Suryaa.co.in

Andhra Pradesh

దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు

* దుర్మార్గాలను ప్రశ్నించినందుకు తపమై తప్పుడు కేసులు పెట్టడం వలన ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు
* భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు
* ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల కోసం వచ్చిన అనేక అర్జీలు
* ఇళ్లు లేని తమకు ఇళ్లు కల్పించాలని వేడుకున్నారు
* ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు

రాష్ట్రంలో ఐదేళ్లు ప్రజలు తమ గోడు చప్పుకునేందుకు భయపడ్డారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు చేశారు. అసమర్థ, అరాచక నిర్ణయాలతో విసుగుబోయిన జనం వైసీపీ ప్రభుత్వానికి కోలుకోలేని గట్టి దెబ్బ కొట్టారు. గత ప్రభుత్వ బాధితులకు న్యాయం చేసేందుకు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

అందులో భాగంగా నేడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల వద్ద నుంచి వైసీపీ నేతలు చేసిన అక్రమాలపైనే ఎక్కువగా అర్జీలు వచ్చాయి. గత పాలకుల భూ కబ్జాలు బాధితులు మంత్రి ముందు వాపోయారు. వైసీపీ చేతిలో రాజకీయ కక్ష సాధింపులకు గురైన టీడీపీ కార్యకర్తలు మంత్రితో తమ బాధను చెప్పుకున్నారు. తమపై గత పాలకులు అక్రమ కేసులు బనాయించి వేధించారని గోడు విన్నవించుకున్నారు.

• పల్నాడు జిల్లా యడ్లపల్లి గ్రామం, ధనరాజుపల్లి కోటయ్య మూడ ఎకరల భూమిని జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే విడదల రజని మరిదైన గోపినాధ్ పేరునా రూ.25 లక్షలు కొన్నరు.. కాని ఇంతవరకు ఆ డబ్బును ఇవ్వకుండా వేధిస్తున్నారని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
• నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, దగదర్తి గ్రామంలో టీడీపీకి చెందిన వడ్డే పవన్ కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతలు కక్ష పూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధించారిన, కాబట్టి న్యాయం చేయాలని అర్జీ పెట్టుకున్నారు.
• పల్నాడు జిల్లా బోల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో 40 సంవత్సరాల నుంచి సాగుచేసుకోంటు వస్తున్న భుమిని ఆన్ సర్వే ల్యాండ్ అని చూపి వైసీపీ కార్యకర్తలు పొట్లపాటి హరిబాబు, కొత్తపల్లి మేసొబు, గంగదేవర వెంకటేశ్వర్లు అక్రమించి మాపై దాడి చేసి చంపటానికైన వెనుకాడమని దౌర్జన్యం చేస్తున్నారని వారి నుంచి రక్షన కల్పించాలని గ్రీవెన్స్ లో విజయ నిర్మల మరియు మేరీ అనే మహిళలు వేడుకున్నారు.
• ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశానికి చెందిన కొప్పు పేదేశ్వరరావు అనే వికలాంగుడుపై గత పాలకులు రాజకీయ కక్ష సాధింపులు చేశారు. అతని వస్తున్న పింఛన్ను, తెల్ల రేషన్ కార్డును గత ప్రభుత్వం రద్దు చేసిందని ఫిర్యాదు చేశారు.
• గుంటూరు జిల్లా, పెద్ద కాకాని మండలం, నంబూరు గ్రామానికి చెందిన చెల్ల నాగదుర్గ కుటుంబం 2020లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఇళ్లు దగ్ధమయ్యిందని, 4 సంవత్సరాల నుంచి గూడు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని, భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నారని కన్నీరుమున్నీరైంది.

అర్జీలు తీసుకువచ్చిన ప్రతీఒక్కరి సమస్యలను, బాధలను మంత్రివర్యులు రామానాయుడు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. తప్పకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE