Suryaa.co.in

Andhra Pradesh

రూ.10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న భూముల కబ్జా!

బీజేపీ ‘వారధి’కి అందిన ఫిర్యాదు

విజయవాడ: దాదాపు రూ. 10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న స్వామి భూములు కబ్జాకు గురయ్యాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘వారధి’కి మంగళవారం ఫిర్యాదు అందింది. వారిధిలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి నాగులాపురానికి చెందిన జె.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలివి… నాగలాపురం మండలం, నాగలాపురం గ్రామంలో టీటీడీ భూమి రెండు ఎకరాలను కొందరు కబ్జా చేశారు. 969/బి45 లో 50.40 సెంట్లు లో 2 ఎకరాల టీటీడీ భూమిని కొంత మంది రెవెన్యూ డిపార్టుమెంటులో మాజీ వీఆర్వోలు, మాజీ వైసీపీ ఎంపీటీసీ, కొంత మంది స్థానికులు కబ్జా చేసి చేశారు.

నాగలాపురం టౌన్ లో బజార్ వీధిలో 7-60 పక్కన 12 కి 200 అడుగుల పొడవు దారిని కబ్జా చేసి ఉన్నారు. దీనిని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసి రిటైర్‌ అయిన చింతల మునిరత్నం, అతని కుమారుడు చింతల కృష్ణ నకిలీ పత్రం సృష్టించి కబ్జా చేశారు. దాంతో పాటు మా భూమిని కబ్జా చేశారు. మా బావిని పుడ్చేయడంతో అప్పటి కలెక్టర్‌ భరత్ గుప్తాకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేకపోయింది.

ఆ తరువాత వచ్చిన కలెక్టర్‌ వెంకట రమణ రెడ్డికి, జాయింట్ కలెక్టర్‌ డీకే బాలాజీకి పక్క ఆధారాలతో మళ్ళీ ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోకుండా వైసీపీ నాయకులు చెప్పినట్టు నడుకున్నారు. మేం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచుకున్న కూడా పట్టించుకోలేదు. అలాగే పొడవు దారి గురించి కూడా హై కోర్టులో కేసు వేశాం. ఆ ఆర్డర్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే, హైవేలో గ్రామానికి కేటాయించిన 40 సెంట్లు చిన్నపిల్లల శ్మశానాన్ని కబ్జా చేసిన వారి మీద, వీరికి సహకరించిన అధికారుల మీద వారి పైన కూడా పైన క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE