వీడియో లు మీడియా ముందు విడుదల చేసిన అనిత
1.20 లక్షలు మంది మహిళలు,ఆడ పిల్లల వేధింపులు గురించి ఎందుకు మాట్లాడలేదు?
అసభ్య పదజాలంలో మాట్లాడే పద్ధతికి తొలి మెట్టు వేసింది రోజా
తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
నిన్న కొందరు మహానటి మాటలు చూస్తే నవ్వొస్తోంది మా పార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి ఏదో ఉగ్రవాది ని అరెస్ట్ చేస్తున్నట్టు 200 మంది పోలీసులను పెట్టి లాక్కేలారు దారుణం మంత్రిరోజా అసెంబ్లీ లో చంద్రబాబు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోసం చేసిన విమర్శలు వీడియో లు మీడియా ముందు విడుదల చేసిన అనిత.. ఇదే రోజా అసెంబ్లీ నన్ను అవమానించిన ఘటన మంత్రిగా ఉన్న ఈ రోజా మరచిపోయారా? అసలు ఈ అసభ్య పదజాలంలో మాట్లాడే పద్ధతికి తొలి మెట్టు వేసింది రోజా. ఈ నాలుగున్నారేళ్ల లో 1.20 లక్షలు మంది మహిళలు,ఆడ పిల్లల వేధింపులు గురించి ఎందుకు మాట్లాడలేదు?
మద్యపానం నిషేధం పేరు చెప్పి ఓట్లు వెంచుకుని మోసం చేశారు. అసెంబ్లీ లో వెకిలి నవ్వు నవ్వుతూ భాధపెట్టిన క్షణాలు మరచిపోలేదు. ఇద్దరం ప్రజాప్రతి నిధులం. ఒక్కసారి కేజీహెచ్ కి వెళ్లి నాణ్యత లేని మద్యం వల్ల ప్రాణాలు మీద తెచ్చుకున్న వారు కేజీహెచ్ లో ఉన్నారు వెళ్లి చూద్దాం. మద్యం తాగే వారి మీద కూడా ఎందుకు అప్పు తెచ్చారో జగన్ ని ప్రశ్నించు.
విశాఖ ను రాజధాని చేస్తాను విశాఖ అంటే ప్రేమ అంటారుగా.. రండి కేజీహెచ్ కి వెళ్లి చూద్దాం. భువనేశ్వరి,బ్రాహ్మణి, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతావు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు కోసం విమర్శలు చేస్తోంది. బండారు సత్య నారాయణ మూర్తి సతీమణి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే , కనీసం రసీదు ఇవ్వలేదు భారతి రెడ్డి కోసం ఒక్క మాట మాట్లాడితే నిమిషాల్లో పోలీసు ఇళ్లకు వస్తారని అన్నారు.