Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం!

– టీడీపీ నేత బుద్దా వెంకన్న

విజయవాడ: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని, విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం… గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం… ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

జగన్ పాలనకి, చంద్రబాబు పాలన కి ఎంత తేడా ఉందో చూడండి.. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారు.. ఆడుదాం ఆడవాళ్ల తో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారు.. ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంస్తోంది.

కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే .. ఐపీఎస్‌లు పరుగులు పెట్టారంట.. ఛీటింగ్ కేసు లో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం.. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు? సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు.. ఆనాటి డీజపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి.. ఈ కేసుల్లో పాత్రధారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలి. జగన్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేదు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి.

LEAVE A RESPONSE