-అందరూ సమిష్టిగా పని చెయ్యండి
-ప్రకాశం జిల్లా నేతలకు దక్షిణ కోస్తా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి దిశానిర్దేశం
ఒంగోలు,సెప్టెంబరు, 11: అందరూ సమష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సిపి గెలుపు కోసం కృషి చెయ్యాలని పార్టీ దక్షిణ కోస్తా జిల్లాల రీజీనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు..పార్టీ సంస్థాగత నిర్మాణం,ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం ,పార్టీ నియోజకవర్గ స్థాయి వ్యవహారాలు తదితర అంశాలపై వారితో చర్చించారు.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉంది… జిల్లాలో కొండపి నియోజకవర్గంతో సహా మళ్లీ అన్ని నియోజకవర్గాలలో పార్టీ జెండా ఎగరెయ్యాలని పిలుపునిచ్చారు..టిడిపి కోలుకోనే పరిస్ధితి లేదు… 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని వారికి వివరించారు.
నియోజకవర్గాలలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి.. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించాల్సిన భాద్యత ఎమ్మేల్యేలు, నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మీద ఉందన్నారు.
వాలంటిర్లు,సచివాలయ కన్వీనర్లు, గృహాసారథులు ఈ మూడు వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకుర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీదనే ఉందని వారికి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని,రాజకీయంగా పదవులను కల్పించారని అన్నారు.దొంగ ఓటర్ల విషయంలో జగ్రత్త వహించాలని చెప్పారు. నియోజక వర్గ స్థాయిలో ఏదైన సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని,తన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తానని లేని పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్టీ గెలుపుకోసం పలు అంశాలపై వారికి దిశా నిర్ధేశం చేశారు.
సోమవారం ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డా. ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి,కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనయాదవ్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు,మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు,జిల్లా పార్టీ అధ్యక్షులు జంకె వెంకట రెడ్డి తదితరులు విజయసాయిరెడ్డితో సమావేశం అయ్యారు..