Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా..అరాచకం అణచివేస్తా

-త్వరలో జయహో బీసీ సభ
-పెద్దిరెడ్డి కంటే ఎక్కవ మైనింగ్ ఎవరన్నా చేశారా.?
-ఒక్క ఛాన్స్ తో జగన్ రాష్ట్రాన్ని ముంచాడు…దోచాడు
-గనులు దోచుకున్న పుంగనూరు పుడింగు బస్సులు కూడా లేకుండా చేశారు
-అధికారంలోకి వచ్చిన యేడాదిలో హంద్రీనీవా పూర్తి
-సూపర్ సిక్స్ హామీ లు అమలు చేస్తాం
-గుడుపల్లి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

గుడుపల్లి/కుప్పం :- ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్నదంతా కక్కించి అరాచకాన్ని అణచివేస్తానని అన్నారు. హంద్రీనీవాను కాల్వను శ్రీశైలం నుండి రామకుప్పం దాకా తెస్తే…ఐదేళ్లుగా దాన్ని జగన్ పూర్తి చేయలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన యేడాదిలోనే పూర్తి చేసి నీళ్లందిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదరిక నిర్మూలనే తన లక్ష్యమన్నారు.

కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో గురువారం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ‘‘నేను ఎప్పుడు వచ్చినా గుడిపల్లి వాసులు అఖండ స్వాగతం పలుకుతారు. ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా చూస్తూ ఆదరిస్తునారు. కుప్పం ప్రజలు నన్ను 35 ఏళ్లుగా దీవిస్తున్నారు..మళ్లీ నీవెంటే ఉంటాం అంటూ ఘనస్వాగతం పలుకుతున్నారు. నేనెప్పుడూ మీ మంచే కోరుకుంటాను.

నాకు కుప్పం..నా సొంతం గ్రామం, కుటుంబం లాంటింది. అందులోనూ గుడుపల్లి గుండెకాయలాంటిది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుడుపల్లి ప్రజలు 95 శాతం ఓట్లు టీడీపీకే వేస్తారు. అందుకే ఏ మాత్రం అనుమానం లేకుండా చెప్తున్నా…వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువబోతున్నాం. గుడుపల్లిలోని ఓట్లన్నీ ఈసారి టీడీపీకే పడాలి. సీఎం అవ్వడానికి ఇక్కడి రాలేదు..ఎమ్మెల్యేగా పిలుపించుకోవాలని రాలేదు..ఈ ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు..నా పాలన చూశారు..పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు.? మీ దయ వల్ల ఎక్కువ సార్లు నేనే సీఎం అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగానూ ఉన్నాను…నాదే రికార్డు. అలాంటి నాకే రక్షణ లేదంటే.? ఏంటీ అరాచకం..ఏంటీ నియంతృత్వం.?

కుప్పంలో రౌడీయిజం పెరిగింది. వైసీపీ సినిమా అయిపోయింది..ఇక వంద రోజులే మిగిలింది. వైసీపీ నేతలు వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు..మిడిసి పడొద్దని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన అవినీతి అంతా కక్కిస్తా..అరాచకాలు అణచివేస్తా. కుప్పంలో మళ్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తా. పోలీసులకు కూడా ఇక్కడ నేనే దిక్కు. ఐదేళ్లలో మీతో తప్పుడు పనులు చేయించాడు తప్ప మీకేమీ చేయలేదు ఈ మహానుభావుడు. మీరు కూడా మనసు చంపుకుని పనిచేశారు..మీ పిల్లలు, రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలి.

కుప్పంకు నేను రాకముందు వెనకబడిన నియోజకవర్గంగా పిలిచేవారు..అందుకే దీన్ని ఎంపిక చేసుకుని మీకు వెలుగు తీసుకొస్తే అదే నాకు తృప్తి అని ఇక్కడికి వచ్చా. మన ప్రభుత్వం ఉన్నప్పు డు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం..ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటైనా చేసిందా.? ప్రతి ఇంటికి రెండు ఆవులుంటే ఆదాయం వస్తుందంటే నన్ను ఎగతాలి చేశారు..అందుకే ఆవులు సబ్సీడీలో అందించి ఆదాయం వచ్చేలా చేసి చూపించా. కుప్పంలో 3 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి..10 లక్షల లీటర్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ సారిచేస్తా. పాడి పరిశ్రమ అభివృద్ధ చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను. సూపర్ 6 హామీలు అమలు చేసే బాధ్యత నాది. నా అభివృద్ధికి ప్రధాన కారకులు ఆడబిడ్డలు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు అందిస్తా.

ధరలు విపరీతంగా పెరిగాయి..దీపం ద్వారా మల్లీ 3 గ్యాస్ సిలీండర్లు అందిస్తాను. నెలకు రూ.15 వందలు అకౌంట్లో వేసే బాద్యత తీసుకుంటా..ఆంక్షలు లేకుండా అందిరికీ ఇస్తాం. గౌరవంగా మీరు తిరగడం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాను. యేటా జాబ్ కేలండర్ అన్నాడు…జాబ్ కేలండర్ వచ్చిందా తమ్ముళ్లూ? ఈ ముఖ్యమంత్రి ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా.? ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా.? మన నియోజకవర్గానికి వవ్చిన పరిశ్రమలు కూడా పారిపోయాయి…బెంగళూరుకు ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నేను ఇక్కడికి తీసుకొచ్చాను.

యువతకు ఉద్యోగాల కోసం ప్రణాళికలు రూపొందిస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్కరికీ రూ.3 వేల అందిస్తాను. 20 లక్షల ఉద్యోగాలు అందించే బాధ్యత టీడీపీది. వంద రోజులు మీరు కష్టపడి రోడ్డుమీదకు వచ్చి పని చేయండి..మళ్లీ మంచి రోజులు వస్తాయి. ప్రజల్లో మార్పు తీసుకురండి..మీ జీవితంలో మార్పు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ – జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.

ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేశాడు..మళ్లీ పొరపాటున వస్తే గంజాయి తినిపిస్తాడు. భూములు, గనులు దోచేశాడు. రైతులకు కూడా వ్యవసాయం లాభసాటి కావాలి. నేనొచ్చాక తొలి యేడాదిలోనే పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా. నీళ్లు ఇస్తే కష్టపడి పనిచేసి బంగారం పండించే శక్తి, తెలివితేటలు రైతులకు ఉన్నాయి. నేను గ్రీన్ హౌస్ తెస్తే దాన్ని పనికిమాలిన సీఎం నాశనం చేశాడు. ఒక్క గ్రీన్ హౌస్ కైనా రుణం ఇచ్చాడా..సబ్సీడీ ఇచ్చాడా.? గతంలో హెక్టారుకు నేను రూ.16 వేలు రాయితీగా ఇచ్చాను..దాన్ని కూడా రద్దు చేశాడు.

అందుకే ఒక్కో రైతుకు యేడాదికి పెట్టుబడి కింద రూ.20 వేలు అందించే బాధ్యత తీసుకుంటా. మీటర్లు పెట్టొద్దని నేనంటే..మీటర్లు పెట్టి రైతులకు ఉరేస్తున్నాడు. మీ మోటార్ల దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసి మీ విద్యుత్ మీరే వనియోగించుకోవచ్చు..అవసరం అయితే విక్రయించుకునే విధంగానూ చర్యలు తీసుకుంటాను. కుప్పం వెనకబడిన వర్గాలకు చెందిన నియోజకవర్గం. 35 ఏళ్లుగా నన్ను మీరు ఆదరిస్తున్నారు..అందుకే మీ కోసం అట్రాసిటీ చట్టం తీసుకొస్తా..మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

త్వరలో జయహో బీసీ సభ పెట్టి బీసీలకు ఏం చేయాలో కూడా ప్రకటిస్తాం. ఎన్టీఆర్ సుజల శ్రవంతి ద్వారా రూ.2 లకే నీళ్లు ఇస్తే..దానికి రంగులు వేసుకుని నీళ్లివ్వకుండా సర్వనాశనం చేశారు. ఇంటింటికీ నీరు అందిస్తా..ఆడ బిడ్డలకు శ్రమలేకుండా చేస్తా. మోస పూరిత నవరత్నాలు ఇస్తున్నాడు. పది రూపాయలు ఇచ్చి వంద లాగుతున్నాడు. మీ ఆదాయం పెరగాలి..ఖర్చు తగ్గాలి..దానికి దానికి విరుద్దంగా ఇప్పుడు మీ పరిస్థితి మారింది. పెట్రోల్, డీజల్, నిత్యవసర ధరలన్నీ పెరిగాయి.

చెత్త పన్ను, ఇంటిపన్ను పెంచాడు. ఆటోవాళ్లకు పది వేలు ఇచ్చి రూ.50 వేలు ఫైన్లు ద్వారా లాగుతున్నాడు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది..ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటరీలు రోడ్డు మీదకు వచ్చారు. అందుకే మళ్లీ హామీ ఇస్తున్నా..ఆదాయం పెంచి సంక్షేమాన్ని అందిస్తాం. పేదరిక నిర్మూలన చేయాలన్నది నా లక్ష్యం. నిరుపేదలకు అండగా ఉండి మీ ఆదాయాన్ని పెంచుతా. ఆదాయం – సంపద పీపీపీ మోడల్ ద్వారా వస్తుంది. పేదల ఇంట్లో ఎంత మంది ఉన్నారు..ఆదాయం ఎంత..ఆదాయం పెంచాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించి అమలు చేస్తాం.

సబ్సీడీలు కల్పించి దీర్ఘ కాలంలో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని రెండింతలు చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఇంటికి ఒక ప్రణాళిక రూపొందించి ఆర్థికంగా పైకి తీసుకొస్తాం..అది కుప్పం నుండే ప్రారంభిస్తాం. కుప్పం నాకొక స్ఫూర్తి. ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుండే చేపట్టా. జన్మభూమి కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టిన తర్వాత రాష్ట్రంలో అమలు చేశాను. ధర్మరాజు దేవాలయానికి రూ.66 లక్షలు, కురుబ భవనానికి రూ.55 లక్షలిస్తే వాటిని రద్దు చేశారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కు రూ.25 కోట్లు ఇస్తే దాన్ని నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ కు డబ్బులివ్వడం లేదు. గుడిపల్లిలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు అందించే బాధ్యత తీసుకుంటాం. గుడుపల్లిలో మినీ మార్కెట్ ఏర్పాటు చేస్తా.

కుప్పంలో ఐదేళ్లలో ఒక్క తట్ట మట్టైనా వేశారా.? ఐదేళ్లలో రాష్ట్రంలో 24 వేల కి.మీ రోడ్లు వేశాం..ప్రతి ఊరిలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశాం..అవి ఇప్పుడు వెలుగుతున్నాయో లేదో తెలీదు. మండల కాంప్లెక్స్ కు రూ.3కోట్లు ఇస్తే దాన్ని రాకుండా చేశారు..నేనొచ్చాక పూర్తి చేస్తాను. కుప్పంలో రౌడీ ఇజం జరుగుతోంది. ఒక పక్క దాడులు..మరో పక్క కేసులు, కబ్జుల చేస్తున్నారు..మైనింగ్ కు పాల్పడుతున్నారు. ఇంతటి అరాచకాలు ఎప్పుడైనా చూశారా.? కుప్పంకు ఉన్న పేరు ప్రశాంతమైనది..దాడులు జరగని ప్రదేశం కుప్పం. కానీ ఇప్పుడు ఊరికొక ఆంబోతు తయారయ్యారు. హత్యలు చేసే వాళ్లు..హత్యలతోనే పోతారు.

ముఠా కక్షలను నిర్మూలించింది టీడీపీనే. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది టీడీపీనే. కొంత మంది రౌడీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నరు. యధారాజా తథా ప్రజా అవుతుంది. ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పించింది జగన్ కాదా.? నువ్వు సహకరించకపోతే మీ ఇంఛార్జ్ కు దోపిడీ చేసే ధైర్యం ఉందా జగన్.? మైనింగ్ చేసే మంత్రికి టికెట్ ఇవ్వకుండా మానేస్తావా.? పెద్దిరెడ్డి కంటే ఎక్కవ మైనింగ్ ఎవరన్నా చేశారా.? నీ మనషులు అయితే ప్రోత్సహించి.. అమాయకులకు మాత్రం టికెట్లు ఇవ్వకుండా తొలగిస్తావా.? మరి వైసీపీ ఎమ్మెల్యేల తప్పులకు ఎవరు కారణం..జగన్ కాదా? మార్చాల్సింది ఎవర్ని జగన్…నిన్ను.

మజ్జిగ నీళ్లు మనకు..మీగడ పెరుగు ఆయనకు. ఇసుక, మద్యం, భూములు, సెటిల్ మెంట్లు, గ్రానైట్ ద్వారా దోచుకుంటున్నారు. అరాచక శక్తులకు అంతమొందించాలంటే ఇంటికొకరు బయటకు రావాలి. మెడ మీద కత్తిపెట్టి మీ ప్రాణం తీస్తా ఆస్తి రాసివ్వు అని రాయించుకుంటున్నారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని భయపడి ఆస్తులు రాసి పారిపోతున్నారు. అంగన్వాడీలకు 2 సార్లు నేను జీతాలు పెంచా. చిరుద్యోగులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. టీడీపీ హయాంలో మొదటి తారీకునే జీతం ఇచ్చాను. క్రీడా ప్రాంగణాలు లేవుగానీ..కానీ ఆడుదాం అంధ్రా అంట.

దోచుకుందాం..దాచుకుందా అని ఆడుకుంటే వీళ్లకు సరిగా సరిపోయేది. గుడుపల్లిలో రూ.2 కోట్లతో మినీ స్టేడియం ఇక్కడ నిర్మిస్తా. కుప్పంను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపే బాద్యత నాది. కొండలు బద్దలు కొట్టే యువత ఉంది..ఉద్యోగాలు తెస్తాం..సంపంద పెంచుతాం. వంద రోజులు నా కోసం, సమాజం కోసం పని చేయండి..లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో ఈ సారి టీడీపీ గెలవాలి. ఇక్కడికి వచ్చే వైసీపీ వారు..వాళ్ల నియోజకవర్గాలు చూసుకోవాలి..వాళ్ల నియోజకవర్గంలోనే వాళ్లను భూస్థాపితం చేస్తా. ప్రజలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకోరు. ప్రజలు తిరగబడతారు..నడ్డి విరగ్గొడతారు.

ఇక్కడి గనులు దోచుకున్న పుంగనూరు పుడింగు బస్సులు కూడా లేకుండా చేశారు. ఇక్కడికి మళ్లీ గతంలో మాదిరిగానే బస్సు సౌకర్యం కల్పిస్తాను. బస్సులు కూడా సక్రమంగా రావాలంటే వైసీపీని చిత్తుగా ఓడించాలి. గతంలో ఆడబిడ్డలను చదివించాలంటే కొంత వెనక్కి తగ్గేవారు. 33 శాతం కాలేజీల్లో రిజర్వేషన్ కల్పించా. డ్వాక్రా సంఘాలు కూడా టీడీపీ తీసుకొచ్చింది. ఆడబిడ్డలను చదివిస్తే సమాజం బాగుపడుతుంది. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి..మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది’’ అని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE