Suryaa.co.in

Telangana

ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా ?

-బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా?
-బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ,బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్వచ్చే కేసు ఇది.

బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో వున్నారు కాబట్టే జైల్లో పెట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. లిక్కర్ పాలసీ నిర్ణయం పైన కేసులు పెట్టారు. సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారు.

చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. సూచనలు తీసుకుని సమాధానం తీసుకుని సమాధానం చెబుతా అని ఆయన అన్నారు. అంటే ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా ?

మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆలస్యం అయినా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా?

సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా ఐదేళ్ళు పని చేశారు. ముకుల్ రోహత్గీ సీనియర్ లాయర్. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము.

స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.

ఏపీ లో టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీ లో చేరిన ఎంతో మంది నేర చరితుల పై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవిత పై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారు.

కోర్టు ధిక్కరణ కేసులు వేస్తాం: సోమా భరత్ కుమార్
కవిత కు బెయిల్ పై కొందరు కాంగ్రెస్ నేతలు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల పై వ్యాఖ్యానించే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడాలి. ఈ తీర్పుకు రాజకేయాలకు సంబంధం లేదు. కోర్టు ను కించపరిచేలా మాట్లాడితే, కోర్టు ధిక్కరణ కేసులు వేస్తాం.

LEAVE A RESPONSE