-
మెడికల్ క్యాంపుల ద్వారా బాధితులు వైద్య సేవలపై ఆరా
-
బాధితులకు బట్టలు, ఆహరం పంపిణీ చేసిన మంత్రి రాముడు టీమ్
వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్దులకు , గర్భిణీ స్త్రీలకు మూడు పూటల ఆహారం , అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
విజయవాడ తూర్పుకృష్ణ లంక 17 వార్డులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మేల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. వైద్య శిబిరం ద్వారా 67 రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచామని , ఒక డాక్టర్ , 2 సూపర్వైజర్, ఆశ వర్కర్లు సచివాలయం సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. శిబిరంలో అందుతున్న సేవల పట్ల అక్కడ ఉన్న వృద్దురాలిని పలకరించి మంత్రి అరా తీశారు. 17 వ వార్డులో జరుగుతున్నా పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య పనుల పట్ల అధికారులకు సూచనలు చేసారు.
మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన శిరంలో మంత్రి వస్త్రాలను పంపిణి చేసారు. ఈ కాలనీ లో ఉన్న కుటుంబాలు పూర్తి స్థాయిలో వరదకు ప్రభావితం అయ్యాయని వారందరికీ ప్రభుత్వ పరంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందిస్తు, సహాయక చర్యలు క్షేత్ర స్ధాయిలో అందేలా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ రాయి రంగమ్మ, అధికార్లు పాల్గొన్నారు.