Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం

-ఆర్యవైశ్యులను టీడీపీ నుంచి దూరం చేయలేరు
-ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
-తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌

మంగళగిరి:అసత్యాలు, దుష్ప్రచారాలతో ఆర్యవైశ్యులను తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయలేరని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ తెలిపా రు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రువారం విలేకరుల సమావేశంలో చంద్రబా బు వ్యాఖ్యలపై వైసీపీ ఆర్యవైశ్య నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిరచారు. జగన్‌ ఎప్పుడు పోతాడా అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు… ఇక ఎన్నికల కోడ్‌ వచ్చింది…చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే వ్యాపారాలు బాగుంటాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వ్యాపారస్తులు భావిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులను టీడీపీ నుంచి దూరం చేసేందుకు దుష్ప్రచా రాలు చేస్తున్నారన్నారు.

రావులపాలాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని, చివరికి కిరాణా కొట్లలో కూడా అమ్మడానికి కూడా వైసీపీ నాయకులు వెనకాడటం లేదని చంద్రబాబు చాలా అర్థవంతం గా వ్యాఖ్యలు చేశారు. దీనిని వైసీపీ ఆర్యవైశ్య నాయకులు ఏదేదో సృష్టించి వీడియోలను తయారు చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రావులపాలెంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కర్రి రెడ్డి(ఆర్యవైశ్యుడు కాదు) కొంతమంది సన్నహితులతో కలిసి కొన్ని కిరాణా దుకాణాల్లో వ్యాపారస్తులను అడ్డంపెట్టుకొని గంజాయి అమ్ముతున్నాడని, అతన్ని ఉద్దేశించి కొన్ని అనడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను ఓ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ పెడార్థం తీస్తూ రెచ్చగొట్టడం సరికాదన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వ్యాపారస్తులకు చంద్రబాబే న్యాయం చేశాడని ఆధారాలతో సహా నిరూపిం చడానికి సవాల్‌ చేస్తే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తోక ముడిచి నియోజకవర్గం దాటి పారిపోయాడని విమర్శించారు. చంద్రబాబుకు రోశయ్య అంటే కోపమని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారికి రోశయ్య గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆయన చనిపోతే పూలదండ కూడా వేయలేదని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE