చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్
విశ్వాస ఘాతకానికి మారుపేరు కేసీఆర్
ఈనాటికి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు
కేసీఆర్ ఏ విషయాన్నైనా ప్రజలను నమ్మించే నైపుణ్యవంతుడు
ప్రధాని ఫోటోను చించివేయడం సిగ్గుమాలిన చర్య
మహారాష్ట్ర కి పోయే మీరు పర్యాటకులేనా?
నీకే నిఘా వ్యవస్థ ఉంటే ప్రధానికి ఉండదా?
దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసి, దళితబంధు కింద రూ. 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సరిగ్గా అమలు చేయని ముఖ్యమంత్రి విశ్వాస ఘాతకుడని బిజెపి తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్ అంటూ దుయ్యబట్టారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి హరీశ్ రావు, ప్రధాని ప్లెక్సీని చించేసి కుసంస్కారానికి ఒడిగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవమే. విశ్వాసానికి మారుపేరు మోడీ .. విశ్వాస ఘాతకానికి మారుపేరు కేసీఆర్. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.. ఈనాటికి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు. కేసీఆర్ ఏ విషయాన్నైనా ప్రజలను నమ్మించే నైపుణ్యవంతుడు.కేసీఆర్ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని బిజెపి మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతుల సంక్షేమం కోసం మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున: ప్రారంభించింది కేంద్రం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున ప్రారంభించేందుకు మోదీ తెలంగాణకు వస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని విమర్శించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి హరీశ్ రావు, ప్రధాని ప్లెక్సీని చించేశారు.. టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని అడగాలి తప్పితే ప్రధాని ఫోటోను చించివేయడం సిగ్గుమాలిన చర్య.
బీఆర్ఎస్ నేతలు సంస్కారవంతులైతే మోదీ గారి బొమ్మ ఎందుకు పెట్టలేదు? కేంద్రం బియ్యం ఇస్తే ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ బొమ్మ పెట్టకుండా.. కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మీ ఫోటో ఉండదు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేది మోదీ మాత్రమే. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బిజెపి మ్యానిఫెస్టోలో పెట్టలేదు. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా నరేంద్ర మోదీ గారు ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ చేశారు.
ప్రధాని మంత్రి వస్తే టూరిస్ట్ అంటున్నారు.. బీఆర్ఎస్ పేరుతో మీరు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. మహారాష్ట్ర కి పోయే మీరు పర్యాటకులేనా..? ప్రగతి భవన్ అధికారిక నివాసం.. పార్టీ కార్యాలయం కాదు. ఇతర రాష్ట్రాల వాళ్లకు ప్రగతి భవన్ లో పార్టీ కండువాలు కప్పుతున్నారు. ప్రధాన మంత్రిని కేటీఆర్ చీటర్ అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దళిత ముఖ్యమంత్రి, దళిత బందు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పింది ఎవరు?
ఇచ్చిన హామీలను విస్మరించిన వారు పెద్ద చీటర్. కేసీఆర్ ఏ పార్టీకీ ఎంత డబ్బు పంపింది ప్రధానికి తెలియదా? నీకే నిఘా వ్యవస్థ ఉంటే ప్రధానికి ఉండదా? ప్రధాని ఆధారాలు లేకుండా మాట్లాడుతారా? సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ ను పూర్తి చేసింది. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.. కేసీఆర్ మాటలకు మోస పోతే గోస పడుతారు. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారు.
10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు? దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు..? చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి రూ. 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది? హుజురాబాద్ లో రూ. 600 కోట్ల ఎలా ఖర్చు పెట్టినా బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మలేదు.
ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కేసీఆర్ కోరిన మాట వాస్తవం కాదా? దళితుడికి ఎస్సీ వెల్ఫెర్, బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేసీఆర్ చేతిలోనే ఉంది.. భవిష్యత్ లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు. గురువింద గింజ నలుపు ఎరుగనట్లు ఉంది కేసీఆర్ తీరు. ప్రజా సమస్యలపై గిరిగీసి బరిలో కొట్లడటానికి బిజెపి సిద్ధంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోదీ కేసీఆర్ ను దూరం పెట్టారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్ గారు, రాకేష్ రెడ్డి గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.