రుణ బాధల విముక్తికి.. సోమవారం శివారాధన

Spread the love

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి.
2. పూజానంతరం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.
3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.
5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరిని దర్శించుకోవాలి?
పరమేశ్వరుని ఆలయంలో నవగ్రహాలుంటాయి. చాలా మందికి ముందు ఎవర్ని దర్శించుకోవాలో అని ఒకింత సందిగ్ధత ఉంటుంది. మహేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ని దర్శించుకోవాలి. లేదా నవగ్రహాల్ని దర్శించినా, శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించినా నవగ్రహాలు తమ స్వామిని తొలుతగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి.

కుటుంబమంతా గుడికెళ్తే ఎక్కువ ఫలంవస్తుందా?
సకల పూజా విధానాల్లో సకల ఐశ్వర్యాలు, క్షేమాలు కుటుంబమంతటికి అని ఆశీర్వచనము ఉంటుంది. దేవాలయ పూజారుల ఆశీర్వాదాల్లో కూడా కుటుంబ పరంగానే ఆశీర్వాదం ఇస్తారు.

అనగా దైవ దర్శనానికి కుటుంబమంతా కలిసి వెళ్ళాలని అర్ధం. అప్పుడే పరిపూర్ణ ఫలితం వస్తుంది. అష్టోత్తరం చేసేటప్పుడు కూడా మీరొక్కరే వెళ్ళినా భార్య పేరూ, పిల్లల పేర్లూ అడిగి అష్టోత్తర పూజ చేసేది అందుకే

సేకరణ

Leave a Reply