పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద గోవాలో పాకిస్తాన్ క్రైస్తవునికి భారత పౌరసత్వం లభించింది. 78 సంవత్సరాల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తిగా పెరీరా రికార్డుల్లోకి ఎక్కారు.
సీఏఏ కింద దరఖాస్తు చేసుకున్న ఒక నెల తర్వాత తనకు పౌరసత్వం లభించిందని జోసెఫ్ తెలిపారు. 1946 లో జన్మించిన పెరీరా ఉన్నత చదవులు కోసం 1960 లో పాక్ వెళ్లారు. దాంతో ఆయనకు ఆ దేశ పౌరసత్వం లభించింది. తర్వాత 37 ఏళ్ల పాటు బహ్రెయిన్ లో పనిచేశారు. 2013 లో పదవీ విరమణ పొందాక, తన కుటుంబంతో నివసించడానికి గోవాకు తిరిగి వచ్చేశారు.