెచ్చు, ఇలా చేస్తే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. అనంతపురంలో ఎక్కువ భూమి, ఎండ దేవుడిచ్చాడు, దీన్ని ఉపయోగించుకుంటే సంపదే సంపద. పైన గ్రీన్ ప్యానల్ ఏర్పాటు చేసి దాని కింద కూరగాయలు పంటలు వేయెచ్చు, పైన కరెంట్ కింద కూరగాయలు పండించొచ్చు.
ఇది సంపద సృష్టించే విధానం, ఇదే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ. మనం వచ్చిన తరువాత ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15000 ఇస్తాను. ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తా. ఏడాదికి రూ. 18 వేలు మీ అకౌంట్ లో వేస్తా. 18. వేలను రూ. లక్షా 80 వేలు చేసి దాన్ని రూ. 18 లక్షలకు పెంచే మార్గం చూపిస్తా. 2047 నాటికి రాష్ట్రంలో పేదవాడు లేకుండా ఉండేలా చేసే శక్తి మనకు ఉంది, పి 4 విధానంతో పేదల్ని ధనికుల్ని చేస్తా..
దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తాం. అవసరం అయితే అదనంగా మరో సిలిండర్ ఉచితంగా ఇస్తా. మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. యువతకు యువగళం నిరుద్యోగ బృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ప్రపంచాన్ని మీ దగ్గర తెచ్చి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తా. టీడీపీ 5 ఏళ్ల రూ16 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.30 లక్షల ఉద్యోగాలు కల్పించాం.
నేను ఐటీ ఉద్యోగం ఇస్తే..ఈ సైకో ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగా లు. ఐటీ ఆయుధం మీకిస్తా…ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు మీ దగ్గర తెస్తా..వర్క్ ప్రం హోం ద్వారా ఇంటి దగ్గరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్త. మీ గ్రామాల్లోనే వర్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తా…లేదంటే ఇతర నగరాలు, దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తా. ఇదే మీ భవిష్యత్తుకు గ్యారెంటీ నా ష్యూరిటీ, ఇంటింటికి తిరిగి యువత అంతా ఈ విషయాలు ప్రజలకు చెప్పండి.
సైకిల్ ఎక్కి టీడీపీ జెండా పట్టుకోండి అదే మీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనంతపురంను హార్టికల్చర్ హబ్ గా మారుస్తా.. రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, గుత్తిలో ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లిస్తాం. ఆటో డ్రైవర్ల జీవితం భయంకరంగా తయారైంది.
కర్నాటక కంటే అనంతపురంలో డీజిల్ ధర లీటరుకు రూ.11.56 ఎక్కువ. అంటే 5 లీటర్లపై ఒక్కో డ్రైవర్ రోజుకు రూ.57 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.1,710, ఏడాదికి రూ.20,520 గుంజుతున్నాడు. అంటే 5 ఏళ్లలో రూ.లక్ష గుంజుతున్నాడు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి….వీటి వల్ల ఆటోలు, క్యాబులు తీవ్రంగా రిపేర్లకు వస్తున్నాయి. ఒక సారి షెడ్ కు వెళితే రూ5 వేలు, రూ.10 వేలు ఖర్చు.
జగన్ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేదని, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని, కాకీ చొక్కా వేసుకోలేదని, స్పీడ్ అని, రాంగ్ రూట్ అని, ఫిట్ నెస్ సర్టిఫికెట్ అని భారీగా బాదుతున్నాడు. ఇక రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ లద్వారా రవాణా రంగం మొత్తం నాశనం అయ్యింది. గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో రూ. 200, తమిళనాడులో రూ. 500 మాత్రమే కానీ ఏపీలో గ్రీన్ ట్రాక్స్ మూడు శ్లాబులుగా మార్చి భారీగా పెంచారు.
ఏడాదికి రూ. 200 ఉన్న పన్నును కనిష్టంగా రూ.2395 నుంచి గరిష్టంగా రూ. 30,820 వరకు పెంచారు. మన రాష్ట్రంలో త్రైమాసిక పన్ను కింద రూ. 43,640, హరిత పన్ను 21,820, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ రూ. 17 వేలు చెల్లించాలి. ఇవన్నీ కలిపితే రూ. 82,460 అవుతుంది. మళ్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దాదాపు రూ. 50 వేల వరకు కట్టాలి. అంటే మొత్తంగా 1.32 లక్షలు కట్టాలి.
ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు కానీ కన్న కూతురిని చూడడానికి రూ. 40 కోట్ల ప్రజల డబ్బుతో ప్రత్యేకంగా చార్టెడ్ ప్లైట్ లో లండన్ వెళ్లారు. ఈ పేదవాడికి కూతురుపై ఉన్న ప్రేమ రూ. 40 కోట్లు. మనం పిల్లల్ని సరిగా చదివించే పరిస్థితి లేదు, కానీ మన రాష్ట్రంలో పేదవాళ్లు మాత్రం కూతురిని చూడడానికి రూ. 40 కోట్లు ఖర్చు చేస్తారని ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద జగన్. గుంతకల్లు, గుత్తిలో రూ. 517 కోట్లతో 602 టిడ్కో ఇళ్లు 80 శాతం నిర్మించాం, కానీ వాటికి రంగులు వేసుకుని పేదలకు పంచకుండా చేశారు.
కూతుర్ని చూసేందుకు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిన సీఎంకి మీ ఇళ్లు పూర్తి చేయటానికి మనస్సు రాలేదు. హంద్రీనీవాపై రాగుల పాడు వద్ద లిప్ట్ ఇరిగేషన్ పెట్టి 13 చెరువులకు నీళ్లివ్వాలని రూ. 42 లక్షల శాంక్షన్ చేశాం, కానీ ఆ పని చేశాడా? గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 173 కోట్లు, మామిడిపట్నానికి రూ.69 కోట్లు ఇచ్చాం నీళ్లిచ్చారా? నీళ్లివ్వలేని వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఉందా?
గుత్తిలో మైనార్టీ స్కూల్, జూనియర్ కాలేజీ, పాల్ టెక్నిక్ కాలేజీకి రూ. 38 కోట్లతో భవనాలు నిర్మిస్తే వాటిలో ఆర్డీవో ఆఫీసు పెట్టారు, అది మైనార్టీలపై జగన్ కి ఉన్న ప్రేమ. గుంతకల్లు నుంచి కసాపురం వెళ్లే దారిలో రైల్వే అండర్ బ్రిడ్డి నిర్మించారా? గుంతకల్లులో ఇండోర్ స్టేడియయం పూర్తి చేశారా? అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేయలేదు. గుత్తి కోట, కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయంకు, బంజారాల ఆరాధ్య దైవం సేవా ఘడ్ అభివృద్దికి డబ్బులిచ్చా… పర్యాటకం కేంద్రంగా చేయాలనుకున్నా..కానీ వీళ్లు విధ్వసం చేశారు.
ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబమంతా ఎమ్మెల్యేలే, దోపిడి దారులే…ఆదోనిలో ఒక ఎమ్మెల్యే, మంత్రాలయంలో ఒక ఎమ్మెల్యే, ఉరవకొండలో ఎమ్మెల్సీ, వీళ్ల బావమరిది ఒక మంత్రి, అన్న టీటీడీ బోర్డు మెంబర్… వీళ్ల దోపిడికి హద్దే లేదు. కొండల్ని తవ్వి గుట్టల్ని మింగుతున్నారు, జగన్ ముందు నీ ఎమ్మెల్యేల సంగతి చూడు నా సంగతి ఏం చూస్తావ్ ?
దోచుకోవడం దాచుకోవటమే వీళ్ల పని, మామిడి మండలంలో చిత్రావతి నది నుంచి ఇసుక తెచ్చి గుంతకల్లు మార్కెట్ యార్డులో ర్యాంప్ పెట్టి అమ్ముతున్నారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేకు ముడుపువ్వాలి. టీడీపీ అధికారంలోకి రాగానే గుత్తి, గుంతకల్లు మంచినీటి సమస్య పరిష్కరిస్తాం
హంద్రి నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లిప్పిస్తాం..బుడగ జంగాలకు కుల ద్రువీకరణ పత్రాలు ఇప్పిస్తాం.ఆగిన పధకాలు అందిస్తాం, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తా…అదే నా ష్యూరిటీ. భవిష్యత్ తరాల కోసమే నేను పని చేస్తున్నా…రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమం చేస్తున్నా..ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలి.