– ప్రభుత్వ సర్వేలో విస్తుబోయే నిజాలు
– విద్యార్థుల మరణాలకు కారణాలు ఏమిటి?
– ఆచూకీ లేని వారు అనే కేటగిరీపై అనేక సందేహాలు
– మా వాలంటీర్లు తప్పుడు సర్వేలు చేశారు అని చెబుతారా?
– ఆచూకీ లేకుండా వెళ్ళిపోయినవారిలో బాలికలు ఎందరు?
– ఈ అంశంపై విద్యాశాఖ ఏమైనా విచారణ చేసిందా?
– విద్యార్థుల తల్లితండ్రులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
– జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి: 5 సం. నుంచి 18 సం. మధ్య వయసుగల విద్యార్థులు 62,754 మంది మృతి చెందారు.2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆగస్టు వరకూ- చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి
తూర్పు గోదావరి – 10,545
గుంటూరు – 6,422
అనంతపురం – 4,165
కర్నూలు – 3,283
స్కూల్ డ్రాపవుట్స్ : 3 లక్షల 88 వేల మంది ఉన్నారు.
కనిపించని విద్యార్థులు: 2 లక్షల 29 వేల మంది ఉన్నారు.
ఇప్పుడు మా పార్టీ వెల్లడిస్తున్న గణాంకాలు తప్పు అని వైసీపీ సర్కార్ చెప్పగలదా? ఈ సర్వే ఎవరో కాదు సాక్షాత్తు విద్యాశాఖ వారే చేయించారు.
ఈ సర్వేలో 13,676 గ్రామ సచివాలయాలు వాలంటీర్లు,15,004 వార్డు సచివాలయ కార్యాలయాల వాలంటీర్లు పాల్గొన్నారు. వాళ్ళు సర్వే చేసిన అందించిన వివరాలే ఇవి. ఆగస్టు నెలలోనే ఈ సర్వే చేశారు.వీటిని ఈ ప్రభుత్వ పెద్దలు ఈ వివరాలు సరికాదు – మా వాలంటీర్లు తప్పుడు సర్వేలు చేశారు అని చెబుతారా?
ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెబుతోంది.
వాళ్ళు చెబుతున్న లెక్కలు ఇవి..
– నాడు నేడు : రూ.16 వేల కోట్లు
– అమ్మ ఒడి: రూ.19,417 కోట్లు
– విద్యా దీవెన/వసతి దీవెన: రూ.11,717 కోట్లు
– మధ్యాహ్న భోజనం: రూ.1,824 కోట్లు
– రాగి జావ : రూ.86 కోట్లు (ఇందులో సగం శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారిదే)
మరి ఇన్ని వేల కోట్లు వ్యయం చేస్తున్నా విద్యార్థుల మరణాలు ఎందుకు ఇంత అందోళనకరంగా ఉన్నాయో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.ప్రభుత్వం చేసుకున్న సర్వేలోనే తేలిందంటే ఈ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి.
విద్యార్థుల మరణాలకు కారణాలు ఏమిటి? ఎందుకు ఇన్ని మరణాలు సంభవించాయో ముఖ్యమంత్రి చెప్పాలి.పిల్లల ఆరోగ్య సంరక్షణపై వీరికి ఏ మాత్రం బాధ్యత లేదు.ఇన్ని వేల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో చనిపోయారు అంటే కారణాలు ఏమిటనే విషయంపై అధ్యయనం చేయాలి.
పౌష్టికాహార లోపంతో ఏమైనా చనిపోయారా అనేది చెప్పాలి.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ఎప్పటికప్పుడు విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ చేయడంపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే సంగతి వెల్లడవుతోంది. 62,754 మంది విద్యార్థులు చనిపోయారు అంటే – ప్రతి ఒక్కరం స్పందించాలి.ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం.
కనీసం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల్లో వివిధ విభాగాల వైద్యులతో హెల్త్ క్యాంప్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది.ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు గంజాయి లాంటివి అందుతున్నాయి అని సమాచారం వస్తోంది.ఈ వ్యసనాలు కూడా ఒక కారణమా?
బాలికల వసతి గృహాల్లో తగిన సంరక్షణ చర్యలు ఉండటం లేదు.విద్యార్థినులు అనేక ఇబ్బందులుపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. 5 – 18 సం. మధ్య ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఏమిటి?వారికి మెరుగైన వైద్యాన్ని అందించలేరా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి..పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ఏ మేరకు దృష్టిపెట్టారు?
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ తోపాటు కనిపించడం లేదు అనే కేటగిరీ కూడా ఈ సర్వేలో కనిపించింది.ఇది చాలా విస్తుపోయే కేటగిరీ. ఆచూకీ లేకుండా కనిపించనివారి అనే కేటగిరీలో 2 లక్షల 29 వేల మంది ఉన్నారు.
ఆచూకీ లేని వారు అనే కేటగిరీపై మాకు అనేక సందేహాలు వస్తున్నాయి. వీరు కనిపించకుండా ఎలా పోయారా? వారి తల్లితండ్రులు ఎవరు? అదృశ్యమైపోయారా?ఇలా ఆచూకీ లేకుండా వెళ్ళిపోయినవారిలో బాలికలు ఎందరు? ఈ అంశంపై విద్యాశాఖ ఏమైనా విచారణ చేసిందా? అనే వాటికి పాలకులు, సంబంధిత ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిఈఆర్ సర్వే రిపోర్ట్ వివరాలు బయటపెట్టాలి. విద్యార్థుల మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి విద్యార్థుల తల్లితండ్రులకు క్షమాపణ చెప్పాలి.