-అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో అమలు చేస్తోంది
-అపోహను తొలగించాల్సిన భాద్యత మీడియా ప్యానలిస్ట్ లు పై ఉంది
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
-బిజెపి రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధికార ప్రతినిధి లు, మీడియా -ప్యానలిస్ట్, జిల్లా మీడియా ప్రతినిధులతో కార్యశాల
-రాష్ట్రస్థాయి కార్యశాల కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
-హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధులు మీడియా ప్రతినిధులు జిల్లా మీడియా ప్రతినిధులు
విజయవాడ : పురందేశ్వరి ఏమన్నారంటే.. 50 రోజుల్లో మనం ఎన్నికలకు వెళుతున్నాం. ఎన్నికలు ఇంకా ఎంత దూరంలో లేవు… ఎన్నికలు అనంతరం బిజెపి బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం గా బిజెపి మాత్రమే పని చేస్తోంది. ప్రతి సమస్య పై బిజెపి గళం విప్పింది. రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతినిధులు మీడియా ప్రతినిధులే ప్రధాన భూమిక పోషించాలి.
జాతీయస్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయడం లేదని అపోహను తొలగించాల్సిన భాద్యత మీడియా ప్యానలిస్ట్ లు పై ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. పేదలకు సంక్షేమ అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుంది. కేవలం ఒక తిరుపతి నియోజకవర్గం 30000 దొంగ ఓట్లు. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో బిజెపి ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో అమలు చేస్తోంది.
ఈ కార్యక్రమంలో మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించారు. బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తదితరులు మాట్లాడారు.అధికార ప్రతినిధులు ఆర్డి విల్సన్, జయప్రకాష్, భానుప్రకాష్‌రెడ్డి, యామినీశర్మ తదితరులు పాల్గొన్నారు.