Suryaa.co.in

Andhra Pradesh

అబద్దాలు చెప్పడంలో జగన్ రెడ్డి పీహెచ్‌డి

– ఓటమి భయంతోనే జగన్ రెడ్డి చెప్పిన అబద్దానే పదే పదే చెప్తున్నాడు
– ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పడు గుద్దులు గుద్దుతున్నాడు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్ రెడ్డి బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యింది. ఓటమి భయంతోనే చెప్పిన అబద్దాన్నే పదే పదే చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేయాలనుకుంటున్నాడు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో పీహెచ్‌డి సాధించారు. ఎన్నికల ముందు బాబాయి హత్య కేసులో, కోడికత్తి డ్రామాతో పేద ప్రజల్లో సానుభూతి పొందాడు. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పడు గుద్దులు గుద్దుతున్నాడు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి, అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రంలో ఇసుక దొరక్క సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నారు అవేమి జగన్ రెడ్డికి కనిపించవు వాటి గురించి ఏం మాట్లాడరు.

మద్య నిషేదం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలను అడగడానికి సిగ్గుగా లేదా? నాశిరకం మద్యం ద్వారా వేల కోట్లు కుంభకోణం చేసి 30 వేల కుటుంబాలను దిక్కులేకుండా చేశావు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి 9 సార్లు పెంచి ప్రజల్ని మోసం చేశారు. నాడు ఇంటి పన్ను రూ.200 కడితే నేడు రూ.1000 కు పెంచారు. ప్రతి జనవరి 1కి మెగా డిఎస్సీ ద్వారా 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి యువతను మోసం చేశారు. ఇసుక రేట్లను పెంచేసి కోట్ల రూపాయలు దోపిడీ చేసి తాడేపల్లి ప్యాలెస్ కి సొమ్మును రప్పించుకున్నావు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా 8లక్షల కోట్లు దోచుకున్నావు వీటికి సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి?

పెట్రోల్, డీజీల్ ధరలు నియంత్రిస్తానని కనీసం వ్యాట్ చార్జీలు తగ్గించలేక పోయావు. ఎన్ని లక్షలయినా అందరినీ చదివిస్తానని చెప్పి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. అమ్మఒడి ద్వారా ఏటా 15 లక్షలు ఇస్తానని చెప్పి 13 వేలకు కుదించి 7 లక్షల మందికి మొండిచేయి చూపించారు దీనికేం సమాధానం చెప్తారు. నాడు – నేడు అంటూ రంగులు, ఇటుక, సిమెంట్‌ ద్వారా దోపిడి చేశారు. బైజూస్ అవినీతిలో కూరుకుపోయింది. చివరకు చిన్నపిల్లలు తినే చిక్కీల కవర్లపై కూడా నీ ఫొటో వేసుకుని ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారావు. టీడీపీ హయాంలో ఒక పథకం ప్రకారం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఈరోజు నీ ప్రచార పిచ్చికి వాడుకుంటున్నావు.

ఎన్నికల ముందు బాబాయి హత్య, కోడికత్తి డ్రామాతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చావు. నాడు సీబిఐ విచారణ కోరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విత్‌డ్రా చేసుకున్నావో సమాధానం చెప్పగలవా? తెల్లవారుజామునే బాబాయి హత్య జరిగిందని తెలిసినా సాయంత్రం వరకు పులివెందులను ఎందుకు వెళ్లలేదు. నీ సొంత చెల్లెల్లు, సునీత రెడ్డి, షర్మిల అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలవా? బాబాయిని చంపిన హంతకుల్ని ఎందుకు పక్కన పెట్టకున్నావ్? కడప ఎంపి సీటు ఎందుకిచ్చావ్ అనే ప్రశ్నలకు జవాబు ఉందా?

నీ ఇద్దరు చెల్లెల్లకు సమాధానం చెప్పని నువ్వు ప్రజల్ని ఓట్లు ఎలా అడుగుతావు? పేదలూ- పెత్తందార్లు అంటూ ఊదరగోడుతున్న జగన్ రెడ్డి పేదవాడయితే ఇడుపులపాయ, కడప, బెంగుళూరు, హైదరాబాద్, రిషికొండ, మద్రాస్‌లో ఉన్న ప్యాలెస్‌లు ఎవరివి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము దోచుకున్న నువ్వు పేదవాడావా? అంగన్‌వాడీల జీతాలు పెంచుతానని మాయమాటలు చెప్పావు. ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్ లపై దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టించి వాళ్లకు రక్షణ లేకుండా చేశారు.

రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 30 వేలు కలుపుకుని 65 వేలు ఇస్తున్నానని చెప్పుకోవడం సిగ్గు చేటు. గత ఐదేళ్లలో రైతులకు నష్టం మాత్రమే జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ డ్యాంలోని నీళ్లు లేకుండా పోయాయి. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేస్తే జగన్ రెడ్డి గాలికొదిలేశాడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మరుగున పడేశారు. వంశధార – నాగవళి నాశనం చేశారు. పులివెందులకు నీళ్లిచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే ఉత్తరాంధ్ర, వెలిగొండ, రాయలసీమ, నెల్లూరు సంఘం బ్యారెజ్ గోదావరి, నాగార్జున సాగర్ కు నీళ్లు వచ్చి ఉండేవి. నీ ముర్ఖత్వం, నీ తెలివితక్కువ తనం వల్ల ప్రాజెక్టులన్నీ మూలన పడ్డాయి. పోలవరంలో ఓటు అడిగే అర్హత నీకు లేదు.

మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లుకుండా చేశావు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులైజ్ చేస్తానని మోసం చేశావు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ పడిన దాఖాలాలు లేవు. సీపీఎస్ రద్దు అని చెప్పి గాలికొదిలేశావు. అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లు తీసేసి ప్రాణాలు తీసే లిక్కర్ షాపులు పెట్టావు. ఇమాం, మౌజమ్ లకు 15 వేలు ఇస్తానని మోసం చేశావు. పాస్టర్లకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశావు. అసైన్డ్ భూములను పరిరక్షిస్తానని చెప్పి భూములును దోచుకున్నారు.

ఆర్టీసి ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి పేద ప్రజల్ని మోసం చేశారు. అంతే కాకుండా సిద్దం సభలకు అడ్డగోలుగా ఆర్టీసీ బస్సులకు వాడుకుంటున్నారు. ఆర్టీసీలకు జీతాలు ఇవ్వకుండా గొంతు కోశావు. అద్భుతమైన రోడ్లు వేస్తానని చెప్పి ఉన్న రోడ్లను కూడా గుంతలు పూడ్చలేదు. బ్యాక్ లాగ్ పోస్టులు పూర్తి చేస్తానని చెప్పి గొంతుకోశావు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదు. గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు లేకుండా దోపిడి చేస్తున్నారు. టెక్స్టైల్ పార్కులు, చేనేత కార్మికులను ఉద్దరిస్తానని గాలికొదిలేశారు.

రూ. 3000 కోట్లు గిట్టుబాటు ధరకు ఖర్చు పెడతానన్నారు. రూ. 4000 కోట్లు ప్రకృతి విపత్తులకు సాయం చేస్తానని గాలికొదిలేశారు. కట్టి ఉన్న 3 లక్షల టిడ్కో ఇళ్లు పాడుపెడుతున్నారు. పాదయాత్రలో 630 హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు. టీడీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ. 2000 నుంచి 3000 పెంచుతానన్నారు. కానీ నువ్వు రూ. 3000 వేలకు పెంచడానికి 55 నెలలు పట్టింది.

ఓడిపోతావనే భయంతోనే చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్తూ పేద ప్రజల్ని మోస చేస్తున్నావు. కోడి కత్తి డ్రామా ఆడి శ్రీనుని 5 ఏళ్లు జైళ్లో మగ్గబెట్టావు. అమరావతిలో ఇస్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని అక్రమ కేసులు పెట్టారు. అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టించారు. మహిళలను దూషించారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకుంటానని చెప్పి ఏం ఉధ్దరించావ్? 2019లో ఎన్నికల ముందు నువ్వు చెప్పిన పింక్ డైమండ్ ఎక్కడుంది తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా ? జగన్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే నీకు బుద్ది చెప్తారు.

LEAVE A RESPONSE