Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల కోడ్ ప్రతిపక్షాలకు మాత్రమేనా?

– ఎన్నికల కోడ్ ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు
– టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్‌ను ఎప్పుడు ఉల్లంఘించలేదు
– శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్

ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్యక విధానాలను పోలీసులు, వైసీపీ అధికారులు వ్యవహరిస్తున్నారు. గత 40 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్‌ను ఎప్పుడు ఉల్లంఘించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ అనేది ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులకు గురిచేయాలనే అక్కసుతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. నారా లోకేష్ కాన్వయ్‌ని టార్గెట్ చేసి రెండురోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేయడం దుర్మార్గం.

లోకేష్‌ను పత్రికల్లో అప్రతిష్టపాలు చేయాలనే ఇలా ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసి కార్లను తనిఖీలు చేయడం వైసీపీ అరాచకపాలనకు నిదర్శనం. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న జగన్ రెడ్డి ఆదేశానుసారంగా పోలీసులు విధులను నిర్వర్తిస్తున్నారు. గత ఐదేళ్లుగా పోలీసులు పక్షపాతంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. లోకేష్ కారును నాలుగు సార్లు తనిఖీ చేసి ఏం సాధించారు. కావాలనే లోకేష్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి వైసీపీ నాయకులు ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విధానాన్ని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు మానుకోవాలని డీజీపీని, పోలీసులను కోరుతున్నాం.

LEAVE A RESPONSE