Suryaa.co.in

Andhra Pradesh

సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

– సీమ, నెల్లూరులోని 62 సీట్లలో బీసీలకిచ్చింది 7 మాత్రమే
– బీసీలకు ఇచ్చింది 41 సీట్లే
-4 శాతం ఉన్న తన వర్గానికి 49 సీట్లు
– రిజర్వ్ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి
– శాసనమండలి మాజీ చైర్మన్ ఎం .ఎ.షరీఫ్

ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధమైపోయారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ప్రజల్ని మరోసారి మభ్యబెట్టి అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి కుట్రలకు తెరలేపాడు. ఐదేళ్లుగా సామాజిక వర్గాల పీకలు కోసి సామాజిక న్యాయం అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. 50శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు 41 సీట్లు మాత్రమే ఇచ్చిన జగన్ రెడ్డి సామాజిక న్యాయం అనడం హాస్యాస్పదం.

ఓడిపోయే సీట్లు మాత్రమే బీసీలకు ఇవ్వడమే సామాజిక న్యాయమా? రాయలసీమ, నెల్లూరులో మొత్తం 62 ఎమ్మెల్యే సీట్లు ఉంటే.. 4శాతం కూడా జనాభా లేని తన వర్గానికి 42 సీట్లు ఇచ్చి, సగానికి పైగా జనాభా ఉన్నవారికి 7 సీట్లు ఇవ్వడం సామాజిక న్యాయమా? చివరికి రాజ్యాంగబద్దంగా దళితులకు కేటాయించిన సీట్లను కూడా తన గొప్పగా చెప్పుకుంటున్నాడు. నా వల్లే వారికి సీట్లు దక్కాయని చెప్పుకోవడం శోచనీయం. అవి రిజర్వ్ అయ్యాయి కాబట్టే దళితులకు ఇచ్చారు తప్ప.. లేకపోతే అవి కూడా సొంత వారికే కట్టబెట్టుకునేవాడు. ఇలాంటి సామాజిక ద్రోహి.. సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

రాష్ట్రం మొత్తంలో బీసీలకు ఇచ్చింది 41 సీట్లే. కానీ 4శాతం ఉన్న తన వర్గానికి 49 సీట్లు ఇచ్చుకున్నాడు. మరోవైపు జగన్ రెడ్డి చేసిన పొలిటికల్ ట్రాన్స్ ఫర్లలో అధికంగా బలైంది కూడా బడుగు బలహీన వర్గాల వారే. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన బలహీన వర్గాలకు చెందిన 81 మందిని ట్రాన్స్ ఫర్లు చేశారు. కానీ తన వర్గానికి చెందిన వారి జోలికి వెళ్లకపోవడం ఏ విధమైన సామాజిక న్యాయమో జగన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. ఏడు పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక్క బీసీకి కూడా సీటు ఇవ్వకపోవడమే నీ సామాజిక న్యాయమా? మంత్రి వర్గంలో బీసీలకు అవకాశం ఇచ్చానంటున్న జగన్ రెడ్డి.. ఏ బీసీ మంత్రి అయినా స్వతంత్రంగా తన శాఖపై రివ్యూ చేసే అవకాశం ఉందా?

సొంత వర్గానికి చెందిన ఐదుగురు పెత్తందార్లకు రాష్ట్రాన్ని కట్టబెట్టి.. బడుగు బలహీన వర్గాలపై పెత్తనం చెలాయించారు. టీటీడీ, ఏపీఐఐసీ, ఆర్టీసీ లాంటి రాష్ట్ర స్థాయి సంస్థలకు ఛైర్మన్ పదవిని బడుగు బలహీన వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? సలహాదారులుగా, వీసీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పనికిరారా? సలహాదారులుగా బీసీలు పనికిరారని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం వివక్ష కాదా? వైసీపీ ఓడిపోవడం తప్పదని తెలిసిన చోట్ల బీసీలకు సీట్లిచ్చి, ఉద్దరించాననడానికి సిగ్గుపడాలి. ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా.. జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

LEAVE A RESPONSE