ఇందులో మొత్తం 22 కోచ్లు ఉంటాయి..రివర్స్ తీసుకునేందుకు సమయం వృధా కాకుండా మరియు ఫాస్ట్ పికప్-యాక్సిలరేషన్-డిసెలరేషన్ కొరకు పష్-పుల్ మోడ్లో ముందు ఒకటి వెనక ఒకటి రెండు ఇంజన్లు ఉంటాయి. గరిష్ట వేగం 130 Kmph..
22 కోచ్లలో:
2 SLRD (1+1) కోచ్లు..8 జనరల్ (4+4) కోచ్లు, 12 స్లీపర్ కోచ్లు ఉంటాయి.. ఏసీ కోచ్లు ఉండవు. ఏసీలో వెళ్ళాలనుకునే వారికి ‘వందేభారత్’ ఉండనే ఉంది కదా. అందువల్ల వీటిలో ఏసీ కోచ్లు ఉండవు. వాటి స్థానంలో జనరల్ కంపార్ట్మెంట్లు ఉంటాయి.
సామాన్యులకు అందుబాటులో సూపర్ ఫాస్ట్ రైళ్ళు ఉండటం మనకు 75 ఏళ్ళుగా కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. మొత్తంగా ప్రతి ‘వందే సాధారణ్’ రైలులో ఏకంగా 8 జనరల్ కంపార్ట్మెంట్లు సామాన్యులకు అందుబాటులో ఉండనున్నాయి.