శ్రీశైలంలో ఈరోజు నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి తెలిపారు. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు.