పొన్నూరులో ధూళిపాళ్ల నిరసన దీక్ష

Spread the love

– భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు
– సైకో పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
– మండిపడ్డ ధూళిపాళ్ల

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో నిరసన దీక్ష నిర్వహించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగుమహిళ అధ్యక్షురాలు మంజరి, పట్టణ టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ.. సైకో ప్రభుత్వానికి పోయే రోజులు వచ్చాయని, అందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. టీడీపీ క్యాడర్‌ను వేధించే ఏ ఒక అధికారినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.

పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజరి మాట్లాడుతూ.. మహిళల ఉసురు సైకో ప్రభుత్వానికి తగిలితీరుతుందన్నారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కోవడం చేతకాని జగన్ ప్రభుత్వం, పిరికిపంద మాదిరిగా ప్రజానాయకుడు చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. చీప్ లిక్కర్ అమ్మకాలతో రాష్ట్రంలోని మహిళల తాళి తెంపుతున్న జగన్‌కు మహిళలు బుద్ధిచెబుతారని మంజరి హెచ్చరించారు.

Leave a Reply