ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ సర్కార్ సీఐడీ విచారణతో ఎందుకు సరిపెట్టింది?
• దేశానికే రోల్ మోడల్ గా నిలిచి, మధ్యప్రదేశ్, కేరళ ప్రభుత్వాలచే కొనియాడబడిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో అవినీతిపరుడికి లేని అవినీతి కనిపించక, చంద్రబాబు గొప్పతనం, ప్రజలకు లభించిన ప్రయోజనం కనిపిస్తుందా?
• వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి జూలై 30, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ బెస్ట్ మోడల్ అని ప్రకటించారు.
• 8.70 లక్షల కనెక్షన్లతో రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు.
• జగన్ రెడ్డి ప్రభుత్వానికి నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.560కోట్లవరకు ఆదాయం అందించిన ప్రాజెక్ట్ అవినీతిమయమా?
• ఏదో ఒక దానిలో చంద్రబాబుని ముద్దాయిని చేయాలన్న ప్రభుత్వ దుష్ట ఆలోచన, కుట్ర రాజకీయం తప్ప ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చేస్తున్న పాలకుల ఆరోపణలన్నీ నిరాధారాలే.
• గతంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేసి, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ సర్కార్, సీఐడీ విచారణతో ఎందుకు సరిపెట్టింది?
• చెప్పుచేతల్లో ఉండే సీఐడీతో తప్పుడు ఆరోపణలు చేయించి, ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం, పాలకుల కుట్రకోణం ఇక్కడే బహిర్గతమైంది.
• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాగైతే అజయ్ కుమార్ రెడ్డితో లేఖ రాయించి, చంద్రబాబుని ముద్దాయిగా చూపారో, అదే విధంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో కూడా దాని ఛైర్మన్ గా ఉన్న గౌతమ్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు.
• గౌతమ్ రెడ్డి ..ఎండీకి లేఖరాయడం… ఆ లేఖను సదరు ఎండీ ఎనర్జీ సెక్రటరీకి పంపడం..దానిపై సీఐడీ విచారణ జరపడం మొత్తం వైసీపీ ప్రభుత్వ కుట్రలో భాగమే
– మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర , మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కొండను తవ్వి తొండను పట్టలేకపోయిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పేరుతో మరో దుష్ప్రచారానికి తెరలేపింది : బీదా రవిచంద్ర
“ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనే కొండను తవ్వి తొండను కూడా పట్టలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పేరుతో కొత్తనాటకానికి తెరలేపింది. తాను అవినీతిపరుడు కాబట్టి, తాను జైలుకెళ్లాడు కాబట్టి, టీడీపీ వాళ్లు కూడా జైలుకెళ్లాలి.. అన్నదే జగన్ రెడ్డి దుష్ట ఆలోచన. ఫైబర్ గ్రిడ్ పై వైసీపీప్రభుత్వం కొత్త దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చినప్పుడు చంద్రబాబునాయుడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచే వినూత్నమైన కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ను తీసుకొచ్చారని, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రాలు కొనియాడాయి.
ఏపీ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్, ల్యాండ్ ఫోన్ సౌకర్యం కల్పించడం గొప్ప ఆలోచన అని ప్రశంసించాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ రూ.3,700 కోట్లతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే, తన దూరదృష్టి, వినూత్న ఆలోచనతో చంద్రబాబునాయుడు అన్నిరంగాల నిపుణులతో మాట్లాడి, ఆ ప్రాజెక్ట్ ను తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో అమలుచేశారు. రూ.3,700కోట్లు సబ్మిట్ చేసిన సంస్థతోనే రూ.333 కోట్లతో చంద్రబాబునాయుడు ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయించారు.
అవినీతి జరిగితే 24 వేల కిలోమీటర్ల కేబుల్ లైన్.. 13,514 సీ.సీ.కెమెరాలు ఎలా ఏర్పాటయ్యాయి? రాష్ట్రంలో దాదాపు 10లక్షల కనెక్షన్లు ఎలా ఇచ్చారు?
రూ.321కోట్లకు ఫైబర్ గ్రిడ్ టెండర్లు పిలిస్తే, రూ.291కోట్లతో ప్రాజెక్ట్ ను ఆమోదించారు. దాంతో రూ.30కోట్లు నాటి రాష్ట్రప్రభుత్వానికి ఆదా అయ్యాయి. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్రంలో 24వేల కిలోమీటర్లు కేబుల్ వేశారు. విశాఖపట్నంలో నెట్ వర్క్ ఆపరేషన్ కేంద్రాన్నికేవలం 6 నెలల్లోనే ప్రారంభించారు. 13 జిల్లాకేంద్రాల్లోని 2,445 పీ.వో.పీలతో 5,300 గ్రామాలు, 658 మండలాల్లో 13,514 సర్వైవ్ లెన్స్ సీసీ. కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాటుచేయాలనుకున్న కెమెరాలు 14,770. 2019 నాటికి రాష్ట్రంలో సుమారు 10లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ఇదంతా క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవం.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి జూలై 30, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ బెస్ట్ మోడల్ అని ప్రకటించారు. 8.70లక్షల కనెక్షన్లతో ఆదాయం వస్తోందని, రెండోదశలో పెద్దఎత్తున ప్రజలకు మేలు కలిగేలా ప్రాజెక్ట్ అమలుచేయబోతున్నట్టు స్వయంగా ఆయనే చెప్పారు. అలాంటి ప్రాజెక్ట్ పై ఈ ప్రభుత్వం రెండేళ్లుగా పసలేని అవినీతి ఆరోపణలు చేస్తోంది.
రూ.291 కోట్లతో ఆమోదింపబడిన ప్రాజెక్ట్ లో వందలకోట్ల అవినీతా?
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ టెండర్లు పిలిచింది రూ.321కోట్లకు అయితే, రూ.291 కోట్లకు ఆమోదించబడింది. దానిలో మొత్తం పేమెంట్ జరిగింది రూ.281కోట్లు అయితే ఈ ప్రభుత్వం వందలకోట్ల అవినీతి జరిగిందని చెప్పడం దుష్ప్రచారం కాక మరేమిటి? ప్రాజెక్ట్ అమలుకాకపోతే రాష్ట్రంలో దాదాపు 10లక్షల కనెక్షన్లు ఎలా ఏర్పాటు అయ్యా యి? ఇప్పటికీ నెలకు ప్రభుత్వానికి రూ.12కోట్ల వరకు ఆదాయం వస్తోంది నిజం కాదా? దాదాపు నాలుగున్నరేళ్లుగా వస్తున్న ఆదాయాన్ని ఈ ప్రభుత్వం అనుభవిస్తు న్నది నిజంకాదా?
చంద్రబాబునాయడు ప్రాజెక్ట్ అమలుచేయకుండానే వైసీపీ ప్రభుత్వా నికి ఆదాయం వస్తోందా? టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు కోసం కేవలం రూ.280 కోట్లు ఖర్చుపెడితే, సంవత్సరానికి రూ.140కోట్లకు పైగా వైసీపీప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నాలుగేళ్లలో దాదాపు జగన్ ప్రభుత్వానికి దాదాపు రూ.560 కోట్లవరకు ఆదాయం వచ్చింది. ఇంతకంటే బెస్ట్ మోడల్ ఇంకెక్కడైనా ఉందని ఈప్రభుత్వం నిరూపించగలదా? ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలుకి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకు ఈప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో పెద్దఎత్తున అవినీతి జరిగిందా?
ప్రాజెక్ట్ అమల్లో భాగంగా నాటి ప్రభుత్వం సిస్కో, ఆల్టిస్ సంస్థల నుంచి పరికరాలు తీసుకొచ్చింది నిజం కాదా? సిస్కో మరియు పోర్చుగీస్ ప్రభుత్వ సంస్థ అయిన ఆల్టిస్ కు రూ.117 కోట్లు చెల్లించింది నిజంకాదా? రూపాయి ఖర్చుపెట్టకుండా 24వేల కిలోమీ టర్లు కేబుల్ వేయడం సాధ్యమవుతుందా? ఈప్రభుత్వం టెరాసాఫ్ట్ సంస్థపై అభియో గాలు మోపితే, సదరు సంస్థ యాజమాన్యం మొత్తం అకౌంట్స్ వివరాలు బయ పెట్టింది. ఆ సంస్థ ఎవరి నుంచి ఏమేం వస్తువులు కొన్నదో, ఎవరితో కలిసి పనిచేసి, వారికి ఎంతెంత చెల్లించింది.. మొత్తం వివరాలను ప్రభుత్వం ముందు ఉంచినా ఇంకా చంద్రబాబు, లోకేశ్ లపై ఆధారాల్లేని ఆరోపణలు చేయడం ఏమిటి?
పేద, మధ్య తరగతి ప్రజలకోసం బెస్ట్ మోడల్ తీసుకురావడమే చంద్రబాబు, టీడీపీప్రభుత్వం చేసిన తప్పా? కేవలం తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి వేధించాలనే తాపత్రయం తప్ప, ఎక్కడైనా ప్రభుత్వం తప్పుజరిగిందని చెప్పే ఆధారాలు బయపెట్టిందా? ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై గతంలో నిరాధార ఆరోపణలు చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ (ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే) ఎమ్మెల్యే అయ్యాక సైలెంట్ అయ్యాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన ఎందుకు కోర్టుకు వెళ్లలేదు? వేమూరి హరిప్రసాద్ క్రిమినల్ అంటున్నారు.. ఈ.వీ.ఎమ్ ట్యాంపరింగ్ పై ఆయన ప్రజంటేషన్ ఇస్తే అది నేరమా? గతంలోఈ.వీ.ఎమ్ లపై ప్రము ఖులు ఆరోపణలు చేయలేదా?” అని బీదా రవిచంద్ర ప్రశ్నించారు.
గతంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసి, ఇప్పుడు సీఐడీ విచారణతో సరిపెట్టి తప్పుడు ఆరోపణలు చేయడం పాలకుల కుట్రకోణంలోభాగం కాదా? : ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
“ దేశ రాజకీయాల్లో అవినీతి స్కిల్ మాస్టర్ గా జగన్ రెడ్డి పేరుపొందాడు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి… నేడు తన అధికారంతో లక్షలకోట్లు కాజేశాడు. ఇసుక, మద్యం, ఖనిజాలు, పేదలకు ఇళ్లపట్టాలు.. భూకబ్జా లతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది.
వచ్చే ఎన్నికల్లో తనన, తన ప్రభుత్వాన్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి రోజుకో నిరాధార ఆరోపణను తెరపైకి తెస్తున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి అని చెప్పిచెప్పి చివరకు ఏమీ తేల్చలేక చతికిలపడ్డారు. ఇప్పుడు అదేకోవలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను జగన్ సర్కార్ తెరపైకి తీసుకురావడం దుష్ట రాజకీయ క్రీడలోభాగమే.
జగన్ రెడ్డి నచ్చిన వారికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అప్పగించి ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడు
రాష్ట్రంలోని ప్రతి పేదకుటుంబానికి అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్, టెలిఫోన్ సౌకర్యం అందించాలన్న సదుద్దేశంతో టీడీపీప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో ఇంటింటికీ వినోదం అందించడమే చంద్రబాబు చేసిన తప్పా? గ్రామాలు, మండలాలు అనుసంధానిస్తూ 24 వేల కిలోమీటర్ల కేబుల్ లైన్ వేసి, ప్రతి కుటుంబానికి నెలకు రూ.149లతో కనెక్షన్ ఇవ్వడం దోపిడీ చేయడమా?
ఆనాడు చంద్రబాబు నెలకు రూ.149లకు ఇచ్చిన కనెక్షన్, వైసీపీ ప్రభుత్వంలో రూ.349 లు ఎలా అయ్యింది? పెంచిన రూ.200లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? తన అనుమాయులకు ప్రజల సొమ్ము పంచిపెట్టడానికే జగన్ రెడ్డి కేబుల్ కనెక్షన్ ధరను రూ.200లు పెంచింది నిజంకాదా? తనకు నచ్చినవారికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు అప్పగించి జగన్ రెడ్డి దోపిడీ చేస్తున్నది నిజంకాదా?
నాడు సీబీఐ విచారణ కావాలన్నవారు..నేడు సీఐడీ విచారణతో సరిపెట్టడం కుట్రలో భాగమే
గతంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీప్రభుత్వం నాడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. మంత్రుల సబ్ కమిటీ, లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుడు సీబీఐ విచారణ చేసినవారు.. ఇప్పుడు సీఐడీ విచారణతో ఎందుకు సరిపెట్టారు? తమ చెప్పుచేతు ల్లోని సీఐడీతో తప్పుడు ఆరోపణలు చేయించి, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయాలని చూస్తున్న పాలకుల కుట్రకోణం ఇక్కడే బహిర్గతమైంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాగైతే అజయ్ కుమార్ రెడ్డితో లేఖ రాయించి, దాన్ని బూచిగా చంద్రబాబుని ఎలాగైతే ముద్దాయిగా చూపారో, అదే విధంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో కూడా దాని ఛైర్మన్ గా ఉన్న గౌతమ్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు.
గౌతమ్ రెడ్డి ..ఎండీకి లేఖరాయడం… ఆ లేఖను సదరు ఎండీ ఎనర్జీ సెక్రటరీకి పంపడం..దానిపై సీఐడీ విచారణ జరపడం మొత్తం వైసీపీ ప్రభుత్వ మోడస్ ఆపరేషన్ లో భాగమే. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన టెరాసాఫ్ట్ సంస్థను వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తే, తాము ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వలేదని చెప్పించారు. ఎవరైతే ఆ సంస్థ తరుపున అలాచెప్పారో, ఆ వ్యక్తిని ఈప్రభుత్వం ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది.
గౌరీశంకర్ ను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించడం వెనకున్న ప్రధానోద్దేశం అతని సాక్ష్యం ప్రభుత్వా నికి అవసరం కాబట్టే. ఎందరో ఐ.ఏ.ఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈడీ ఆపరేషన్స్ నిర్వహణకు గౌరీశంకర్ ను ఎలా నియమిస్తారని ప్రశ్నించగానే అతన్ని తొలగించారు. పదోతరగతి చదవని వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎందుకు నియమించారు.. ఎందుకు తొలగించారంటే కేవలం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో చంద్రబాబు అవినీతి చేశారని అతనితో చెప్పించడానికే.
అధికారుల మెడపై కత్తిపెట్టీ మరీ తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు, మానిటరింగ్, ఇంప్లిమెంటేషన్లో హైపవర్ కమిటీ, టెక్నికల్ అవాల్యుయేషన్ కమిటీ సహా మొత్తం 5 కమిటీలు కీలకంగా వ్యవహరించాయి. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడంతోపాటు, నాడు హైపవర్ కమిటీలో కీలకంగా ఉన్న ఐ.ఏ.ఎస్ అధికారుల మెడపై కత్తిపెట్టి మరీ ఈ ప్రభుత్వం చెప్పించింది. అధికారుల వాంగ్మూలాలు బయటకొచ్చిన నాడు.. సదరు అధికారులెవరో తెలుస్తుం ది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే, కొందరు అధికారులు ఆయన చెప్పిం దానికి తలాడిస్తూ, తమను తామే తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించుకోవడానికి ఇష్టప డుతున్నారు.
అవినీతి ఆరోపణలు తప్ప ఆధారాల్లేని ప్రాజెక్ట్ లో చంద్రబాబుని, లోకేశ్ ను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు
దేశానికి ఆదర్శంగా నిలిచిన ప్రాజెక్ట్.. రాష్ట్రంలో అతి తక్కువఖర్చుతో అమలుచేసిన ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వానికి అవినీతి ప్రాజెక్ట్ గా కనిపించడం శోచనీయం. ప్రాజెక్ట్ అమలుకు అతి తక్కువ మొత్తానికి టెండర్ వేసిన వ్యక్తికి అప్పగిస్తే అది కూడా తప్పు అంటున్నారు. ఏదో ఒక దానిలో చంద్రబాబుని ముద్దాయిని చేయాలన్న ప్రభుత్వ దుష్ట ఆలోచన, కుట్ర రాజకీయం తప్ప ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని చెప్పి, 20 నెలలుగా విచారించిన జగన్ సర్కార్, సీఐడీ చివరకు ఒక రూపాయి చంద్రబాబుకు వచ్చిందని నిరూపించగలిగిందా?
అదే విధంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో పనిచేసిన సంస్థలు, వ్యక్తులు వారు నాటి ప్రభుత్వంతో చేసిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ నెలల తరబడి పరిశీలించినా ఈ ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థలు ఏమీ తేల్చలేకపోయాయి. కేవలం ఆరోపణలు తప్ప ఆధారాలు లేని ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లను ముద్దాయిలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత సహా ఇతర నేతలపై తప్పుడు కేసులుపెట్టి, పార్టీని లేకుండా చేయాలని జగన్ రెడ్డి ఆరాటపడుతున్నాడు.
గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా 110 మంది టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా చంపించాడు. వేలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించాడు. ఆనాడు ఆయన అన్నిచేసినా టీడీపీ మరలా ఉప్పెనలా విరుచుకుపడి అధికారంలోకి వచ్చింది. తప్పుడు కేసులు, వేధింపులు, కుట్ర రాజకీ యాలు టీడీపీని ఆపలేవనే వాస్తవాన్ని తండ్రి బాటలో నడుస్తున్న జగన్ రెడ్డి గ్రహించాలి.” అని ధూళిపాళ్ల హితవు పలికారు.