Suryaa.co.in

Andhra Pradesh

ఆ వైసిపి యువనేత ఆడియో నా దగ్గర ఉంది

-ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించా…ఫిర్యాదు చేశా
-జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్

వైసిపి నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు.నా కులంపై విమర్శలు చేశారు..వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారు. మంత్రి రోజా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డిలు నన్ను టార్గెట్ చేశారు. నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయించి ఉంటే నాపై కేసు పెట్టి అరెస్టు చేయండి. నేను ఏ తప్పు చేయలేదు..శ్రీవారి టిక్కెట్లను అక్రమంగా అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు.

నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు.రెండు, మూడురోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమయ్యారు. భర్త లేని మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. ఒక భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు.నా పై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసిపి యువనేత జనసైనికులకు చెబుతున్నాడు.

ఆ వైసిపి యువనేత ఆడియో నా దగ్గర ఉంది.వైసిపి నేత ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించా…ఫిర్యాదు చేశాను.ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతాను. వైసిపి నేతల ఆగడాలను తిరుపతి ప్రజలు గమనిస్తున్నారు.ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా..? నేను భయపడను..నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి..నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు..వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం.

LEAVE A RESPONSE