-సెంటర్ల సందర్శనకు వెళ్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు?
-సెంటర్లు నిర్వహిస్తున్న యూనివర్శిటీ, కాలేజీల నిర్వాహకులను ఎందుకు బెదిరిస్తున్నారు?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో.. స్కిల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ లెన్సీ సెంటర్లు 6, ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు 36 వున్నాయి. ఈ కేంద్రాలను సందర్శించడానికి వైసీపీ సిద్ధమా? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ వైసీపీ ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం..
42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, సాక్షి మీడియాని, వైసీపీ అనుబంధ మీడియాని స్వాగతిస్తున్నాం. రండి కలిసి పర్యటిద్దాం. అక్కడ ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. కేంద్రం ఇచ్చిన సెంట్రల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లేనే లేవంటున్నవారు ఢీల్లీకి వచ్చి నిర్ధారించుకోగలరా?. మీ సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి, ప్రేమ్ చంద్రారెడ్డిలతో కలిసి అన్ని సెంటర్లు తిరుగుదాం.. రాగలరా? అని సవాల్ విసురుతున్నాను. కేంద్రం ఇచ్చిన సెంటర్లు లేనే లేవనడం విడ్డూరంగా వుంది.
ఇంకా పలు వాస్తవాలను అవాస్తవాలని మాట్లాడుతున్నవారు కూడా మాతో రావాలి. ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ డిజైన్ ఇన్సిటిట్యూట్ లు ఉన్న సెంటర్లన్నింటిని మదింపు చేసి వారు సాఫ్ట్ వేర్, హార్ట్ వేర్ పరికరాలు ఇచ్చారా లేదా అని నిర్ధారించుకుందాం. వారికి సర్టిఫికెట్స్ ఇచ్చారా లేదా అని కూడా నిర్ధారించుకుందాం. అజయ్ జైన్, రావత్ లు కూడా రావాలి.
ఈ ప్రపంచానికి రథసారధులైన యువత జీవితాలను ఈ ప్రభుత్వం బుగ్గిపాలు చేస్తోంది. ప్రతిభ ఉన్న యువత బతుకులను ఛిద్రం చేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారు. యువతకు బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిందిపోయి వారి అభివృద్ధికి నిరోధకులుగా మారారు. ఈ ప్రభుత్వం ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు అండగా నిలవాల్సింది పోయి గుదిబండగా మారారు. ముఖ్యమంత్రి జగన్ అండగా ఉండాల్సందిపోయి వారి జీవితాలను నర్వ నాశనం చేశారు.
మీ సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి, ప్రేమ్ చంద్రారెడ్డిలతో కలిసి అన్ని సెంటర్లు తిరుగడానికి దమ్ముంటే రాగలరా?
మేధావులు, పారిశ్రామికవేత్తలను కూడా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేయడం కరెక్టు కాదు. స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని పదే పదే ప్రభుత్వం అసత్యపు ప్రచారం చేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కు నిధులు విడుదల కావడం అబద్ధమా? ఎక్స్ లెంట్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్ 42 ఉండటం అబద్ధమా? ఈ సెంటర్స్ ని విజిట్ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియాతో సెంటర్స్ కు వచ్చేందుకు సిద్ధమా? ఈ సెంటర్లలో పరిరకరాలు ఉన్నాయా లేదా అని చూడటానికి వెళ్లేవారిని ఎందుకు ఈ ప్రభుత్వం అండ్డుకుంటోంది. ట్రైనింగే జరగనట్లు మాట్లాడుతోంది. అవినీతి అని నీతివంతులైన అధికారులను బెదిరిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు నిర్వహించే యూనివర్శిటీ, కాలేజీలను బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రులు ఈ సెంటర్లు సందర్శించడానికి సిద్ధమా?. మీకు ఆ దమ్ముందా?
42 సెంటర్ లకుసాఫ్ట్ వేర్, హార్ట్ వేర్ పరికరాలు అందాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కమీషనర్ శ్రీకాంత్ స్వయంగా సర్టిఫికెట్లు ఇచ్చారు. నేడు పరికరాలు, డిజైన్ టెక్ ఎక్కడా ఏమీ లేవని మాట్లాడుతున్నారు. అప్పుడు మానటరింగ్ కమిటీలో ఉన్న అధికారులందరూ మీ ప్రభుత్వంలోనే ఉన్నారు. వారిని ఎందుకు ప్రశ్నించడంలేదు?. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టిన కీలక అధికారులు జగన్ ప్రభుత్వంలోనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డిజైటన్ టెక్ ని, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ప్రశంసల వర్షం కురిపించారు. 2017 నుంచి కూడా టీడీపీ సెంటర్స్ లోను ఏర్పాటు చేసి బాగా నడిపింది. ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ట్రైనింగ్ ఇచ్చారు. 2 లక్షల 77 వేల మంది స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ కు దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 13 వేల మందికి శిక్షణ ఇచ్చారు. 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ ఎందుకు మీరు ప్రెజెంట్ చేయడంలేదు.
స్కిల్ డెవలప్ మెంట్ పథకం కింద మీరెంతమందికి శిక్షణ ఇచ్చారో, మేం ఎంతమందికి శిక్షణ ఇచ్చామో వాస్తవాలు బయట పెట్టాలి. 2019లో ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో తమ ప్రతిభను ప్రకటించుకున్నారు. సీఐడీ ఛీఫ్, సీనియర్ ఆఫీసర్ సంజయ్ చిలక పలుకులు మానాలి. ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసిస్టెంటా? అనే అనుమానం కలుగుతోంది. సీఐడీ ఛీఫ్ సంజయ్ బైబిల్ మీద విశ్వాసం ఉన్నవ్యక్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడో అర్థం కావడంలేదు.
ఎందుకిలా విష ప్రచారం చేస్తున్నాడో తెలియడంలేదు. సంజయ్ బైబిల్ లోని 9 వ కమాండ్ మెంట్ ఏం చెబుతోందో ఒక సారి చదవాలి. ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలియాలి. సంజయ్ అధికారిగా తన పరిమితిని అతిక్రమించారు. వైసీపీ నాయకులు అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ లలో భాగమైన 36 ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు, 6 స్కిల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ లెన్సీ సెంటర్ల సందర్శనకు ప్రభుత్వాధికారులు రావాలని పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం లేని అవినీతి గురించి ప్రచారం చేయడం, గందరళోళం సృష్టించడం మానాలి. భవిష్యత్తులో వీరికి ప్రజల చేతిలో ఇబ్బందులు తప్పవని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ వివరించారు.