Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న వల్లే కుటుంబంలో చీలిక

-ఎవ్వరూ కుటుంబాన్ని చీల్చలేదు
-వాళ్లను మంత్రులు చేస్తానని నమ్మించి మోసం చేశాడు
-రాష్ట్ర అధోగతికి జగనన్నే కారణం
-జగనన్నను మరోసారి ఆడేసుకున్న ఏపీ సి సి చీఫ్ షర్మిల రెడ్డి

కాకినాడ: అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు..

జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు..

రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ బుధవారం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు..

వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యo దేవుడు, నా తల్లి విజయమ్మ. వైకాపా ఇబ్బందుల్ల ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు. పార్టీ కోసం నెలల తరబడి 3,200కి.మీ పాదయాత్ర చేశా.

తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా.సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించా. ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపుకోసం అండగా నిలబడి ప్రచారం చేశా” అని షర్మిల గుర్తుచేశారు.

LEAVE A RESPONSE