వైసీపీ పాలనలో ఆస్తులకూ రక్షణ లేదు

-రాష్ట్రంలో భూ మాఫియాపై ఒంటిమిట్ట, విశాఖ, తిరుపతి, పలమనేరు ఘటనలను ప్రస్తావించిన చంద్రబాబు
-ఆన్ లైన్ విధానాన్ని వైసీపీ నేతలు అక్రమాలకు అనువుగా మలుచుకున్నారు
-కుప్పంలో కుప్పి గంతులతో జగన్ అభాసుపాలు అయ్యాడు
-టీడీపీ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్న కుప్పంలో లక్ష మెజారిటీ లక్ష్యాన్ని దాటాలి
-5 ఏళ్ల వైసీపీ పాలనలో కుప్పం అభివృద్ధి ఆగిపోయింది
-అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రణాళికతో కుప్పం సమగ్రాభివృద్ది
-రూ.10 ఇచ్చి…రూ.100 దోచే ప్రభుత్వం వద్దు…ఆంక్షలు, బాదుడు లేని సంక్షేమం ఇస్తాం
-ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ మీ ఇంటికే వస్తుంది
-కుప్పం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

కుప్పం :- ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని మీరే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చేది కుప్పంలోనే.
• సైకిల్ కి తప్ప మరో పార్టీకి ఓటెయ్యడం తెలియని బంగారు కుప్పం మనది.
• నా కుప్పం నియోజకవర్గం గురించి కాలర్ ఎగరేసుకుని చెబుతున్నానంటే అది మీరు చూపించిన అభిమానం.
• కొంతమంది నేతలు కులం, మతం ఎక్కవ ఓట్లను చూసి నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారు. కానీ నేను పేదలు ఎక్కడున్నారా అని వెతుక్కుని కుప్పానికి వచ్చాను.
• పేదలు, బడుగు బలహీన వర్గాలే నాకు సర్వశ్వం.
• నేను ఇప్పటివరకూ 7 ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేశా. ఎన్నికలు వస్తున్నాయి…ప్రజల్లోకి వెళ్లే ముందు మీ ఆశీస్సులు కోరేందుకే ఇక్కడికి వచ్చా.
• ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. కుప్పం ప్రజలను చూస్తే…ఎన్నికల కళ కనిపిస్తోంది.
• కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీకి డిపాజిట్లు కూడా ఇవ్వొద్దు అనే కసి కనిపిస్తోంది
• పేదలకు అన్నం పెట్టేందుకు కుప్పంలో పెట్టిన అన్నాక్యాంటీన్ రద్దు చేశారంటే వీళ్లు మనుషులా

• కుప్పంలో చిల్లర రాజకీయాల చేసి కుప్పి గంతులు వేసే వాళ్లకు ఇదే నా హెచ్చరిక. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆటలు ఆడారు. ఇక కోడ్ వచ్చింది…మీకూ పోలీసులు లేరు…మాకూ పోలీసులు లేరు. ఈసీ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాల్సిందే.
• పుంగనూరు నుంచి ఓ దోపిడీదారు వస్తాడు. కప్పం కట్టించుకోడానికి కుప్పం వస్తాడు. ఆ దోపిడీదారుడు దోచిందంతా కక్కిస్తా.
• మాజీ సీఎంగా, ప్రతిపక్షనేతగా నా నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అక్రమ కేసులు బనాయించారు. నాపై రౌడీయిజం చేశారు.
• గౌనివారి శ్రీనివాసులు సహా అందర్నీ జైల్లో పెట్టారు.
• అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం రాజకీయాలు చేస్తామంటే కుదరదు.
• కుప్పంలో చోటా మోటా రౌడీలకు ఇదే నా హెచ్చరిక. ఎన్నికలు సరిగా జరక్కుండా అడ్డుపడితే మీ సంగతి తేలుస్తా. ప్రజాస్వామ్యాన్ని కుప్పం ప్రజలు కాపాడాలి.
• కుప్పానికి హంద్రినీవా నీళ్లు అంటూ సైకో సీఎం హడావుడి చేశాడు. వచ్చాయా నీళ్లు?
• డ్రామాలాడతావా…సినిమా సెట్టింగులు వేస్తావా.? సీఎం వెళ్లాడు గేట్లు ఎత్తేశారు. జలగా నీళ్లేవి అంటూ మన తమ్ముళ్లు నిరసన తెలిపారు.

• నేను సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చా. 90 శాతం హంద్రినీవా పూర్తిచేశా.. 5 ఏళ్లు అధికారంలో ఉండి 10 శాతం పనులు పూర్తి చేయలేక పోయిన దద్దమ్మ, చవటలు మీరు…నన్నా మీరు విమర్శించేది.
• అధికారంలోకి రాగానే హంద్రినీవా నీళ్లు తెచ్చి కుప్పానికి నీరిస్తా..చెరువులన్నీ నింపుతాం.
• కుప్పం నియోజకవర్గానికి జగన్ తీరని అన్యాయం చేశారు.ఎప్పుడూ లేని విధంగా హింసా, దాడులు, కబ్జాలు, గ్రానైట్ మాఫియా వచ్చింది. శాంతిపురంలో కేజీఎఫ్ మాదిరి మొత్తం తవ్వేశారు.
• నేను ఫిర్యాదు చేస్తే రెండు రోజులు మౌనంగా ఉండి మళ్లీ గ్రానైట్ దోపిడీ మొదలెట్టారు.
• చివరకు ఆడపిల్లలపైనా అక్రమ కేసులు బనాయించారు. మా కార్యకర్తలను జైలుకు పంపారు. ఎదీ మర్చిపోను. వడ్డీతో సహా చెల్లిస్తా.
• మీతో నా ఈ బంధం ఈనాటి కాదు. 35 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. మీ కుటుంబసభ్యుడిగా చూశారు. కుప్పంలో ప్రతి ఇల్లూ నా ఇల్లే….ప్రతి ఊరూ..నా ఊరే.
• నన్ను ఓడిస్తామని, వై నాట్ కుప్పం అని కొందరు సైకోలు కుప్పిగంతులు వేశారు. నన్ను ఓడించడం వారి వల్ల కాదు…నేను అంటున్నా వై నాట్ పులివెందుల.?

• జగన్ నీకు ఓటెందుకు వేయాలి? బాబాయిని గొడ్డలికి బలిచేసినందుకా…రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినందుకా?
• కుప్పం నుంచే నేను ఎన్నికల శంఖారావంగా ప్రజాగళం మోగిస్తున్నా…ఈ తుపాను తీవ్ర వాయుగుండంగా మారి వైసీపీ నేతలు బంగాళాఖాతంలో కలిసిపోతారు.
• మే 13న ఉధృతంగా గాలివీయాలి. చెట్టూ, పుట్టా , గట్టూ మొత్తం సైకిల్ అనే మోత మోగాలి. ఫ్యాన్ చిత్తుచిత్తుగా ఓడిపోవాలి. 175 నియోజకవర్గాల్లో కూటమి గెలవాలి.
• వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు, బాదుడే బాదుడును ప్రజలు భరించారు. అందరూ నష్టపోయారు. నాతో సహా అందరూ బాధితులయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.
• సీఎం సొంత నియోజకవర్గం కడప ఒంటిమిట్టలో చేనేత వర్గానికి చెందిన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నారు.
• నేను సీఎంగా ఉండగా ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశాను. అక్కడ భూముల రేట్లు పెరిగాయి. దీంతో అక్కడి చేనేత కార్మికుడి భూములపై వైసీపీ నేతల కన్ను పడింది. రికార్డులు మార్చేసి ఆక్రమించారు. తట్టుకోలేని ఆ కుటుంబం ప్రాణాలు తీసుకుంది.
• విశాఖలో గన్ పెట్టి ఎన్ఆర్ఐ సొంత భూమి రాసివ్వమన్నారు. ఎందుకివ్వాలని ప్రశ్నించినందుకు వేధించారు. రికార్డులు మార్చారు. ఐదేళ్లుగా ఆయన పోరాడుతూనే ఉన్నాడు. సొంత భూమి కాపాడుకోడానికి కోట్లు ఖర్చు పెట్టాలా?
• తిరుపతిలోనూ ఎన్ఆర్ఐ డాక్టర్ సునీత భూమి కొంటే వైసీపీ నేతలు ఆ భూమి ఆక్రమించారు. ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఈ భూమి నీది కాదన్నారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆవేదనతో వీడియో పెట్టింది.

• పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అక్రమాలకు అడ్డే లేదు. జనార్థన్ నాయుడుకు చెందిన గ్రానైట్ క్వారీని బలవంతంగా రాయించుకున్నాడు. రూ.35 లక్షల కరెంట్ బిల్లు వస్తే…అది కూడా జనార్థన్ నాయుడుని కట్టాలని బెదిరించాడు.
• వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు.
• నంద్యాలలో అబ్దుల్ సలామ్ భార్యతో రైలు కింద పడి చనిపోయాడు. ఇలాంటి ఘటనలు ఊరూరా జరుగుతున్నాయి.
• విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్ తరలించారు. ఈ వ్యవహారంతో వైసీపీ నేతలకు లింకులున్నాయి. డ్రగ్స్ ను అరికట్టకపోతే యువత భవిష్యత్ నిర్వీర్యమైపోతుంది.
• ముస్లింలను కొందరు కావలని రెచ్చగొడతారు…మీరు నమ్మొద్దు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు మేమే కాపాడాం. ఉర్దూ రెండో బాష చేయడంతో పాటు వక్స్ బోర్డు ఆస్తులు కాపాడింది రక్షించాం.
• ఏపీపీఎస్సీని అవినీతిమయం చేశారు. చట్టాన్ని అతిక్రమించి అవినీతికి పట్టం కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
• కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ చేస్తున్నా.
• మన నియోజకవర్గంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తా…మహిళలకు ఉపాధి కల్పిస్తా. ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుంటాను.

• అర్హులందరికీ సొంతిళ్లు ఇస్తాం. జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, చిరు వ్యాపారులు, టీచర్లు, పేద- మధ్య తరగతి వర్గాలకు సరసమైన ధరలకే భూములు ఇస్తాను. ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలను చేస్తా.
• కుప్పాన్ని అభివృద్ధి చేసింది నేనే….జగన్ రెడ్డి కేవలం గాడిదలకు పళ్లు మాత్రమే తోమాడు. కుప్పాన్ని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్ గా తయారుచేస్తా.
• కుప్పం పచ్చని సుందర ప్రాంతం. ప్రకృతినీ వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు వైసీపీ కేటుగాళ్లు. కనీసం ఏనుగులను కట్టడి చేయలేని దద్దమ్మలు. కంచె వేయలేరా? ప్రజలను ఏనుగులకు అప్పగిస్తారా?
• గంగమ్మ గుడి గోపురం రాతితో కట్టేబాధ్యత నేను తీసుకుంటా. ఈ పవిత్ర కార్యం నాతోనే ప్రారంభం అవుతుంది.
• ప్రతిఒక్కరూ టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్థులకే ఓటేయండి. ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు.
• 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాలనే పొత్తు పెట్టుకున్నాం.

• ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అన్నదే నా అజెండా.
• 30 ఏళ్ల వెనక్కు నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని గాడిలోపెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుంది.
• కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 160పైగా ఎమ్మెల్యేలు మనం గెలవాలి. 24 ఎంపీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
• అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ మీ ఇంటికే వచ్చేలా చేస్తాం. బయటకు వెళ్లిన వారు రెండు నెలలు ఊర్లో లేకపోతే వారికీ పెన్షన్ ఇస్తాం.
• మన పాలనలో వ్యవస్థలపై దాడులు ఉండవు…భరోసా, భద్రత ఎన్డీయేతోనే సాధ్యం.

Leave a Reply