Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనంతా దళితులపై ఊచకోతే

– ఒకపక్క ఊచకోత మరోపక్క నాఎస్సీలు అనే జపం మరలా జగన్ ముఖ్యమంత్రి అయితే దళితులు రాష్ట్రం వదిలి పారిపోవాలి
• రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు, కేంద్రప్రభుత్వానికి కనిపించడం లేదా?
• రాష్ట్రంలో ఉన్న దళిత మేథావులు.. దళితసంఘాలు దళితుల పక్షాన నిలవకుండా.. వారికి అండగా నిలవకుండా ఏం చేస్తున్నాయి?
• ఒక పక్క ఎస్సీలను ఊచకోత కోయిస్తున్నజగన్ సిగ్గులేకుండా నా ఎస్సీలు అంటున్నాడు.
• ఎస్సీలంతా జగన్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలో ఆలోచించుకోవాలి.
• దళితులంతా ఒకేతాటిపై నిలిచి కాలికి గజ్జె కట్టుకొని ప్రతి పల్లె..ప్రతి దళిత వాడకు వెళ్లి…జగన్ రెడ్డి..తమజాతికి చేస్తున్న మోసం.. కానుకగా ఇచ్చిన ఊచకోత..అతని అవినీతి, దోపిడీ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి
టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ‘దళితులంతా బాబుతోనే దళిత సమ్మేళన సభ’ సమావేశం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

జగన్మోహన్ రెడ్డి అంతం.. మాలమాదిగల పంతం. ఇదేనినాదంతో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేద్దామని దళితులకు పిలుపునిచ్చిన ఎం.ఎస్.రాజు

– జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా దళితజాతి ఒకే తాటిపై నిలిచి, ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ దళితనేతలు
కార్యక్రమం ప్రారంభించడానికి ముందు టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు…టీడీపీ దళిత నేతలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.. జగజ్జీవన్ రామ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాకే దళిత..బీసీ…మైనారిటీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పురోగమించాయి టీడీపీ తొలినుంచీ సామాజిక న్యాయానికే కట్టుబడి ఉంది : అచ్చెన్నాయుడు
“తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న తప్పుచేయకుండా, నీతి నిజాయితీలే ఊపిరిగా, ప్రజాభిమానమే సంపదగా బతికిన చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి, 52 రోజుల పాటు అన్యాయంగా జైల్లో బంధించిన విషయం మనం ఎప్పటికీ మర్చిపోలేం.

చంద్రబాబునాయుడి అరెస్ట్ కు నిరసనగానే సోదరుడు ఎం.ఎస్.రాజు సైకిల్ యాత్ర చేపట్టి.. అన్ని అటంకాలు అధిగమించి విజయవంతంగా ముందుకు నడిచాడు. తెలుగుదేశం పార్టీ మొదటినుంచీ సామాజిక న్యాయానికే కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ రాకముందు దళితులు.. బీసీలు.. మైనారిటీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. వారి కష్టాలు.. బాధలు పట్టించుకోకుండా పూర్తిగా ఆయావర్గాలను విస్మరించాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాకే.. దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు..ముఖ్యంగా చెప్పాలంటే దళిత వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకా శాలు లభించాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ లభించని గొప్ప ప్రయోజనాల్ని టీడీపీ దళితులకు అందించింది. దళితులు సమాజంలో భాగమేనని.. వారు కూడా సమాన గౌరవం పొందాలనే సదుద్దే శంతో టీడీపీ ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసింది. ఆ కమిషన్ దళితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన అన్ని సూచనల ను అమలు చేసిన నాయకుడు మన చంద్రబాబు. దళితుల్ని రాష్ట్రంలో దేశంలో అగ్రస్థా నంలో నిలపడానికి చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిఃచారు.

ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ జగన్ రెడ్డి దళితుల్నిఊచకోత కోస్తున్నాడు
2019లో దళితులు జగన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. జగన్ రెడ్డి కుట్రలకు బలైన కోడికత్తి శీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే.. ఈ ముఖ్యమంత్రేమో నాలుగున్నరేళ్లు గా దళితుల్ని ఊచకోత కోయిస్తున్నాడు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే దళితులపై ఊచకోత మొదలైంది. అతను సీఎం పీఠం ఎక్కినప్పటినుంచీ నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల దళితులపై దాడులు..అవమానాలు.. వేధింపులు.. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కనిపించడంలేదా? కేంద్రప్రభుత్వానికి కనిపించడం లేదా?

రాష్ట్రంలో ఉన్న దళిత మేథావులు.. దళితసంఘాలు దళితుల పక్షాన నిలవకుండా.. వారికి అండగా నిలవకుండా ఏం చేస్తున్నాయి? రాష్ట్రంలోని ఎస్సీ కమిషన్ ఏం చేస్తోంది ? దళితుల స్వేచ్ఛా..స్వాతంత్ర్యాలకోసం పోరాడిన వారు.. రాజ్యాంగం అమలులోని లోపాలపై గతంలో గొంతెత్తిన వారు మౌనం వహించడం వల్ల దళితజాతికి తీరని నష్టం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ.. విభజన తర్వాత ఏపీలో గానీ ఎన్నడైనా ఇలాం టి దారుణాలు చూశామా? దళితులు..బీసీలు..మైనారిటీలపై ఇంత దమనకాండ చూశామా?

ఒకపక్క ఊచకోత..మరోపక్క నాఎస్సీలు అనే జపం. దళిత, బీసీ, మైనారిటీ వర్గాలపై ప్రభుత్వంలో జరిగే దాడులు..దారుణాలపై ఆయావర్గాల మంత్రులు ఎందుకు మాట్లాడరు?
సామాజిక సాధికార బస్సుయాత్రల పేరుతో ప్రజల్లోకి వస్తున్న దళిత, బీసీ, మైనారిటీ మంత్రులు తమ వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లా డరు? ఒక పక్క ఎస్సీలను ఊచకోత కోయిస్తూ.. ఈ ముఖ్యమంత్రి నా ఎస్సీలు అంటు న్నాడు. రాజ్యాంగం ద్వారా దళితులకు సంక్రమించిన కొన్ని ప్రత్యేక అవకాశాలు లేకుండా చేయడమేనా జగన్ రెడ్డి ఎస్సీలకు చేసిన మేలు? చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన 27పథకాలు రద్దుచేయడమేనా జగన్ దళితులకు చేసిన మంచి?

జగన్ రెడ్డికి చెంచాలుగా పనిచేసే దళిత.. బీసీ..మైనారిటీ నాయకులు తప్ప రాష్ట్ర్రంలోని ప్రతి ఒక్కరూ చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన గొప్పతనం ప్రజలకు అర్థమైంది. ఆయన్ని ప్రజలు ఎంతగా నమ్మారో చెప్పడానికి ఆయన జైలు నుంచి విడుదలైన రోజు సాగిన సుదీర్ఘ రోడ్డు ప్రయాణమే నిదర్శనం. తమ బాగు.. అభ్యున్నతి కోసం పాటుపడిన ఒక మహా నాయకుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని కుటుంబాలకు కుటుంబాలు ఆవేదన తో రోడ్లపైకి వచ్చాయి. చంద్రబాబునాయుడు తన జీవితాన్ని ప్రజలకోసమే అంకితం చేశారు. లక్షకోట్లు దోచేసి..16నెలలు జైల్లో ఉండివచ్చిన జగన్.. ఏతప్పూ చేయని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు.

మద్యంలో చంద్రబాబు.. అతని ప్రభుత్వం అవినీతి చేసిందని మద్యంలో మునిగితేలుతున్న జగన్ చెబుతున్నాడు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందివ్వడమే జగన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు చేసిన నేరమ టా! ఇసుకబొక్కుతూ.. ఇసుకద్వారానే రూ.40వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి.. చంద్ర బాబుపై తప్పుడు కేసు పెట్టించాడు. ఇలా రోజుకో కేసుని తెరపైకి తెస్తున్నాడు.. ఈ సైకో ముఖ్యమంత్రి.

టీడీపీ-జనసేన కూటమితో వైసీపీ డిపాజిట్లు గల్లంతు అవుతాయి. దళితులంతా ప్రతి పల్లె..ప్రతి వాడకు వెళ్లి ఈ సైకో ముఖ్యమంత్రి తమకు చేసిన అన్యాయంతోపాటు.. రాష్ట్రాన్ని దోచేస్తున్నవైనంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి దెబ్బకు వైసీపీ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యం. పులివెందులలో కూడా టీడీపీనే గెలుస్తుంది. ఎందుకు ఇంత నమ్మకంగా చెబుతున్నామంటే జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయం అలాంటిది. ముఖ్యమంత్రిగా తాను ఏమీచేయకుండా ఉన్నా కూడా రాష్ట్రం..ప్రజలు ఇంతగా నష్టపో యేవారు కాదు. కానీ తన సైకోయిజంతో అన్నివర్గాలు.. అన్ని ప్రాంతాలను కోలుకోలే ని విధంగా దెబ్బతీశాడు.

ఎస్సీలంతా జగన్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలో ఆలోచించు కోవాలి. ఎస్సీలు అంతా ఒకేతాటిపై నిలిచి కాలికి గజ్జె కట్టుకొని మరీ ప్రతి పల్లె..ప్రతి దళిత వాడకు వెళ్లి…జగన్ రెడ్డి తమకు..తమజాతికి చేసిన మోసాన్ని అందరికీ అర్థ మయ్యేలా చెప్పాలి. జగన్ అవినీతి..అరాచకాలు.. దళితులపై జరుగుతున్న దాడులు.. అన్నీ ప్రజలకు చెప్పాలి. జగన్ రెడ్డిని..అతని పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

వారిలో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని దళితులు చేపట్టాలి. ఎం.ఎస్.రాజు దళితులకోసం పోరాడే క్రమంలో అందరినీ ఏకం చేశాడనే చెప్పాలి. టీడీపీలోని సీనియర్ దళితనేతలతో సమన్వయం చేసుకుంటూ రాజు ముందుకెళ్తున్నాడు. దళితులకు ఏ అన్యాయం జరిగినా..వారికి ఏ కష్టమొచ్చినా తెలుగుదేశంపార్టీ కార్యాలయం.. టీడీపీనేతల ఇళ్ల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటా యని గుర్తుంచుకోండి. టీడీపీనేతలమైన మేము గతంలో చంద్రబాబునాయుడు తీసు కున్న నిర్ణయాల్లోని లోటుపాట్లను నిరభ్యంతరంగా ఆయనతో చర్చించేవాళ్లం. ఆ నిర్ణయాల వల్ల కలిగే లాభనష్టాలు.. ఎదురయ్యే సమస్యలను ఆయనకు వివరించే వాళ్లం. కానీ వైసీపీలోని దళిత…బీసీ…మైనారిటీ నేతలు, మంత్రులు ఎవరికీ ఆ ధైర్యంలేదు. జగన్ రెడ్డి తానా అంటే తందానా అనడం తప్ప.. వారికి వాస్తవాలు చెప్పే ధైర్యంలేదు. చంద్రబాబునాయుడు ఎప్పుడైతే జైలునుంచి బయటకు వచ్చారో అప్పటినుంచే జగన్ రెడ్డి.. అతని పార్టీ పతనం మొదలైంది.

ఇక మనముందున్న లక్ష్యం ఏమిటంటే.. జగన్ రెడ్డి, అతని పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడమే. జగన్ నిర్ణయాలపై అతని పార్టీవారే ఆగ్రహంతో ఉన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవారికి పదవులు ఇస్తూ.. నిజమైన నేతలకు అన్యాయం చేస్తున్నాడని వైసీపీ వాళ్లే వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 29 రిజర్వుడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ పరం చేయడానికి దళితులంతా ఒకేతాటిపై నిలవాలి. మనకు ఇంకా కేవలం 3నెలల సమయమే ఉంది. ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని టీడీపీ గెలుపుకోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేద్దాం.” అని అచ్చెన్నాయు డు కార్యక్రమానికి విచ్చేసిన దళితసోదరుల్లో ఉత్సాహం నింపారు.

జగన్ రెడ్డి పాలనలో దళితుల గతి ఇంతేనా? వారికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యం లేవా? వారిపై దాడులు..హత్యలు..అత్యాచారాలు ఆగవా? వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ దళితవిభాగం తలపెట్టిన సమ్మేళనానికి విచ్చేసిన దళిత సోదరులం దరికీ స్వాగతం.. సుస్వాగతం. రాష్ట్రంలోని దళితులంతా తెలుగుదేశం పక్షానే ఉన్నారని చెప్పడానికి నేడు ఇక్కడకు విచ్చేసిన దళితులే నిదర్శనం. జగన్ రెడ్డి.. ఆయన అంతేవాసులు రాజకీయ కుట్రలో భాగంగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు 52రోజులు జైల్లో ఉన్నారు. టీడీపీ యువనాయకుడు.. దళిత బిడ్డ.. మనం దరి వాడు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు.. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టి నేడు మంగళగిరి పార్టీ కార్యాలయాని కి విచ్చేశారు. అనంతపురంలో మొదలైన ఎం.ఎస్.రాజు సైకిల్ యాత్ర అప్రతిహతంగా అనేక అవాంత రాలు అధిగమించి, ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలు దాటుకొని నేడు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది.

రాజు సైకిల్ యాత్రకు స్వాగతం పలకడానికి టీడీపీలోని దళితనేతలందరూ ఇక్కడికి విచ్చేయడం సంతోషకరం. రాజు బ్రహ్మండమై న కార్యక్రమం చేపట్టి అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. రాష్ట్రంలోని దళితు లంతా ఒక్కటేఅని.. వారంతా చంద్రబాబునాయుడి పక్షానే ఉన్నారని రాజు సైకిల్ యాత్ర చాటిచెప్పింది. రాష్ట్రంలోని దళితులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి.. అతని ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని కొద్దినెలలక్రితమే టీడీపీ దళితవిభాగాలు నిర్వహించి న సభలతో తేలిపోయింది. ఆనాడు మనం నిర్వహించిన సభలతో అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టాయనే చెప్పాలి. నేడు రాజు సైకిల్ యాత్రతో వైసీపీప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆఖరి దశలో ఉన్నారు.

డాక్టర్ సుధాకర్ నుంచి శ్యామ్ కుమార్ వరకు దళితజాతిపై జరిగిన ప్రతి దాడి..ప్రతి ఘటన జగన్ దళితవ్యతిరేక పాలనకు నిదర్శనం జగన్ రెడ్డి పాలనలో దళితుల జీవితాలు ఇంతేనా..వారికి స్వాతంత్ర్యం లేవా?
డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగాడని అతన్ని వేధించి.. వెంటాడి..చివరకు పిచ్చివాడిని చేసి ఈ ప్రభుత్వం చంపేసింది. సుధాకర్ తానే చనిపోయాడా.. లేక ఎవరైనా చంపారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇసుక అక్రమరవాణాపై ప్రశ్నించి న దళిత యువకుడు వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేస్తారా? దళిత యువతిపై అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదుటే పడేశారు. దళిత బిడ్డ ఓంప్రతాప్ కల్తీ మద్యంపై ప్రశ్నించాడని తెల్లారేసరికి శవమై పోయాడు. అతను ఎందుకు చనిపోయా డో .. ఎలా చనిపోయాడో ఇప్పటికీ ఈ ప్రభుత్వం తేల్చలేదు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. వెటర్నరీ వైద్యుడు అచ్చెన్నను కిడ్నాప్ చేసి..హింసించి.. దారుణంగా చంపి అతని శవాన్ని పంట కాల్వలో పడేశారు. మొన్నటికి మొన్న కంచికచర్లలో దళిత యువకు డు కాండ్రు శ్యామ్ కుమార్ని నలుగురు వెధవలు కిడ్నాప్ చేసి, కార్లో తిప్పుతూ కొట్టి..చివరికి అతనిపై మూత్రం పోశారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల గతి ఇంతేనా? మాకు స్వాతంత్ర్యం లేదా?

తెలుగుదేశమే దళితులకు అండగా ఉంటుంది.. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సహా నాయకులందరూ దళితులకు అండగా ఉంటారు
ప్రభుత్వంలోని దళిత మంత్రులు.. వైసీపీనేతలకు సిగ్గులేదా? ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక స్టుపిడ్..ఇడియట్. అసలు అతను నిజంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రేనా? దళిత యువకుడిపై మూత్రంపోస్తే .. అతను స్పందించడా? వైసీపీ దళితనేతలు ముఖ్యమంత్రిని ప్రశ్నించరా? జగన్ రెడ్డి ఏలుబడిలో దళితులు హలో లక్ష్మణా అని అల్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి. జరిగిన ప్రతి ఘటనపై ఆలోచించండి. తెలుగుదేశం పార్టీయే మనకు అండగా ఉంటుందని గ్రహించండి. చంద్రబాబునాయుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు టీడీపీ మన దళితజాతికి కొండంత అండగా ఉంటుంది. రాష్ట్రంలోని దళితబిడ్డలు..నా సోదరులు అందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పక్షానే నిలవాలని, జగన్ రెడ్డిని తరిమి కొట్టాలి” అని రామయ్య పిలుపునిచ్చారు.

దళితులే లక్ష్యంగా జగన్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గాలు.. దురాగతాలపై దళితజాతి తిరగబడాల్సిన సమయం వచ్చింది : నక్కా ఆనంద్ బాబు
” దళిత సమ్మేళనం మహాసభకు విచ్చేసిన దళితసమాజానికి అభినందనలు. ఎం.ఎస్ రాజు దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా నేడు మనం ఇక్కడ సమావేశమయ్యాం. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ పై మనరాష్ట్రంతో పాటు దాదాపు 70కు పైగా దేశాల్లో నిరసనలు.. ధర్నాలు.. ఆందోళనలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు అరెస్ట్ తో తీవ్రంగా ఆందోళన చెందారు. మన దళితులు కూడా తమ ఆగ్రహావేశాలను.. ప్రభుత్వంపై, పాలకులపై వెళ్లగక్కారు. రాబోయే రోజుల్లో దళిత వర్గాలు తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలవాలి.

దళితమంత్రులు.. వైసీపీ దళితనేతలు జగన్మోహన్ రెడ్డి కాళ్లదగ్గర దళితుల ఆత్మగౌరవం తాకట్టుపెట్టి.. దళితజాతినే ఛిద్రం చేస్తున్నారు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం దళితులమైన మనమే. మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. మనభుజాలపైకెక్కి మనల్నే పాతాళానికి తొక్కేస్తున్నాడు. ముఖ్యమంత్రికి అంటే బుద్ధి…సిగ్గు..శరం లేవనుకుందాం. కానీ దళిత మంత్రులు, వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు.. ఇతర నేతలు దళితసమాజంపై జరిగే దారుణాలపై ఎందుకు స్పందించడంలేదు? కంచికచర్లలో శ్యామ్ కుమార్ పై దాడిచేసింది నలుగురు రెడ్లు.

ముఖ్యమంత్రి తమవాడే అన్న అహంకారంతోనే వారు దళిత బిడ్డపై అమానుషానికి పాల్పడ్డారు. దళిత బిడ్డకు దారుణమైన అవమానం జరిగితే.. వైసీపీలోని కొందరు దళితనేతలు బాధితుడితో మాట్లాడి.. సమస్యను చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్యామ్ కుమార్ ను ప్రలోభపెట్టి.. తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో సిగ్గులేకుండా మాట్లాడటం తప్ప.. దళిత మంత్రులు దళితజాతికి జరుగుతున్న అవమానాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించరా? దళిత మంత్రులు.. వైసీపీ దళితనేతలు జగన్మోహన్ రెడ్డి కాళ్లదగ్గర దళితుల ఆత్మగౌరవం తాకట్టుపెట్టి.. దళితజాతినే ఛిద్రం చేస్తున్నారు.

చంద్రబాబునాయుడి వద్ద మేం ఏనాడూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోలేదు. టీడీపీ అధినేతగా ఆయన మమ్నల్ని ఎప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. మమ్మల్ని తన సొంతమనుషుల్లా ఆదరిస్తారు. దళితుల గురించి ఆలోచించే చంద్రబాబు లాంటి నాయకుడు అరుదుగా ఉంటారు. చంద్రబాబు దళితులకు కేటాయిం చిన సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ రెడ్డి దారిమళ్లించాడు. భూకొనుగోలు పథకం కింద టీడీపీ ప్రభుత్వం భూములుకొని దళితులకు ఇస్తే.. జగన్ అధికారంలోకి రాగానే వాటిని బలవతంగా లాక్కున్నాడు. చంద్రబాబు దళితులకోసం తీసుకొచ్చిన 27 పథకా ల్ని జగన్ రెడ్డి రద్దుచేశాడు. లక్షలాది దళితయువతకు ఉపాధి కల్పించే అనేక పథకా ల్ని నిర్దాక్షణ్యంగా తొలగించాడు.

జగన్ రెడ్డి దుర్మార్గాలు..దురాగతాలపై దళితజాతి తిరగబడాల్సిన సమయం వచ్చింది
జగన్ రెడ్డికి ఓట్లేసిన మనమే..అతని దుర్మార్గాపు పాలనపై.. అతని దురాగతాలపై తిరగబడాల్సిన సయమం వచ్చింది. దళితజాతి తిరగబడకపోతే.. మన జాతే వెనక్కు వెళ్తుంది. మన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని సోదరులందరూ తెలుసుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని దుర్భరపరిస్థితుల్ని నేడు ఏపీలోని దళితులు అనుభ విస్తున్నారు. అందుకు కారణం ఈ జగన్ రెడ్డి. రాష్ట్రంలోని యువత భవితకోసం.. వారికి అండగా నిలిచేందుకు నారాలోకేశ్ ప్రజల్లోకి వస్తే, ఆయన్ని అడ్డుకోవడానికి ఈ ముఖ్యమంత్రి అనేక కుట్రలకు పాల్పడ్డాడు. యువగళం పాదయాత్రను నిలువరించడా నికే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడు. ప్రజలకు… ముఖ్యంగా మనభవిష్యత్ కు గ్యారంటీ ఇస్తున్న చంద్రబాబునాయు డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనపైనే ప్రత్యేకంగా ఉంది.

రాష్ట్రంలో 20 శాతం పైన ఉన్న దళితులు ఏకతాటిపై నిలిచి జగన్ రెడ్డిని గద్దెదింపి.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిస్తున్నా. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం లో దళితులంతా నిత్యం ఏదో ఒక టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి..చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తేనే దళితజాతికి భవిష్యత్ ఉంటుంది.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.

చంద్రబాబు దళితులకు చేసిన మంచి..మేలు ఏమిటో టీడీపీ దళితనేతలు నిరూపిస్తారు.. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో దళితులకు ఏం చేశాడో బహిరంగ వేదికపై దళితమంత్రులు చెప్పగలరా? : బీదా రవిచంద్ర యాదవ్
“ చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ.. అనంతపురం నుంచి మంగళగిరికి సోదరుడు ఎం.ఎస్.రాజు చేపట్టిన సైకిల్ యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ నేటివరకు దళితులకు ఆ పార్టీ ఏంచేసింది..వారి విషయంలో ఎలా వ్యవహరించిందో ఒక్కసారి సోదరులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్వర్గీయ ఎన్టీఆర్.. చంద్రబాబునాయుడు ఇద్దరూ దళితులు.. బీసీలు.. మైనారిటీలను రాజకీ యంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు ఎన్నోరకాలుగా చేయూత అందించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి దళితులకు ఎన్నోమాటలు చెప్పి.. చివరకు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి దళితులకు ఎన్ని మాయమాటలు చెప్పాడో చూశాం. దళితుల్ని చంద్రబాబునాయు డు ఎంతగానో అభిమానించి.. ఆదరించారు. లోక్ సభ స్పీకర్ గా.. అసెంబ్లీ స్పీకర్ గా దళితుల్ని నియమించడంతో పాటు ఆఖరికి కే.ఆర్.నారాయణన్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు నాయుడి కీలక నిర్ణయాలున్నాయి. దళితుల కోసం చంద్రబాబు నాయుడు అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు.. విదేశీవిద్య.. భూమి కొనుగోలు పథకం లాంటి పథకాలు నేడు ఏమయ్యాయి?

చంద్రబాబు..లోకేశ్..టీడీపీనేతల్ని తిట్టడం తప్ప, రాష్ట్రంలోని దళితులకు ఎందుకు న్యాయంచేయరని ప్రశ్నిస్తూ దళితమంత్రులు..వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి ఇంటి గడప తొక్కే ధైర్యం లేదు.

దళితమంత్రులు.. వైసీపీదళితనేతలు చంద్రబాబుని, లోకేశ్ ను.. ఇతర టీడీపీనేతల్ని తిట్టడం తప్ప కనీసం దళితులకు న్యాయం చేయమంటూ ముఖ్యమంత్రి ఇంటి గడప తొక్కే ధైర్యం కూడా వాళ్లకులేదు. 2014-19 మధ్యలో దళితులకోసం చంద్రబాబు నాయుడు..టీడీపీప్రభుత్వం అమలుచేసిన సంక్షేమపథకాలు.. అభివృద్ధిపై, వైసీపీ ప్రభుత్వంలోని దళిత మంత్రులు..ఎమ్మెల్యేలు.. నేతలు ఎవరైనా బహిరంగ చర్చకు వస్తే.. వారికి సమాధానం చెప్పడానికి టీడీపీ నుంచి ఒక్క దళితనేత సరిపోతాడు.

చంద్రబాబు దళితులకు చేసిన మేలు ఏమిటో ఆధారాలతో సహా నిరూపించడానికి మా పార్టీ దళితనేతలు సిద్ధం.. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి దళితులకు ఏంచేశారో చెప్పే ధైర్యం వైసీపీ దళిత నేతలకు ఉందా? సామాజిక సాధికార బస్సుయాత్రలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న మంత్రులు…వైసీపీనేతలకు ఇదే మా ఛాలెంజ్. దళిత జాతి మొత్తం వచ్చేఎన్నికల్లో దళితద్రోహి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలి.” అని రవిచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.

 టీడీపీప్రభుత్వంలో దళితవాడల్లో చేసిన అభివృద్ధి తప్ప..జగన్ నాలుగున్నరేళ్లలో చేసింది శూన్యం : డోలా బాల వీరాంజనేయస్వామి
“ చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా సాహసోపేతంగా సైకిల్ యాత్ర చేపట్టిన సోదరుడు ఎం.ఎస్.రాజుకి అభినందనలు. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. సాంఘిక సంక్షేమ వసతిగృహాలను బలోపేతం చేయడం నుంచి ఎస్సీఎస్టీ యువతకు గ్రూప్స్ శిక్షణ అందించడంకోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశంపార్టీనే. దళితయువతకు నాణ్యమైన విద్యతో పాటు.. ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడంకోసం చంద్రబాబునాయుడు ఎన్నో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల్ని అక్షరం మార్చకుండా అమలుచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు ఒక్కడే. సదరు కమిషన్ సిఫార్సులతో జిల్లాలవారీగా టీడీపీప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ మానిటరింగ్ కమిటీలు నామమాత్రంగా తయారయ్యాయి. దళితులు సమ స్యలు…వారి ఇబ్బందుల పరిష్కారం దిశగా వైసీపీప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్ట కుండా కేవలం మొక్కుబడి కార్యక్రమాలతో సరిపెడుతోంది. ఏ తప్పూ చేయని చంద్ర బాబునాయుడిపై ఈ ముఖ్యమంత్రి తప్పుడు కేసులుపెట్టించి అన్యాయంగా జైలుకు పంపాడు. జగన్ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనలో దళితులకోసం ప్రత్యేకంగా ఒక రూపాయి కేటాయించడం గానీ.. ఒక పథకం అమలుచేయడం గానీ చేశాడా? టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వేసిన రోడ్లు.. నిర్మించిన డ్రైనేజ్ లు… ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యాలు తప్ప జగన్ రెడ్డి కొత్తగా ఎక్కడా ఆవగింజంత అభివృద్ధి దళితుల కోసం చేయ లేదు.

సామాజిక సాధికార బస్సుయాత్రలో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయన్న అక్కసుతోనే ప్రభుత్వం దళితులపై దాడులకు తెగబడుతోంది
జగన్ మెప్పుకోసం దళితమంత్రి సిగ్గులేకుండా చొక్కాలు విప్పుకు తిరిగితే.. అతనికి మరో మంత్రి వత్తాసు పలకడం. టీడీపీప్రభుత్వం రాజధానిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుచేస్తే.. దాన్ని జగన్ ప్రభుత్వం నిర్విర్యీం చేసింది. అంబేద్కర్ విదేశీవిద్య పథకా నికి ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నాడు. దళితుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకో వడానికి జగన్ రెడ్డి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సామాజిక సాధికార బస్సుయాత్రలో వైసీపీ మంత్రులు.. నేతలకు ఖాళీకుర్చీలు కనిపిస్తున్నాయి. దాంతో ఏంచేయాలో పాలుపోకనే మరలా వరుసగా రాష్ట్రంలో దళితులపై దాడులు చేయిస్తు న్నారు. అసెంబ్లీలో వైసీపీ దళిత ఎమ్మెల్యేలు టీడీపీ శాసనసభ్యుడినైన నాపై దాడి చేస్తే ముఖ్యమంత్రి స్పందించలేదు. దళితులు తనకు..తనప్రభుత్వానికి సలహాదారులుగా పనికిరారని..దళితుల్లో మేథావులు లేరని జగన్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా దళితుల్ని అవమానించాడు.

చంద్రబాబునాయుడు దళితుల అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ ను జగన్ రెడ్డి మూడుముక్కలు చేసి, చివరకు దానివల్ల దళితులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేశాడు. దళితబిడ్డలకు తాను మేనమామనంటూ జగన్ రెడ్డి సీఎఫ్ఎంఎస్ పేరుతో నాలుగేళ్లలో 4వేల మంది దళితబిడ్డలకు నాణ్యమైన విద్యను దూరం చేసి పెద్ద కంసమామగా నిలిచాడు. దళితుల పథకాలు అనేకం రద్దు చేశాడు. దళితులకు జగన్ రెడ్డి చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది.” అని వీరాంజ నేయస్వామి స్పష్టంచేశారు.

జగన్ నిజమైన క్రైస్తవుడు కాడు.. కేవలం క్రైస్తువులైన దళితుల ఓట్లకోసమే తల్లి విజయమ్మ చేతిలో బైబిల్ పెట్టాడు : కే.ఎస్.జవహర్ 
“ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర దిగ్విజయవంతమైంది. రాష్ట్రంలో నూటికి 90శాతం పైగా దళితులు క్రైస్తవులుగా ఉన్నారని గ్రహించి.. గతంలో జగన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు బైబిల్ ఇచ్చి దళితులుముందుకు పంపి, వారిఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాడు అనే నిజం అందరూ తెలుసుకోవాలి. ఏ విగ్రహానికి..ఏ రూపానికి సాగిలపడకూడదని బైబిల్ చెబుతుంటే, జగన్ రెడ్డి అనేకసార్లు స్వామీజీలు.. మఠాధిపతుల కాళ్లపై పడటం..స్వామి స్వరూప నంద కాళ్లు పట్టుకోవడం చూశాం. బైబిల్ అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దంటుంటే… జగన్ పదేపదే అబద్ధపు సాక్ష్యాలే చెబుతాడు. చంద్రబాబు అరెస్ట్ పై దళితజాతి కన్నీరు పెట్టింది…ఇప్పటికీ పెడుతోంది.

ఎందుకు కర్ర జగన్ రెడ్డికి ఇచ్చామా..ఎందుకు మన చేతులు అతని దెబ్బలకు అడ్డుపెడుతున్నామా అని ఇప్పటికీ దళితజాతి బాధప డుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి మనం ఎం త ఉత్సాహంతో పనిచేశామో.. రేపు అతన్ని ముఖ్యమంత్రి పీఠంనుంచి దించడానికి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.. బాబూ జగజ్జీవన్ రామ్ లు మనకు అందించిన స్ఫూర్తితో జగన్ రెడ్డిని గద్దెదింపే మహా యజ్ఞంలోకూడా దళితులంతా భాగస్వాములు కావాలి. బీసీల మాదిరే దళితులంతా ఐక్యతతో నిలిచి పోటీలు పడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి” అని జవహర్ పిలుపునిచ్చారు.

చంద్రబాబు పథకాలు.. లోకేశ్ యువగళం తుఫాన్ ధాటికి.. సైకిల్ దెబ్బకు సైకో జగన్ కొట్టుకు పోవడం ఖాయం : ఉండవల్లి శ్రీదేవి (శాసనసభ్యురాలు)
“ దళిత సమ్మేళన సభ నిర్వహణకు కారకులైన ఎం.ఎస్.రాజు నిజంగా హీరోనే. జగన్ రెడ్డి..అతని ప్రభుత్వాన్ని డోంట్ కేర్ అంటూ సైకిల్ యాత్ర చేపట్టాడు. ఆ యాత్ర వైసీపీ ప్రభుత్వంపై, జగన్ రెడ్డిపై దళితుల దండయాత్రగా మారాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ కాదనే వాస్తవం ఈ ముఖ్యమంత్రికి తెలిసొచ్చేలా చేయాలి. ప్రభుత్వాలను శాసించేది దళితుల ఓట్లే అనే వాస్తవాన్ని మరువకండి. దళితులకు దక్కాల్సిన రూ.1,14,000 కోట్లు నొక్కేసిన జగన్ రెడ్డి..తన దోపిడీ మనకు తెలియకూడదనే నా ఎస్సీలు…నా ఎస్టీలు అంటున్నాడు. జగన్ రెడ్డి మాయమాటలు .. నమ్మి మరలా మోసపోవద్దని దళితుల్ని కోరుతున్నాను.

దళిత ఎమ్మెల్యేనైన నన్నే జగన్ రెడ్డి అమానించాడు..మోసగించాడు. దళిత భూములు లాక్కొని…దళితుల నోట్లో మట్టికొట్టాడు. దళితులకు జగన్ రెడ్డి.. అతని దయ్యాల పార్టీ వైసీపీ చేస్తున్న అన్యాయం చూడలేకే వైసీపీ నుంచి బయటకు వచ్చాను. చంద్రబాబు.. లోకేశ్ లు నాకు అండగా ఉండి.. నన్ను వారి కుటుంబంలో మనిషిగా ఆదరించారు. చంద్రబాబు నాయుడు ప్రజలకోసం రాష్ట్రం కోసం రోజుకో కొత్తపథకంతో జగన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాడనే.. ఆయనపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. చంద్రబాబు ప్రజాకర్షక పథకాలు, లోకేశ్ యువగళం తుఫాన్ ధాటికి సైకిల్ దెబ్బకు సైకో జగన్ కొట్టుకుపోవడం ఖాయం.” అని శ్రీదేవి హెచ్చరించారు.

ఎవరైనాసరే జైలుకు వెళ్తే వారి తప్పులు… అవినీతి బయటపడతాయి…కానీ చంద్రబాబునాయుడు జైలుకు వెళ్తే ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసి వచ్చింది :  తంగిరాల సౌమ్య 
“నిప్పుకు చెదలు పట్టడం అన్నది ఎంత నిజమో..చంద్రబాబునాయుడు తప్పుచేశాడు అనడం కూడా అంతే నిజం. ప్రజల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధి తప్ప మచ్చలేని నాయకుడు చంద్రబాబుకి మరోటి తెలియదు. వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న ఒక సైకో కేవలం కక్షతోనే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడు. ఇప్పటికీ మన నాయ కుడిపై అభాండాలు వేస్తూనే ఉన్నారు. ఎవరైనా సరే జైలుకు వెళ్తే వారి తప్పు బయట పడుతుంది…కానీ చంద్రబాబునాయుడు జైలుకు వెళ్తే ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసి వచ్చింది.

అటువంటి మహానాయకుడి కింద పనిచేస్తున్నందుకు మనం నిజంగా గర్వపడాలి. దళితులకు ఎక్కువ సమయం లేదు. మనజీవితాలు బుగ్గిపాలు చేసిన సైకోని అంతమొందించే లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. వర్గ బేధాలు పక్కనపెట్టి.. జగన్ మోసపు మాటలు నమ్మకుండా చంద్రబాబుని ముఖ్య మంత్రిని చేయాలనే లక్ష్యంతోనే అందరూ పనిచేయాలి.” అని సౌమ్య సూచించారు.

చంద్రబాబుని తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు దళితులు విశ్రమించకూడదు : పాశం సునీల్ కుమార్
“దళితుల ప్రతినిధిగా ఎం.ఎస్.రాజు చేసిన సైకిల్ యాత్రను దళిత సమాజం స్వాగతిం చాలి. మనం దళితులం కాదు.. దళిత పులులం. మనమంతా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి..చంద్రబాబునాయుడిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు విశ్రమించకుం డా పనిచేయాలి.” అని సునీల్ కుమార్ సూచించారు.

రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులు…అవకాశాలు.. ప్రయోజనాల్ని హరించే అధికారం జగన్ కు ఎవరిచ్చారు : వర్ల కుమార్ రాజా
“ డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్… బాబూ జగజ్జీవన్ రామ్…జ్యోతిరావు పూలేల స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కొనసాగుతోంది . రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులు..ప్రయోజనాలు.. అవకాశాలు లేకుండా చేయడానికి జగన్ రెడ్డి ఎవరు? వాటిని హరించే అధికారం అతనికి ఎవరిచ్చారు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే దళితుల జీవితాలు మారతాయి.” అని కుమార్ రాజా స్పష్టం చేశారు.

దళితుల్ని చంద్రబాబు భూ యజమానుల్ని చేస్తే.. జగన్ వారిని కూలీలుగా మార్చాడు : బీ.రామాంజనేయులు
“ దళిత సమ్మేళన సభలో నేడు మ్యాన్ ఆఫ్ ది డే గా ఎం.ఎస్.రాజు నిలిచాడు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ సైకిల్ యాత్ర చేపట్టి.. అనంతపురం జిల్లా నుంచి మంగళగిరివరక వచ్చి.. నేడు ఈ సభ పెట్టిన మనసోదరుడికి.. ఇక్కడకు విచ్చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. దళితుల గౌరవం కాపాడటానికి చంద్రబాబునాయుడు రైతుకూలీలుగా ఉన్న దళితుల్ని కౌలు రైతులుగా గుర్తించారు. తరువాత భూమి కొనుగోలు పథకం ద్వారా దళితులకు భూములిచ్చి వారిని భూ యజమానుల్ని చేసిన మహానుభావుడు చంద్రబాబునాయు డు అయితే.. ఆ భూములు లాక్కొని వారిని మరలా కూలీలుగా మార్చిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. దళితుల విద్య..ఉపాధికోసం పాటుపడిన దళిత బాంధవుడు చంద్రబాబు. దళితుల్ని తన బానిసలుగా ఉంచడానికి వారి పథకాలు.. ప్రయోజనాలు కాలరాసిన జగన్ రెడ్డిని గద్దెదించాల్సిన సమయం వచ్చింది. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వి నియోగం చేస్తూ ఎస్సీలపైనే జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు.

దళితులకు దేనికి సంబంధించి ఎక్కువ ఖర్చుచేశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి అండ చూసుకునే కండకావరంతో దళితులపై మూత్రం పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దళితుల బలం ఏంటో జగన్ రెడ్డి చవిచూస్తాడు. ఎవరైతే మన అభివృద్దికి బాటలువేసి.. మన సంక్షేమానికి పాటుపడ్డారో ఆ మహానాయకుడు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేవరకు దళితులు అలుపులేకుండా పనిచేయాలి. ఒక్క దళిత ఓటు కూడా వైసీపీకి పడకుండా చూడాలి.” అని రామాంజనేయులు పిలుపునిచ్చారు.

అన్నివర్గాల నాయకులకు సమ ప్రాధాన్యత ఇవ్వబట్టే టీడీపీ మహాకుటుంబమైంది : నజీర్
“ దళితులు..బీసీలు..మైనారిటీలపై చంద్రబాబుకి..లోకేశ్ కు..టీడీపీకి ఎంతో ప్రేమ ఉంది. పార్టీ బాధ్యతల్లో అయినా.. వర్గపరమైన కార్యక్రమాలలో అయినా అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. అందువల్లే టీడీపీ మహా కుటుంబంగా నిలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే.. అన్నివర్గాల వారు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలోని 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలవాలి. అందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి.” అని నజీర్ సూచించారు.

జగన్ రెడ్డి దుర్మార్గాలు..దురాగతాలకు బలైపోయిన దళితులకు న్యాయం చేయడమంటే.. అతన్ని రాష్ట్రం నుంచి శాశ్వతంగా తరిమికొట్టడమే : పిల్లి మాణిక్యరావు
“ దళితులమైన మనం నిజమైన టీడీపీ కార్యకర్తలమే అయితే.. వైసీపీప్రభుత్వంలో జగన్ రెడ్డి దుర్మార్గాలు, దురాగతాలకు బలైన వారి కుటుంబాలకు నిజమైన సాయం చేయడం అంటే .. మనం చేయాల్సిన ఒకేఒక్క పని, జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడం. ప్రతి దళితుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. దళితుల కు రాజ్యాంగం ఎంతపెద్ద అండో..తెలుగుదేశం పార్టీ కూడా అంతే అండ. వచ్చే ఎన్నికల్లో మనం ప్రాణాలకు తెగించి పోరాడితే తప్ప..నిలవలేం. ఇప్పటికే రాష్ట్రంలో దళితులు ఉన్నారా..లేరా అనే పరిస్థితి వచ్చింది. దళితులపై మూత్రం పోయడమంటే సామాన్య మైన విషయమా? రాజ్యాంగంపై ఏమాత్రం భయం గౌరవం లేనివాళ్లే ఆ పని చేస్తారు.” అని మాణిక్యరావు స్పష్టంచేశారు.

దళిత ఉద్యోగులు జగన్ రెడ్డిని గద్దె దింపడంలో ముందుండాలి : దేవతోటి నాగరాజు 
“వైసీపీప్రభుత్వాన్ని సమాధి చేయాలంటే మూడు వర్గాలు ప్రధాన భూమిక పోషించాలి. వారు దళిత ఉద్యోగులు… విద్యార్థులు..దళిత మేథావులు. వారిలో దళిత ఉద్యోగులు జగన్ ను గద్దె దింపడంలో ముందుండాలి. ఇప్పటికే రాష్ట్రంలోని దళితులు వందేళ్లు వెనక్కి వెళ్లిపోయారనే వాస్తవాన్ని గ్రహించండి.” అని నాగరాజు సూచించారు.

ఎం.ఎస్ రాజు పనితీరులో వేగం పెరిగింది : దాసరి ఆంజనేయులు 
“ గతంలో ఎస్సీ సెల్ నామమాత్రంగానే పనిచేసేది. ఎం.ఎస్.రాజు ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయ్యాకే ఎస్సీ సెల్ పనితీరులో వేగం పెరిగింది. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టాడు. కొడాలినానీ వంటి నోటిదురుసు నాయకు ల్ని సవాల్ చేశాడు. దళిత మహిళ పీతల సుజాతపై తప్పుడు కేసు పెట్టాడంటే జగన్ ఎలాంటి వాడో అర్థం చేసుకోండి. దళిత జాతి మొత్తం తెలుగుదేశంపార్టీతో నడవాలి. దళిత తేజం – తెలుగుదేశం కార్యక్రమంతో తెలుగుదేశం దళితుల పక్షాన నిలిచింది. దళిత నేతలమని కట్టుకథలు చెప్పే కొందరిని తెలుగుదేశం పార్టీ దూరంపెట్టి..నిజంగా కష్టపడిన వారిని గుర్తించాలి.” అని ఆంజనేయులు కోరారు.

దళితులు తమకు జరిగిన అన్యాయాన్ని మనస్సుల్లో ఉంచుకొని ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాలి : జన్ని రమణయ్య
“ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎం.ఎస్.రాజు సైకిల్ యాత్ర చేపట్టాడు. 18 నియోజకవర్గాల మీదుగా 690 కిలోమీటర్లకు పైగా ఆయన సైకిల్ యాత్ర నిర్వహిం చాడు. ఈ ప్రభుత్వంలో దళితులకుజరిగిన ఏ ఒక్క అన్యాయాన్ని వదిలిపెట్టకుండా మన మనస్సుల్లో ఉంచుకొని జగన్ రెడ్డిపై పోరాడాలి. దళిత గ్రామాల పరిరక్షణకోసం అందరం ఏకమై వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి.” అ ని రమణయ్య పిలుపునిచ్చారు

జగన్ మరలా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని దళితులంతా ఇతర రాష్ట్రాలకు పారిపోవాల్సి వస్తుంది : వెంకటేశ్వరరావు 
“ తెలుగుదేశం పార్టీ వచ్చాకే దళితులకు సంక్షేమం.. అభివృద్ది అందాయనే వాస్తవా న్ని దళితులు గ్రహించాలి. దళిత ద్రోహి జగన్ రెడ్డి అనే నిజాన్ని ప్రతిగ్రామానికి వెళ్లి తెలియచేయాలి. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల పదవులు పొందిన దళిత మంత్రులు.. .వైసీపీలోని దళితనేతలు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలపై స్పందించ కుండా గాడిదలు కాస్తున్నారా? జగన్ రెడ్డి మాదిరే వైసీపీ దళితనేతలు కూడా పెద్ద దళితద్రోహులుగా మిగులుతారు. జగన్ మరలా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని దళితులుంతా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ఖాయం.” అని వెంకటేశ్వరరావు హెచ్చ రించారు.

జగన్మోహన్ రెడ్డి అంతం.. మాలమాదిగల పంతం. ఇదేనినాదంతో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేద్దాం : ఎం.ఎస్.రాజు
“ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చిన్న మచ్చూకూడా లేకుండా చంద్రబాబు నాయుడు మెలిగారు. అలాంటి నాయకుడినే అక్రమంగా నిర్బంధిస్తే.. ఇక సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంది అని చెప్పడానికే సైకిల్ యాత్ర చేపట్టాను. ముఖ్యమంత్రిగా కొన్ని లక్షలకోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన నాయకుడు చంద్రబాబు. పేదల కోసం .. రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి. అలాంట వ్యక్తిని జైలుకు పంపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. జగన్ రెడ్డికి నాఎస్సీలు అనడం.. వారిపై దాడులు చేయించడం అలవాటైంది. నా ఎస్సీలు అంటూనే డాక్టర్ సుధాకర్ని చంపించాడు. నాఎస్సీలు అంటూనే దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపిన తనపార్టీ ఎమ్మెల్సీ అనంతబా బు భుజాలపై చేతులేసి తిరుగుతున్నాడు. నా ఎస్సీలు అంటూనే దళితులపై మూత్రం పోయిస్తున్నాడు. నా ఎస్సీలు అంటూనే దళితమహిళలపై అత్యాచారాలు చేయిస్తు న్నాడు. అందుకే మనమంతా ఒకే నినాదానికి కట్టుబడాల్సిన సమయం వచ్చింది.

జగన్మోహన్ రెడ్డి అంతం.. మాల, మాదిగల పంతం. ఇదే నినాదంతో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేద్దాం. ఓటు అనే ఆయుధంతో వైసీపీని కాలగర్భంలో కలపడమే మనందరి ధ్యేయం. జగన్ రెడ్డి ప్రభుత్వ దురహంకారానికి బలైన మొట్ట మొదటి బిడ్డ మనదళిత బిడ్డ అనే విషయం మర్చిపోకండి.

దళిత…బీసీ…మైనారిటీ మంత్రులు.. ఆయావర్గాల వైసీపీ నేతలు తమవర్గాల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టి సిగ్గులేకుండా సామాజిక సాధికార బస్సుయాత్ర చేస్తున్నారు. రెడ్డినేతలంతా ప్రజలముందు ముందువరసలో కూర్చుంటే సిగ్గులేకుండా వెనకనిలబడి న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు. దళితుడిని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుని తన ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానిం చిన పినిపె విశ్వరూప్ దళితులకు జగన్ మేలు చేశానంటున్నాడు. జగన్ రెడ్డి చెప్పాడని చొక్కాలు విప్పుకు తిరిగే మంత్రి ఒకరు. చంద్రబాబుపై పడి మొరగడం తప్ప మేరుగనాగార్జునకు దళిత సంక్షేమం పట్టదు. ఇక హోంమంత్రి.. శాశ్వతంగా ఆమె హోం కే పరిమితమైంది. ఇలాంటి మంత్రులు దళితుల ప్రతినిధులా?

జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ.. అంబేద్కర్, పూలే ల పేరు ఉచ్ఛరించడానికి వైసీపీ దళిత నేతలు.. దళిత మంత్రులకు సిగ్గుందా?
జగన్ రెడ్డి దళిత వ్యతిరేక మనస్తత్వం.. దళిత వ్యతిరేక పాలనపై అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. దళితజన బాంధవుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలో.. దళిత ద్రోహి జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలో ప్రతి దళితుడు ఆలోచిం చుకోవాలి. తెలుగుదేశం పార్టీలో దళితులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పడానికి నేడు వేదికపై ఉన్న మన నాయకులే నిదర్శనం. వైసీపీ దళితనేతలు.. మంత్రులు ఎంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నారో వారే గ్రహించాలి. సామాజిక సాధికార బస్సుయాత్రతో జనంలోకి వస్తున్న వైసీపీనేతలు..మంత్రులకు అసలు ఆ మాటకు అర్థం తెలుసా? సామాజిక న్యాయమంటే జగన్ రెడ్డి వర్గానికి దోచిపెట్టడమా? జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ అంబేద్కర్.. పూలేల పేర్లు ఉచ్ఛరించడానికి దళిత, బీసీ మంత్రులకు సిగ్గుందా? ” అని ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE