Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం

-ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేసిన వైసీపీ
-దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డ దాని మూలాలు ఆంధ్రలోనే
-ఇన్నాళ్లు కల్తీ మద్యంతో ప్రజల ఇళ్ళు, ఒళ్ళు, ప్రాణాలతో చెలగాటం
-ఇప్పుడు డ్రగ్స్ తో యువత నాశనం
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

తెలుగుదేశం హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదని అలాంటి రాష్ట్రాన్ని డ్రగ్స్ రవాణాలో వైకాపా ప్రభుత్వం నెంబర్ వన్ స్థానానికి చేర్చిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన శుక్రవారం పర్యటించారు.

ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విశాఖను క్యాపిటల్ సిటీగా మారుస్తానన్న జగన్ డ్రగ్ క్యాపిటల్గా మార్చేశారన్నారు. వీరభద్ర రావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వైసీపీ సీనియర్ నేత. ఇతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. గతంలో ఓ కంటైనర్ లో మార్ఫిన్, కోకైన్, హెరాయిన్, యాంపటేమిన్, మెస్కిలన్ వంటి భయంకరమైన మత్తు పదార్థాలు ఉన్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొందన్నారు.

ఇప్పుడు ఏకంగా 50వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని సి.బి.ఐ తన నివేదికలో తెలియజేయడం చూస్తుంటే, దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయని స్పష్టమవుతుందన్నారు. బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం మాఫియా తో ఇన్నాళ్లు ప్రజల ఒళ్ళు ఇల్లు ప్రాణాలు నాశనం చేశారని ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ తో యువతను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి దోపిడీని యువత ప్రశ్నించకుండా నిలదీయకుండా ఉండడం కోసం, వారిని మత్తులో దించి గేమింగ్,క్యాషినో తో రాష్ట్రాన్ని డ్యూటీ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు.

డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉందని అందుకే వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. విశాఖ కేంద్రంగా డ్రగ్స్ మాఫియాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖకు మారుస్తున్నానని జగన్ రెడ్డి చెప్పడం డ్రగ్స్, భూకబ్జాల కోసమేనని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ఏదేమైనా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను వైకాపా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ఆంధ్ర గా మార్చేసిందని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE