– నవతరంపార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంను అభినందించిన మంత్రి లోకేష్
మంగళగిరి: ఎన్డీయే కూటమి విజయం కోసం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మద్దతుగా నిలిచారని, మంగళగిరి నియోజకవర్గంలో తన విజయంలోనూ కీలకపాత్ర పోషించారని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంను మంత్రి లోకేష్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున నవతరం పార్టీ సూచనలు సలహాలు తీసుకొంటామన్నారు. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మంగళవారం రావు సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి రావు రామతులసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన పలు కార్యక్రమాలకు హాజరై సంఘీభావం తెలిపారని అన్నారు. మేడే రోజు సుబ్రహ్మణ్యం తల్లి చంద్రావతి చనిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హాజరు కాలేక పోయానని అమ్మ కు నివాళులు అర్పిస్తున్నా అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నవతరం పార్టీ నుండి అన్న రావు సుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్న ప్రజావారధి కార్యక్రమం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుడు టీడీ జనార్ధన్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.
చంద్రబాబు నాయుడు సీఎం కాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు పడ్డాయని, సంక్షేమ పాలన మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని ప్రభుత్వానికి నవతరం పార్టీ మద్దతు కొనసాగుతుందని రావు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ ఇంటికి పిలిచి కుటుంబ సభ్యుడులా అన్నా, వదిన అంటూ చూపిన అభిమానం ఎంతో సంతోషం కలిగించిందని రావు రామతులసి ఈ సందర్భంగా తెలిపారు.