Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళా…ఈ ప్రయాణం భారంగా ఉంది

– నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్
-దేవుడి దయతో నిజం గెలుస్తుంది అని న్నమ్ముతున్నా: భువనేశ్వరి

నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను.

LEAVE A RESPONSE