-లేదంటే మేమే మారుస్తాం
-చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్
-హోంమంత్రి అనిత
పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.’కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.లేదంటే మేమే మారుస్తాం.మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం. TDP కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులపై సమీక్ష జరుగుతుంది. నాకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు కృతజ్ఞతలు’ అని ఆమె వెల్లడించారు.