– భువనేశ్వరి నోట చంద్రబాబు అవినీతి మాట
– క్విడ్ ప్రోకో నేరస్తులు చంద్రబాబు, లోకేశ్
– అందుకే, లోకేశ్ నిన్న రాష్ట్రపతిని కలిశాడు
– ఏపీకి రిటర్న్ రావడానికే భయపడ్డ లోకేష్ గిఫ్ట్ ఇస్తాడా?
అసెంబ్లీ దగ్గర మీడియాతో రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా
నారా లోకేశ్ నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలిశారు. దాన్ని చూసినోళ్లంతా.. ‘అదేంటీ.. చిన్నదొంగ వెళ్లి పెద్దదొంగను జైలు నుంచి విడిపించాలని రాష్ట్రపతి గారికి చెబుతున్నాడు’ అంటూ అనుకున్నారు. ఏరోజైనా వీళ్లు రాష్ట్రం కోసం గానీ ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం గానీ రాష్ట్రపతి గారిని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా..? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
చట్టానికి అతీతులని బిల్డప్ః
నారా లోకేశ్ మాటలు గానీ.. వాళ్ల అమ్మతో పాటు టీడీపీ నేతల ప్రవర్తన ఎలా ఉందంటే.. మేమంతా చట్టాలకు అతీతులం అన్నట్టుగా ఉంది. చంద్రబాబు ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచేస్తే.. వాళ్లమీద ఏ కేసులూ పెట్టకూడదంట. అరెస్టులు చేయకూడదంట. ఒకపక్కన రాష్ట్ర ఖజనాకు కన్నమేసి వందల కోట్లు కొట్టేసిన దొంగగా ఆధారాలతో సహా దొరికి జైలుకెళ్లిన చంద్రబాబు గురించి న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్నాయి. బయట వీళ్లు మాత్రం మేమంతా సచ్ఛీలురుమంటూ బిల్డప్‌లిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
మోదీ, అమిత్‌షాల అపాయింట్‌మెంట్ కరువుః
ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకోవడానికి నారా లోకేశ్ పడరాని పాట్లు పడుతున్నాడు. వాళ్లేమో ఇతని తీరుకు ముందుగానే భయపడి తమ కాళ్లను దాచుకుంటున్నారు. ఎందుకంటే, ఆంధ్ర ప్రజలు నమ్మకంగా చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెడితే.. వారి నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజా సొమ్మును అడ్డంగా దోచేసిన దొంగగా మిగిలాడు. అలాంటి దోపిడీ దొంగకు మద్ధతిచ్చే ఉద్దేశం లేకనే మోదీగారు, అమిత్ షా గారు లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదనేది స్పష్టమౌతున్న సంగతి.
4 స్కామ్‌ల్లో నేరస్తుడు చంద్రబాబుః
చంద్రబాబు హయాంలో జరిగిన దొంగతనాలు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన చేసిన కుంభకోణాలు ఒకటీ అరా కాదు. తీగలాగేకొద్దీ అతని అవినీతి డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికి నాలుగు కుంభకోణాల్లో ఆయన నేరస్తుడు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌భూముల స్కామ్, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కామ్.. వీటన్నింటికీ చంద్రబాబు ఏ విధంగా సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించి రూ.కోట్లు కొట్టేశాడనేది ఆధారాలతో సహా ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో తేలిన విషయం.
క్విడ్ ప్రోకో నేరగాళ్లు బాబు, లోకేశ్ః
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ నేరస్తుడు జైల్లో ఉంటే.. ఇన్నర్‌రింగ్‌రోడ్ స్కామ్‌లో నిందితుడైన లోకేశ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి గారిని కలవడమనేది హాస్యాస్పదం. మరి, లోకేశ్ ఇన్నర్‌రింగ్ రోడ్ స్కామ్‌పై చాలా అమాయకంగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు, ఇన్నర్‌రింగ్ రోడ్డే లేదు కదా.. స్కామ్ ఎలా జరుగుతుందని ఆయన దీర్ఘాలు తీస్తున్నాడు. కానీ, ఆయన తండ్రి మాయాజాలం అతనికి అర్ధమైందో లేదో గానీ.. ప్రజలకు మాత్రం ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ పట్ల స్పష్టత వచ్చింది.
– అమరావతి రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్ లేకుండానే… చంద్రబాబు పెద్ద ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించినట్లు గ్రాఫిక్స్‌ల్లో కళ్లకు కట్టినట్టు చూపించి లింగమనేని తదితరులు దగ్గర రూ.కోట్లు విలువైన భూమిని కొట్టేసి క్విడ్‌ప్రోకోకు ఎలా పాల్పడ్డాడో అందరికీ తెలుసు. లేని రోడ్లకే గ్రాఫిక్కులు చూపించి స్కామ్ చేసినోడు.. ఇక, ఉన్న రోడ్లను చూపెట్టి ఎంత దండుకుంటాడో అనేదీ అందరూ ఆలోచన చేయాలి. ఈవిధంగా తండ్రీకొడుకులు కలిసి క్విడ్‌ప్రోకోకు పాల్పడి ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచుకుని ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అందరికీ అవగాహన కావాల్సిన సమయమిదిగా చెబుతున్నాను.
ఏపీకి రిటర్న్ రావడానికే భయపడ్డ లోకేశ్ః
నిన్న లోకేశ్ మేకపోతు గాంభీర్యం నటిస్తూ .. వచ్చే ఆర్నెల్లలో మా నాయకుడు జగన్‌గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడాన్ని విని అందరూ నవ్వుకుంటున్నారు. అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికి దొంగల్లా పారిపోయి ఢిల్లీలో దాక్కున వ్యక్తి రిటర్న్ గిఫ్టుల గురించి మాట్లాడటమా..? ఏపీకి రిటర్న్ రావడానికే భయపడుతున్న వ్యక్తి లోకేశ్ అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట.
భయాన్ని పరిచయం చేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఈరోజు కాళ్ల దగ్గర్నుంచీ కళ్లవరకు భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు లోకేశ్. ఎక్కడ ఎవరు తనను చూస్తారో.. ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనని గజగజ వణుకుతూ ఢిల్లీ రోడ్లమీద దొంగలా తిరుగుతున్న లోకేశ్‌ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎర్రడైరీలో తనకు నచ్చని వారి పేర్లు రాసుకుంటానని నిన్నటిదాకా బెదిరించిన లోకేశ్ పేరేమో.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు కావడం గమనార్హం.
భువనేశ్వరి నోటనే బాబు అవినీతిః
లోకేశ్ తీరు ఒకలా ఉంటే, ఆయన తల్లి భువనేశ్వరి తీరు మరింత విచిత్రంగా ఉంది. మేము ప్రజల డబ్బును దోచుకోవాల్సిన అవసరమేదీ లేదు. మా హెరిటేజ్ కంపెనీలో 2శాతం షేర్‌ను అమ్మితేనే రూ.400 కోట్లు వస్తుందన్న ఆమె, తన భర్త చంద్రబాబు ఎంత అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది. ఈ విషయాన్ని ప్రజలు, అటు ప్రభుత్వ అధికారులు గమనించాలి. కేవలం 2 శాతం షేర్ అమ్మితేనే రూ.400 కోట్లు వస్తే.. హెరిటేజ్ మొత్తం అమ్మితే దాదాపు రూ.20వేల కోట్లు వస్తాయి. మరి, చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.20వేల కోట్లును చూపించాడా.. లేదా..? అనే సంగతి తేల్చాల్సి ఉంది. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆస్తులా..?
భువనేశ్వరి మామ ఖర్జూర నాయుడుకు రెండెకరాల పొలం, రెండుశెంట్లు ఇంటిస్థలం ఉండేది. ఆయనకు చంద్రబాబుతో పాటు మరో కొడుకూ ఉన్నాడు. అంటే, కర్జూరపు నాయుడు ఆస్తిలో కొడుకులిద్దరికీ చెరో ఎకరా పొలం, చెరో శెంటు భూమి మాత్రమే ఉండాలి. మరి, ఈరోజు భువనేశ్వరి నోట చెబుతున్న రూ.20 వేల కోట్ల విలువైన హెరిటేజ్ ఆస్తులెలా వచ్చాయో ఆమె సమాధానం చెప్పాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
ఇక, హైదరాబాద్‌లో చంద్రబాబు ప్యాలెస్ ఖరీదు దాదాపు రూ.600 కోట్లకు పైగా ఉంది. ఇలా అన్ని ఆస్తులు కలిపి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు ఎలా వచ్చాయి..? 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 14 ఏళ్ల అధికారంలో ప్రజల్ని అడ్డంగా దోచుకున్న సొమ్మేకదా ఆ రూ.2 లక్షల కోట్లు..? అని ప్రశ్నిస్తున్నాను. పాలు పిండుకుంటే.. కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకుని వాటిని అమ్ముకుంటేనే ఇన్ని రూ.లక్షల కోట్లు వచ్చాయా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను.
దొంగసొమ్ము దాచడంలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాత్రః
అదేవిధంగా చంద్రబాబు దగ్గర ఐటీ లెక్కల్లోకి రాని రూ.118 కోట్లు బ్లాక్‌మనీ ఉందని.. కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. వీటిపై నారా లోకేశ్, భువనేశ్వరిలు ఏం సమాధానం చెబుతారు..? దోచేయాల్సిందంతా దోచేసి దొంగల్లా ఆధారాలతో దొరికిన తర్వాత కూడా వాళ్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అబద్ధాల్ని వల్లెవేస్తున్నారో, ఎలా ప్రచారం చేస్తున్నారో అనేది ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. చంద్రబాబు, లోకేశ్ దోచేసిన సొమ్మును కట్టలుకట్టలుగా లెక్కబెట్టి దాచేసింది భువనేశ్వరి, బ్రాహ్మణిలే కనుక వారికి కూడా ఈ దొంగతనాల్లో భాగస్వామ్యం ఉంటుంది. అందుకే, వారు ప్రజల్ని తమ అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంః
గతంలో మాదిరిగా టీడీపీ నేతల అబద్ధాల్ని నమ్మేంత అమాయకంగా ప్రజలు లేరు. మాయాప్రపంచాన్ని చూపెట్టి రాష్ట్ర ఖజానాకు కన్నమేసిన దోపిడీదొంగలుగా చంద్రబాబు, లోకేశ్‌ను ప్రజలు గుర్తించారు. అందుకే, ఇలాంటి నేతల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి తరిమేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరిస్తున్నాను.