– టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్ లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేశారు, అంతటితో ఆగక ఆయన బాడీ చెకప్ చేయించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..
జైళ్ల డీజీఐ రవికిరణ్ ఒక డాక్టర్ లా వ్యవహరించారు. పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా జైళ్ల డీజీఐ మట్లాడారు. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు నాయుడు ఒక్కరినే ప్రత్యేకంగా చూడలేమంటూ జైల్ అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయుల్లో జగన్ ఒక్కడే. అలాంటి వ్యక్తికి హెలీక్యాప్టర్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, సెక్యూరిటీ ఇవన్ని ఎందుకు? ఆయన సీఎం అనే కదా!
అలాగే చంద్రబాబు కూడా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. జగన్ చెంచల్ గూడ జైల్లో ఎంజాయ్ చేసినట్లు చంద్రబాబు ఎంజాయ్ చేయటంలేదు. 74 సంవత్సరాల చంద్రబాబు డీహైడ్రేషన్, ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదు, బాడీ చెకప్ చేయాలి. జైళ్ల అధికారులు డాక్టర్లు చెప్పింది యధాతథంగా చెప్పటంలేదు, వివరాలు దాస్తున్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేయటంలేదు.
చంద్రబాబు వెయిట్ నెల క్రితం ఎంత ఉన్నింది, ఇప్పుడెంత ఉంది డాక్టర్లు చెప్పాలి. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు నాయుడు ఒక్కరినే ప్రత్యేకంగా చూడలేమంటూ జైల్ అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలందిస్తున్న వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? జైలును అత్తగారి ఇల్లులా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. చంచల్ గూడ జైలును వైసీపీ కార్యాలయంగా మార్చి, అక్కడే పార్టీలో చేరికలు, పార్టీ సమావేశాలు నిర్వహించారు. షటిల్ ఆడుతూ చంచల్ గూడ జైలులో జగన్ కాలక్షేపం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయినా, ప్రజలు మరచిపోలేదు.
జైల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటిని సప్లై చేయడం వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చింది. జైల్లో ఉన్న డాక్టర్లు జీజీహెచ్ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న విధానం కరెక్టు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు హెల్త్ విషయంలో డాక్టర్స్ రిపోర్టుని యధావిధిగా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. లేదా అదే రిపోర్టును జతచేస్తూ మీరు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి.
సజ్జల ఒకలాగ, జైళ్ల డీఐజీ ఒకలాగ, ప్రిజన్స్ డీజీ ఒకలాగ, మినిష్టర్లు ఒకలాగ మాట్లాడడం సబబుకాదు. అధికారంలో ఉన్నాము కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. అన్ని సమయాలు ఇలాగే ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు. టీడీపీ అధికారం వచ్చి చట్టాల్ని ఇదేలాగ అమలు చేస్తే వైసీపీవాళ్ల గతేంటి? వైసీపీ వారు అన్నం తినే పరిస్థితులు కూడా ఉండవు.
వైసీపీ నాయకులు బతికున్నంత కాలం చిప్ప కూడు తినాల్సిందే. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి నాయకుల వరకు దాడులు, అరాచకాలు మితిమీరాయి. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నిజాలు దాచొద్దు. వాస్తవాలు చెప్పాలి. ఆయన ఆరోగ్య విషయంలో అవసరమైతే ఆయన ప్రైవేటు వైద్యుల్ని అనుమతించాలి.
ఒక్క ఏసీ పెడితే సరిపోదు. డీ హైడ్రేషన్ తో చంద్రబాబు గారు అస్వస్థతకు గురికావడంతో కోట్లాదిమంది తెలుగు ప్రజలు తల్లడిల్లుతుంటే వైసీపీ నాయకులకు నవ్వులాటగా ఉంది. ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవాలి, వారిని సంప్రదించాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. హెల్త్ విషయంలో నివేదికలు, రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.