Suryaa.co.in

Andhra Pradesh

హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించిన భువనేశ్వరి

కదిరి పట్టణం, 8వ వార్డులో ఉన్న బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ ప్రాంతంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ఆ సమయంలో విద్యార్థులను గమనించి వారి వద్దకు భువనేశ్వరి వెళ్లారు. విద్యార్థులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బాగున్నారా అని వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు? మంచిగా భోజనం పెడుతున్నారా? అంటూ విద్యార్థులను పలకరించి వారితో కాసేపు సరదాగా గడిపారు. విద్యార్థినిలందరితో కరచాలనం చేసి వారిని ఉత్సాహపరిచారు. వారితో సరదాగా ఫోటో తీసుకున్నారు. మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థినిలకు భువనేశ్వరి సూచించారు.

LEAVE A RESPONSE