– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు కేంద్రప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. పి వి నరసింహారావు కి భారతరత్న రావడం తెలుగు ప్రజలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణ కోరుకున్న వ్యక్తులకు, తెలుగు వారందరికీ గర్వకారణం సంతోషకరమైన విషయం.
పి వి నరసింహారావు కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రధాని నరేంద్రమోదీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ స్వాతంత్ర్య కోసం నిజాంపై పోరాడిన పోరాట యోధుడిగా నిలవడమే కాకుండా, దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసిన పీవీ నరసింహారావు కి భారతరత్నతో గౌరవించడం హర్షణీయం.
మరో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్‌కు కూడా భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం గర్వకారణం. రైతుల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.