Suryaa.co.in

Andhra Pradesh

కూటమికి ‘మూడొ’చ్చింది!

కూటమిలో సమరోత్సాహం నింపిన ప్రజాగళం
టీడీపి జనసేన బీజేపీ ఉమ్మడి సభలో పలు ఆసక్తికర ఘటనలు
కూటమి సభలో మోరాయించిన మైకులు
ప్రధాని మోడీనే ప్రజలకు పలుసార్లు విన్నపం
ప్రమాదం బారిన పడతారని యువకులని బ్రతిమాలిన మోడీ
పలుసార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న మోడీ
కోటప్పకొండ ప్రస్తావనతో జనాల కేరింతలు
ప్రజాగళం లో పదనిసలు

(వాసిరెడ్డి రవిచంద్ర)

 తెలుగుదేశం బిజెపి జనసేన ఓటమి ఉమ్మడి సభ బొప్పూడి ప్రజాగళం లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సభ మధ్యలో కొన్ని సార్లు మైకులు మొరాయించాయి. అలాగే అలాగే లైట్ల టవర్లపై యువకులు ఎక్కి కూర్చోవడం పై ప్రధాని సైతం ఆందోళన చెందారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి యువకులను టవర్ల నుండి దిగిపోవాలని పలు సార్లు విజ్ఞప్తి చేశారు.

చిలకలూరిపేట బొప్పూడిలో ఆదివారం సాయంత్రం జరిగిన కూటమి సభలో అనేక పడనిసలు చోటుచేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా మూడుసార్లు మైకులు మొరాయించాయి. మైకుల సిస్టం ఉన్న స్టేజి వాడ్డ యువకులు ఒక్కసారిగా ముందుకు తోసుకువచ్చి ఎక్విప్మెంట్ పై పడడంతో పలుసార్లు మైకులు మొరాయించాయి. ఇలా మోడీ ప్రసంగం సమయంలో మూడుసార్లు కొద్దిసేపు ఆపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మైకులు పనిచేయకపోవడంతో నేతలకు చికాకులు తప్పలేదు. మైక్ సిస్టమ్స్ పై జనం పడవద్దని పలుసార్లు ప్రధానితో సహా నాయకులు కూడా విన్నపాలు చేశారు. వారిని కంట్రోల్ చేయాలని పోలీసులను కోరారు.

అయినా కూడా కట్టడి చేయడంలో విఫలమవ్వడం తో మైకులు మూగబోయాయి. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కూడా మైకులు ఇలాగే కొద్దిసేపు ఆటంకాన్ని కలిగించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్న కోపాన్ని మీ ప్రతాపాన్ని నాకు తెలియజేసేందుకు మైక్ సిస్టమ్స్ పై పడుతున్నారని ఛలోక్తులు విసిరారు.మీ ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం ఖాయంగా కనిపిస్తోoదన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో ప్రధాని స్వయంగా రంగం లోకి దిగి లైట్ల టవర్లపై ఉన్న యువకులను దిగిపోవాలని, ప్రోటోకాల్ ని సైతం పక్కనపెట్టి విజ్ఞప్తి చేయడం ఆసక్తి కలిగించింది. ప్రజల ప్రాణాల పట్ల మోడీకున్న గౌరవం అభినందనీయమని ఈ సందర్బంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కొన్నిసార్లు సభలో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. మరోవైపు జనాల రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడంలో విఫలమయ్యారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.

అదేవిధంగా జెండాలు కూడా సభాస్థలికి ఎదురుగా అడ్డుగా ఉండడం వల్ల వేదికపైన నాయకుల ప్రసంగాలకు కొంత ఆటంకం ఏర్పడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ కొన్నిసార్లు తెలుగులో మాట్లాడడం ఆంధ్ర ప్రజలకు ఉత్సాహo ఇచ్చింది. కోటప్పకొండ చరిత్ర,అక్కడ శివ పార్వతుల గొప్పతనాన్ని కూడా ప్రధాని మోడీ ప్రస్తావించడం సభకు హాజరైన జనంలో కేరింతలు కొట్టించాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి పథకాలు ప్రజలకు అందాయో తెలియజేయడంతో పాటు పల్నాడు ప్రజలకు సంబంధించిన ఆ పథకాలను వివరించడం ప్రజల్లో అవగాహన కలిగించింది.

ఆద్యంతం ప్రధాని ప్రసంగం తెలుగు ప్రజలకు ఆసక్తి కలిగించింది. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే జరిగిన తొలి సభగా ప్రధాని ప్రస్తావించడం ఆకట్టుకుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి చూడవలసినదిగా కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రజలకు వివరించడం విశేషం. జూన్ 4వ తారీఖు ఎన్నికలు ఫలితాలు వస్తాయి. మన ఎన్ డి ఏ ప్రభుత్వం కూడా 400 పైగా ఎంపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రధాని ప్రసంగం కూటమి విజయానికి బలం చేకూర్చే విధంగా ఉంది.

ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలతో కూడుకున్న జగన్ ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు మీ దగ్గర ఉన్న మొబైళ్లతో లైట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సభలో అందరినీ కోరారు. ఆయన పిలుపునందుకున్న సభలోని ప్రజానీకం మొబైళ్ల లోని టార్చిని వెలిగించడంతో వెలుగులతో సభా ప్రాంగణమంతా వెలిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు ఈ వెలుగులు కనిపించాలని, ఇది ఎన్డీఏ విజయానికి నాంది అని ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ప్రజలను ఆకర్షించింది.

అదేవిధంగా చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబు స్వరంపై ప్రధాని మోడీ మీది కంచు కంఠమని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తెలుగులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి సవివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువదించారు.ఇలా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి సభలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సభకు అంచనాలకు మించి ప్రజలు హాజరవడంతో కూటమిలో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది.

 

LEAVE A RESPONSE