-మొగళ్లూరు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
-రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియాకు చూపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
-లోతైన గుంతలు, బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ ను తలపిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతం
-రూ.4 వేలు కోట్లు దాటేసిన కాకాణి అక్రమ సంపాదన
-మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి
పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ శాఖ భూమిగా ఉంది. వారేమో రెవెన్యూ భూమి అనిచెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వ భూమే అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 12నే మా నాయకులు స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కలెక్టర్ తీసుకున్న చర్యలు శూన్యం
బ్లాస్టింగ్ తో లోతైన గుంతలు చేయడంతో పాటు, కనిపించకుండా మట్టికట్టలు వేసి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఈ రోజుకీ కూడా అక్రమ మైనింగ్ యథావిధిగా సాగుతోంది. జీపీఎస్ ఆధారిత ఫొటోలతో సహా కలెక్టర్ కు పంపాము. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇప్పుడు మైనింగ్ అధికారులను పంపామంటున్నారు. రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది?
ఒక సామాన్యుడు ఇంటి అవసరాలకు ట్రక్కుతో మట్టి తీసుకెళుతుంటే నానా బెయిలబుల్ కేసు పెట్టి వెంటాడుతున్న సర్కిల్ ఇన్ స్పెక్టరుకు ఈ దోపీడీ కనిపించలేదా? ఇప్పటికే వరదాపురంలో వందల కోట్ల దోపిడీ జరిగింది. ఇప్పుడు మొగళ్లూరులో అంతకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరుపూరులోనూ అదే పరిస్థితి. వరదాపురంలో రూ.500 కోట్లు, మొగళ్లూరులో మరో మరో రూ.500 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను కాకాణి మైనింగ్ మాఫియా ఎత్తేస్తుంటే అధికారులకు పట్టదా. ఎవరిని చూసి భయపడి మౌనం వహిస్తున్నారు.
ఈ ఐదేళ్లలోనే విరువూరు నుంచి రూ.500 కోట్ల విలువైన ఇసుకను కూడా అక్రమంగా లేపేశారు. అక్రమ మైనింగ్ దందా కాకాణిదే కాబట్టి అధికారులు అటువైపు కూడా చూడలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులను పంపి కలెక్టర్ యాక్షన్ చేస్తున్నారు. మొగళ్లూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందాను మొత్తం వీడియో రికార్డింగ్ చేశాం. ఒక్క రాయిని ఇక్కడి నుంచి దాటించినా ఊరుకునే ప్రసక్తే లేదు.
ప్రతి ఆధారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళుతున్నాం. వెంకటాచలం మండలంలో గ్రావెల్ నుంచి ఈ రోజు మొగళ్లూరులో మైనింగ్ వరకు ఐదేళ్లలో కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.4 వేల కోట్లకు పైగా దోచేశాడు. వేల కోట్లు దోచేసినా కాకాణికి దురాశ ఇంకా తగ్గలేదు. ఈ వేల కోట్ల సంపదను ఏం చేసుకుంటాడో? సర్వేపల్లి నియోజకవర్గంలో 90 వేలలకు పైగా నివాసాలున్నాయి. వాటిలో 20 వేల ఇళ్లను మినహాయించి, మిగిలిన 70 వేల ఇళ్లకు ఇంటికి రూ.2 లక్షలు చొప్పున పంచినా ఆయనకు పోయేదేమీ లేదు.
రూ.1400 కోట్లు పంచేసి ఎన్నికలకు దూరంగా ఉండు. నువ్వు చేసిన పాపాలకు అప్పుడైనా దేవుడు నిన్ను క్షమిస్తాడేమో అత్యంత అవినీతి పిశాచి అయిన కాకాణికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ జగన్మోహన్ రెడ్డి ఎలా అవకాశం కల్పించాడో? మొత్తానికి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాజకీయంగా పోయే కాలం దగ్గరపడింది. ఇక భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు.