– ప్రజల ఆకలి తీర్చిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టిడిపి హయాంలో ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను జగనాసురుడనే పెత్తందారుడు మూసేసి పేదల ఉసురు పోసుకున్నాడు. నిరుపేదల క్షుద్బాధ తీర్చేందుకు నా సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఆరంభించాను. పిచ్చి జగన్ సైకో సైన్యం నానా అడ్డంకులు సృష్టించారు. మన సంకల్పం ముందు సైకోలు ఓడిపోయారు. నేటితో మా మంగళగిరి అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకుంది. ఏడాదిన్నర కాలంలో లక్షలాది మంది ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ నిర్వహణకి విరాళాలు ఇచ్చిన దాతలు, బాధ్యతలు చూస్తోన్న వలంటీర్లు, సహకరిస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా.