– డీఎల్ రవీంద్రారెడ్డి
అమరావతి: ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ”స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది.ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. తెదేపా, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, పవన్ పొత్తు మనస్పర్థలు లేని కూటమి. జగన్ అనుచరుల దురాగతాలు ప్రజల్లో నాటుకుపోయాయి. రాష్ట్రం సర్వనాశనం కావడానికి జగన్ కారణం” అని డీఎల్ ఆరోపించారు..