నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని సందర్శించిన సోమిరెడ్డి
పోలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం, కాకుటూరు పంచాయితీ నందు ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని సందర్శించిన సోమిరెడ్డి.
యూనివర్సిటీ నందు వున్న కంప్యూటర్స్, టేబుల్స్ , ట్రైనింగ్ సెంటర్ లో వున్న పరికరాలను,నూతన భవనాన్ని పరిశీలించారు.స్కిల్ డెవలప్మెంట్ కో-ఆర్డినేటర్ విజేత గారిని అడిగి ఇక్కడ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు.. ఎంత మంది కి ఉద్యోగాలు వచ్చాయి అని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ ఈ కేసులో నయాపైసా అవినీతి నిరూపించలేని జగన్ ప్రభుత్వం, చంద్రబాబును కక్షసాధింపుతో అరెస్టు చేసి, తన సైకో మనస్తత్వం బయటపెట్టుకున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ సీఐడీ అధికారులు ఈ స్కాంలో అవినీతి సొమ్ము ఏ ఖాతాలకు వెళ్లిందో నిరూపించకలేపోయారంటే, ఈ కేసులో పస లేదని స్పష్టమవుతోందన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇంతలా జరుగుతుంటే అధికార పార్టీ ప్రతినిధులు దీనిలో అవినీతి జరిగింది అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి , నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్,ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ,గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పనబాక లక్ష్మి , కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఇంఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, తాళ్ళపాక రమేష్ రెడ్డి, అనురాధ, పాల్గొన్నారు..