Suryaa.co.in

Andhra Pradesh

శాంతి బిడ్డ తండ్రి విజయసాయిరెడ్డే

– నాకు తనే ఆ మాట చెప్పింది
-విల్లా కొనుగోలుకు సాయిరెడ్డే కోటిరూపాయలిచ్చారు
– మరో కోటి రూపాయలు శాంతి సమకూర్చింది
– విజయసాయి భార్య సునంద నాకు 60లక్షల నగదు ఇచ్చారు
-2 కోట్ల 60 లక్షలతో విల్లా కొన్నాం
– దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్‌మోహన్
– సాయిరెడ్డి మీడియా ముందుకొచ్చిన రోజునే ప్రత్యక్షమైన మదన్

హైదరాబాద్: ముమ్మాటికీ తన భార్య బిడ్డకు తండ్రి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేనని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్‌మోహన్ స్పష్టం చేశారు.

ఆ విషయాన్ని తాను పదే పదే ప్రశ్నించగా, తన భార్త శాంతినే చెప్పిందన్నారు. విల్లా కొనుగోలు కోసం విజయసాయిరెడ్డి కోటి రూపాయలిచ్చారని, తానే శంషాబాద్‌లోని విజయసాయిరెడ్డి ఫాంహౌసుకు వెళ్లి, ఆయన భార్య సునంద వద్ద 60 లక్షల నగదు తీసుకున్నానన్న మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. శాంతి ఎపిసోడ్ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించిన రోజునే.. ఆమె భర్త మదన్‌మోహన్ కూడా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం విశేషం.

ఈ సంద ర్భంగా శాంతి భర్త మదన్‌మోహన్ ఏమన్నారంటే.. 2022 జనవరిలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లా. సెప్టెంబర్‌‌లో రావాలని శాంతి నన్ను అడిగింది. వారం రోజులు రావాలని కోరింది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేస్తాం అని చెప్పింది. రూ.4 కోట్ల విల్లా రూ.2.5 కోట్లకు విజయసాయిరెడ్డి ఇప్పిస్తున్నారని వివరించింది. ఆ సమయంలో వద్దని అన్నా. కానీ శాంతి వినిపించుకోలేదు. సరేనని వచ్చా.

శంషాబాద్‌లో విజయసాయిరెడ్డి ఫామ్ హౌస్ వద్దకు వచ్చా. అక్కడ సాయిరెడ్డి భార్య సునంద రూ.60 లక్షల నగదు ఇచ్చారు. అక్కడి నుంచి కారులో విశాఖ వెళ్లాను. మార్గమధ్యలో విజయవాడలో ఉన్న విల్లా కూడా చూశా. అప్పటికే రూ.కోటి సాయి రెడ్డి ఇచ్చారు. మరో రూ.కోటిని శాంతి సమకూర్చింది. రూ.2.60 కోట్లతో విల్లా కొనుగోలు చేశాం. ఆ సమయంలో ఇద్దరం ఫిజికల్‌గా కలిశాం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. 2022 సెప్టెంబర్ 25వ తేదీన అమెరికా వెళ్లా.

LEAVE A RESPONSE