-చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం ఆలోచించాడు
-జగన్ రెడ్డి చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం ఆలోచిస్తున్నాడు
చంద్రబాబు నాయుడు యువతకు శిక్షణ ఇవ్వాలి, వారు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ఆలోచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు, వారి భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేశారు. కానీ, జగన్ రెడ్డి యువత జీవితాలు ఏమైపోయినా, ప్రజల బతుకులు బుగ్గైపోయినా తనకు మాత్రం కక్ష సాధింపు, ప్రతీకారం సాధించడమే ధ్యేయం అనేలా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు హోరెత్తాయి. జగన్ రెడ్డీ, ఎంతగా బరితెగించి వ్యవహరించినా న్యాయానికి సంకెళ్లు వేయడం అసాధ్యమని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టారు. ‘బాబుతో నేనై’ కార్యక్రమాలు నిర్వహించారు.
శునకాన్ని బంగారపు సింహాసనంపై కూర్చుండబెట్టినా.. తన బుద్ధి ఎప్పుడూ చెత్త కుప్పపైనే ఉంటుందనేలా, 11 సీబీఐ, 8ఈడీ కేసుల్లో ఏ-1గా 16 నెలల పాటు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డికి ఎప్పుడూ కోర్టులు, కేసులపైనే మనస్సు ఉంది. చంద్రబాబు అనే శిఖరాన్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసుతో జైల్లో పెట్టించారు. జగన్ రెడ్డి లాంటి అథములు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా చంద్రబాబు కాలి గోటికి కూడా ఎలాంటి నష్టం లేదు అంటూ నేతలు హోరెత్తారు. నిరుద్యోగాన్ని రూపు మాపడమే లక్ష్యంగా నాడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ చేపట్టారు.
ఐఏఎస్ కమిటీతో అధ్యనం చేసి, 2016లో రాష్ట్రవ్యాప్తంగా 43స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించారు. ఏపీ 2019లో కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్‌కు జాతీయ అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆ అవార్డు కూడా తీసుకున్నారు. యువత జీవితాలు బాగుపడితే చూడలేని, భరించలేని జగన్ రెడ్డి ఇలా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో దువా చేపట్టారు. జనసేనతో పాటు వివిధ పార్టీలు మద్దతు తెలిపారు.
పాకాల మండలం, దామలచెరువు పంచాయతీ పత్తిపాటివారిపల్లి గ్రామంలో చంద్రగిరి నియోజకవర్గ ఇంఛార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో సప్తకన్యకల శాంతి హోమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, త్వరగా బయటికి రావాలని పూజలు చేపట్టారు. కాకినాడ గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజీలో గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ల్యాబ్స్‌ను ప్రత్యక్షంగా పరిశీలించి టెక్నికల్ వివరాలను ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో నిరసన జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీస్‌లు భగ్నం చేశారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తం దానం చేసి, రక్తంతో సంతకాలు చేసి మద్దతు పలికారు. చీరాల టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలాయపాలెంలో చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మసీదులో దువా చేపట్టారు.
ఈ నిరహారదీక్షలలో పోలిట్‍బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, ఎండీ షరిఫ్, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎం.డి ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, జ్యోతుల నవీన్, రెడ్డి ఆనంతకుమారి, కె.ఎస్ జవహార్, గన్ని వీరాంజనేయులు, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జివి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.టి నాయుడు, బికె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, పులివర్తి నాని, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు తదితరులు పాల్గొన్నారు.