అసలు లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతిలేని ప్రభుత్వం…బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలి
• ఇన్నర్ రింగ్ రోడ్ కు, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని జగన్ సర్కారే హైకోర్టుకి చెప్పింది
• లోకేశ్ అంటే భయం కాబట్టే..ప్రతి దానిలో ఆయన పేరుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
• జగన్ రెడ్డి అతని ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే.. తప్పు చేయని చంద్రబాబుని 30రోజులుగా జైల్లో ఉంచగలిగింది
• తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసి, తన అవినీతిని సీబీఐ, ఈడీ సంస్థలు న్యాయస్థానాల్లో రుజువు చేస్తేనే జగన్ రెడ్డి 16నెలలు జైల్లో ఉన్నాడు.
• చంద్రబాబుకు మద్ధతుగా ప్రజాగ్రహం తారాస్థాయికి చేరింది.
• పోలీసుల్ని అడ్డుపెట్టుకోకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడో నేలమట్టమయ్యేది
• సెక్షన్ 144.. సెక్షన్ 30 టీడీపీ చేపట్టే శాంతియుత నిరసనలు, ధర్నాలకే వర్తిస్తాయా?
టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన అచ్చెన్నాయుడు
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి ప్రసంగం..
అంశాలవారీగా తెలుగుదేశం విడుదలచేసే పుస్తకాల్లోని సమాచారాన్ని ప్రజలంతా తెలుసుకొని, అధికారపార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
“ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ సర్కార్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై కోర్టుల్లో మెమోలు దాఖలు చేసింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుడు కేసుల తో చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. జగన్ రెడ్డి రాజకీయ కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా టీడీపీ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది. దానిలో భాగంగా నిన్న తెలుగుదేశం పార్టీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలతో ‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ అన్న పుస్తకాన్ని విడుదలచేశాం.
నేడు ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాల సమాహారమైన ‘లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది’ అన్నపేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశాం. ఈ పుస్తకంలో రాజధాని అమరావతి అభివృద్ధికోసం గతంలో టీడీపీప్రభుత్వం నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారా న్ని పొందుపరచడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీ విడుదలచేసే పుస్తకాలను చదివి, వాస్తవాలు తెలుసుకొని అధికారపార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన చంద్రబాబునాయుడిని తప్పుడుకేసులతో జైల్లో పెట్టి జగన్ రెడ్డి శునకానందం పొందుతున్నాడు
తన ఆలోచనలు.. పనితీరుతో చంద్రబాబునాయుడు దేశం గర్వించేలా జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అనేక రాష్ట్రాలకు, వ్యవస్థలకు , వ్యక్తులకు రోల్ మోడల్ గా నిలిచిందనడం అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తిని ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందే తప్ప.. ఎక్కడా వీసమెత్తు అవినీతికి దానిలో ఆస్కారం లేదని తాము తొలినుంచీ చెబుతూనే ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు.. అమల్లో పైసా అవినీతి జరగలేదు.
రాష్ట్రయువత శక్తి యుక్తుల్ని, మేథా సంపత్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడం కోసం ముందుచూపు తో చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి తన కక్షసాధింపులకోసం బలిచేశాడు. టీడీపీ అధినేతను జైలుకు పంపి 30రోజులవుతున్నా… ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆయన తప్పుచేశాడని రుజువు చేయలేకపోయింది. న్యాయ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం ప్రవేశపెట్టలేకపోయింది. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేని ఈ దద్దమ్మలు చివరకు ఏమీ తేల్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చిన విరాళాలపై పడ్డారు.
చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని.. ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతిని ప్రశ్ని స్తున్నాడనే ఆయనపై కక్ష కట్టి జైలుకు పంపారు. పోలవరం నాశనమైన తీరుని.. రాష్ట్ర రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాడనే టీడీపీ అధినేతను జగన్ రెడ్డి అన్యాయంగా జైలుకు పంపాడు. అమరావతి విధ్వంసం సహా, వ్యవస్థల విధ్వంసం పై బాబు గొంతెత్తడాన్ని జీర్ణించుకోలేకనే ఆయన్ని అన్యాయంగా జ్యుడిషియల్ కస్టడీ లో ఉంచారు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలుకాలేదని, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు మాట్లాడుతున్నాడనే ఆయన్ని కటకటాల పాలు చేశారు.
ఇసుక, మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియాల ద్వారా జగన్ రెడ్డి నాలుగేళ్లలో లక్షలకోట్లు దోచేసిన వైనాన్ని పూసగుచ్చినట్టు చంద్రబాబు ప్రజలకు వివరిస్తున్నాడన్న దుగ్ధతోనే ఆయన్ని జైల్లో పెట్టారు. జగన్ రెడ్డి అవినీతిని.. వైసీపీ ప్రభుత్వ దోపిడీని నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లడమే చంద్రబాబు చేసిన నేరం. అందుకే మా నాయకుడిని అన్యాయంగా జగన్ రెడ్డి జైలుకు పంపాడు. సీఐడీ చంద్రబాబుని ఏ కేసులో అయితే అరెస్ట్ చేసిందో.. ఆ కేసులో ఆయన తప్పు చేశాడని ఇంతవరకు నిరూపించలేకపోయారు. ఆఖరికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా న్యా యస్థానాల్లో చంద్రబాబు తప్పు చేశాడనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చావుకబురు చల్లగా చెప్పాడు.
అసలు లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతిలేని ప్రభుత్వం…బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలి ఇన్నర్ రింగ్ రోడ్ కు, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని జగన్ సర్కారే హైకోర్టుకి చెప్పింది. అలాంటప్పుడు మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే ఎందుకు లోకేశ్ ప్రస్తావన తెస్తున్నారు? లోకేశ్ ను చూసి ఎందుకంతగా భయపడుతున్నారు?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఇసుమంతైనా జరగని అవినీతిని కనిపెట్టేందుకు నాలుగేళ్లుగా తలకిందులుగా తపస్సు చేసిన జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం…తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబు తప్పుచేశాడని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టింది. అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతిలేని ప్రభుత్వం…బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలి. రింగ్ రోడ్ లేదు.. బొంగు రోడ్డు లేదు.. కానీ చంద్రబాబు మాత్రం తప్పుచేశాడు…ఇదీ ఈ దిక్కుమాలిన బ్యాచ్ చేస్తున్న వితండవాదన. ప్రభుత్వం చెబుతున్నఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అసలు భూసేకరణే జరగలేదు. రోడ్డే వేయలేదు. అలాంటప్పుడు చంద్రబాబు, లోకేశ్ లు తప్పు చేశారని సిగ్గులేకుండా వైసీపీ నేతలు ఎలా మాట్లాడతారు?
ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల్ని ఎదుర్కోవడానికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లోకేశ్ హైకోర్టుని ఆశ్రయిస్తే, ఆ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానానికి చెప్పింది. లోకేశ్ కు సంబంధమే లేకుంటే, పదేపదే వైసీపీ నేతలు, మంత్రులు ఎందుకు ఆయన పేరు చెబుతున్నారు? లోకేశ్ ను చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు? జగన్ సర్కార్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి, దేశం మెచ్చిన నాయకుడిని, మహానుభావుడిని అన్యాయంగా 30రోజులుగా జైల్లో పెట్టింది. ఇలాంటి చర్యలతో శునకానందం పొందుతు న్న ఈ ముఖ్యమంత్రిని, అతని పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాలని పిలుపునిస్తున్నాం. వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచిరోజులు వస్తాయి.
మాజశ్రేయస్సు కాంక్షించేవారు.. ప్రజలపక్షాన పోరాడేవారు… చంద్రబాబుకి మద్ధతు గా నిలవాలి
వాస్తవాలు తెలిసినవారు.. సమాజశ్రేయస్సు కాంక్షించేవారు.. నిత్యం ప్రజలపక్షాన పోరాడేవారు.. మేథావులు.. విద్యావేత్తలు.. పౌరహక్కుల నేతలు చంద్రబాబునాయుడి ని జైలు పాలు చేయడంపై స్పందించాలి. ప్రొఫెసర్ హరగోపాల్.. సామాజికవేత్త బాలగోపాల్ ల మాదిరే.. ఇతర ప్రముఖులు పెదవి విప్పాలి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్మపోరాటానికి అలాంటి వారి మద్ధతు చాలాచాలా అవసరం.
తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసి, తన అవినీతిని సీబీఐ, ఈడీ సంస్థలు న్యాయస్థానా ల్లో రుజువు చేస్తేనే జగన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. తప్పు చేశాడు కాబట్టే ప్రజలు ఛీకొడతారన్న భయంతో వారిముందుకు రాలేకపోయాడు.
జగన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు అతనేం చేస్తే జైల్లో ఉన్నాడో ప్రజలకు తెలుసు. తండ్రి అధికారా న్ని అడ్డుపెట్టుకొని తాను బాగుపడటమే కాకుండా.. తన కంపెనీలు.. తన కుటుంబ సభ్యులు.. తనబినామీలు అందరూ బాగుపడేట్టు చేశాడు. వేలకోట్ల అవినీతికి పాల్ప డ్డాడని తెలుగుదేశం పార్టీనో.. మరొకరో చెప్పలేదు. జగన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా న్యాయస్థానాల్లో నిరూపితమైంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్రదర్యాప్తు సంస్థలు ఆధారాలను న్యాయస్థానాల ముందు ఉంచి, జగన్ రెడ్డి బాగోతాన్ని బహిర్గత పరిచాయి. ఈడీ రూ.43వేలకోట్ల జగన్ రెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆనాడు తాను తప్పు చేశాడు కాబట్టే… ప్రజలముందుకు రాలేకపోయాడు. అతని తరుపున అతని కుటుంబసభ్యులు కూడా ప్రజలు ఛీకొడతారన్న భయంతో బయటకు రాలేకపోయారు.
చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపడంపై ప్రజాగ్రహం తారాస్థాయికి చేరింది. పోలీసుల్ని అడ్డుపెట్టుకోకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడో నేలమట్టమయ్యేది
కానీ నేడు రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఏ తప్పూ చేయని వ్యక్తిని, ప్రజలకోసం పాటుపడే మనిషిని, అభివృద్ధి, సంక్షేమమే రెండుకళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను, నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రగతిపథాన నడిపిన వ్యక్తిని అన్యాయం గా జైల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పోలీసు ల సాయంతో ప్రజల్ని నిలువరిస్తూ తప్పించుకుంటున్నారు గానీ.. లేకుంటే ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను నేలమట్టం చేసేవారు. గుంటూరులో నేడు అన్నిపార్టీలు కలిసి శాంతియుత ర్యాలీకి పిలుపు నిచ్చారు. దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రాత్రి నుంచే అన్నిపార్టీల నేతల్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు.
ఉద్యమం ఉధృతం చేయడమంటే రాష్ట్రాన్ని వల్లకాడు చేయడమా? ప్రజలకోసం రాష్ట్రం కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ హింసాత్మక ధోరణిలో ముందుకెళ్లదు
చంద్రబాబు అరెస్ట్ పై ఉద్యమం ఉధృతం కాలేదంటున్నవారంతా ఒక్కటే తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చడం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కాదని అర్థం చేసుకోండి. మేం చేత గాక శాంతియుత నిరసనలకు పిలుపునివ్వడం లేదు. రాష్ట్రం, ప్రజలు నష్టపోకూడదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కూడదనే ఆలోచిస్తున్నాం. మొన్న మేం మోత మోగిద్దాం.. కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ప్రజలు స్వఛ్చందంగా వారికి నచ్చిన విధంగా మోత మోగించి నిరసన తెలిపి, చంద్రబాబుకి మద్ధతిచ్చారు. అలానే గాంధీ జయంతి నాడు సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిస్తే, ప్రజలు వారి ఇళ్లల్లో ఉండే నిరాహార దీక్షలు చేపట్టారు. నేడు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుంది. ప్రజల నిరసనల నుంచి వెలువడే కాంతి ధాటికి ఈ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కళ్లు బైర్లు కమ్ముతాయి.
144 సెక్షన్.. సెక్షన్ 30 తెలుగుదేశం కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తాయా? విజయవాడలో జరిగే వైసీపీ సమావేశంవల్ల ఎలాంటి సమస్యలు రావని డీజీపీ చెప్పగలడా?
తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలకు మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా? రెండ్రోజుల్లో విజయవాడలో వైసీపీ భారీ సమావేశం పెట్టనుంది. దానివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తవా అని డీజీపీ ని ప్రశ్నిస్తున్నా. ఖాకీ దుస్తులు వేసుకోగానే సరికాదు.. చట్టం వైసీపీవారికి మాత్రమే చుట్టమా? మేం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతామని లిఖితపూర్వకంగా తెలియచేస్తున్నా కూడా పోలీసులు మా కార్యక్రమా లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
సెక్షన్ 30 అనేది ఎప్పుడో చాలా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే పెడతారు. అదికూడా కేవలం ఒకటి.. రెండు రోజులు మాత్రమే. కానీ జగన్ రెడ్డి వచ్చాక నెలలతరబడి సెక్షన్ 30 అమలు చేస్తు న్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న పోలీసు అధికారులు.. రాజ్యాంగహక్కుల్ని కాలరాస్తున్న జగన్ రెడ్డి సర్కార్ దమనకాండపై, మా నిరసనలను అడ్డుకోవడంపై న్యాయస్థానాల్ని ఆశ్రయించ బోతున్నాం. తప్పు చేసే పోలీసుల్ని న్యాయస్థానాల ద్వారానే శిక్షిస్తాం.” అని అచ్చెన్నా యుడు తేల్చిచెప్పారు.
కార్యక్రమంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, నిమ్మల రామానాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పీతల సుజాత, అశోక్ బాబు, రాకేష్ ,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.